ఆర్టీసీ విలీనంతో సీఎం వైయ‌స్ జగన్‌ చరిత్ర సృష్టించారు..

కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి

విశాఖపట్నం: ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే ఆర్టీసీ ఆస్తుల విక్రయానికి పునాది పడిందన్నారు. టీడీపీ హయాంలో అడ్డగోలుగా జరిగిన భూములు లీజుపై చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. 

కార్మిక సంఘాలపై ఆర్టీసీ అధికారులు కక్ష ధోరణితో వ్యవహరిస్తే  చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు విషయంపై కేంద్రంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. టీడీపీ.. ఆర్టీసీని భ్రష్ఠు పెట్టించిందని, ఏడు వేల కోట్లు అప్పులపాలు చేసిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ విలీనం ద్వారా 3,600 కోట్ల రూపాయలు భారమైనా వేతనాలు చెల్లిస్తున్నామని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.  

Back to Top