చంద్రబాబుకు మహిళలే బుద్ధి చెప్పారు

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా 
 

చిత్తూరు:  వైయ‌స్ఆర్ సీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు ఆర్కే రోజా చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.  చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తిరుగులేని మెజారిటీతో ఆమె గెలుపొందారు.  ఈ సంద‌ర్భంగా రోజా స్పందిస్తూ, తనను ఒకప్పుడు ఐరన్ లెగ్ అంటూ విమర్శించినవారికి ఈ విజయమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాల ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ట్ర మహిళలు తగినవిధంగా బుద్ధి చెప్పారని రోజా పేర్కొన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించిన నగరి నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా పాదాభివందనాలు తెలుపుకుంటున్నట్టు రోజా ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. జగనన్నను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించిన రాష్ట్ర ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు రోజా పేర్కొన్నారు.

Back to Top