రియల్టర్లకు అనుకూలంగా బాబు నిర్ణయాలు

చంద్రబాబును తప్పించేందుకు ఎల్లో పత్రికలు ప్రయత్నం
అమరావతి గ్రామాలపై చంద్రబాబు కక్షకట్టారు

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల భూములకు ధరలు లేకుండా చంద్రబాబు కుట్ర

ల్యాండ్‌ పూలింగ్‌తో రైతులను మోసం చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

అమరావతి రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ న్యాయం చేస్తున్నారు

ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

తాడేపల్లి: అమరావతి గ్రామాల్లో రియల్టర్లకు అనుకూలంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు మేలు చేసేలా వ్యవహరించారని తప్పుపట్టారు. ల్యాండ్‌ పూలింగ్‌తో రైతులకు అన్యాయం చేసి తన వర్గానికి చంద్రబాబు మేలు చేశారని ధ్వజమెత్తారు. గ్రామ కంఠాల్లో ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలో కూడా లోపాలున్నాయన్నారు. అవినీతి కేసుల నుంచి చంద్రబాబును తప్పించేందుకు ఎల్లో పత్రికలు ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారధి శనివారం మీడియాతో మాట్లాడారు. 
కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి కూడా కారణం ఏంటంటే..చంద్రబాబు ఇరుక్కున్న రూ.2 వేల కోట్ల అవినీతి నుంచి ఆయన్ను తప్పించేందుకు కొన్ని పత్రికలు ఇలాంటి కథనాలు రాస్తున్నాయి. వాస్తవ పరిస్థితి ఒకసారి ఆలోచన చేస్తే..అమరావతి పరిసర ప్రాంతాలను గమనిస్తే..అమరావతి ప్రకటించకముందు రియల్‌ ఎస్టేట్‌ ఎలా ఉంది. తరువాత ఎలా ఉందో పరిశీలిస్తే..మంగళగిరి నియోజకవర్గంలోని 10 గ్రామాలు, తాడికొండ నియోజకవర్గంలోని 19 గ్రామాలను కలిపి రాజధాని ప్రాంతంగా ప్రకటించారు. మంగళగిరి చుట్టూ ఉన్న పది గ్రామాల్లో ఎకరా రూ.2 నుంచి రూ.4 కోట్లు ధర పలికింది. ఆ రోజుల్లో ఫూలింగ్‌ విధానం ప్రకటించినప్పుడు ఈ పది గ్రామాల రైతులు వ్యతిరేకించి భూములు ఇవ్వలేదు. చంద్రబాబు వాళ్ల మీద కక్షగట్టి..కక్షపూరిత నిర్ణయాలు తీసుకున్నారు. పూలింగ్‌కు సహకరించని గ్రామాలను గ్రీన్‌, రిజర్వ్‌, ఇండస్ట్రీ జోన్‌ అంటూ ప్రకటించారు. దీంతో భూముల ధరలు సగానికి పడిపోయాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల భూములకు ధరలు లేకుండా చంద్రబాబు కుట్ర చేశారు. ఈ 19 గ్రామాల్లో కూడా గ్రామ కంఠాల్లో ఎఫ్‌ఎస్‌ఐ 1.4గా ఇచ్చి, మిగతా  భూముల్లో 2.4 ఎఫ్‌ఎస్‌ఐగా ప్రకటించడంతో నివాసయోగ్య ధరలు పడిపోయాయి. ఖాళీ భూముల్లో, బిల్డర్స్‌కు ఉపయోగపడే భూముల్లో 2.4 ప్రకటించడంతో నివాసయోగ్య ధరలు పడిపోవడానికి చంద్రబాబు కారణం కాదా?. ఆ రోజు ఆ ప్రభుత్వ విధానం ఏంటంటే..ఫూలింగ్‌కు భూములు ఇచ్చిన ఎకరానికి రైతుకు 1450 గజాలు ఇచ్చారు.  రూ.4 కోట్లు ఎకరం ధరలు పలికిన ఉండవల్లిలోనూ 1450 గజాలు ఇచ్చారు. ఎకరం రూ.10 లక్షలు ఉన్న నేలపాడులో కూడా 1450 గజాలు ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలోని 10 గ్రామాల్లో రియల్‌ఎస్టేట్‌ కుదేలు కావడానికి చంద్రబాబు కాదా కారణం. 
ఆ రోజు భవన సముదాయాలు ప్రారంభించారు. ఇందులో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు ఉన్నారు. ఒక్క అపార్టుమెంట్‌కు కూడా అడ్వాన్స్‌ రాలేదని బిల్డర్స్‌ అంటున్నారు. రాజధాని కోసం కొంత మంది స్వచ్ఛందంగా భూములు ఇచ్చి త్యాగం చేశారు. వారి త్యాగాలను గౌరవించాల్సిందే. కానీ ఈ రోజు  కృత్రిమ ఉద్యమం సృష్టించి కొంత మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నడుపుతున్నారు. వారంత చంద్రబాబు పక్కనే కనబడుతున్నారు. వారు ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టలేదు. ఎల్లో పత్రికలకు రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడానికి కారణం తెలియదా? అక్కడ ఒక్క డ్రైనేజీ, రోడ్డు అయినా ఏర్పాటు చేశారు. రూ.3 లక్షల కోట్లు అప్పు చేసి కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కోసమే ఆలోచన చేస్తారు. కాంట్రాక్టర్లకు అధిక లాభాలు రావాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎటువంటి భవనాలు రాకుండా, పరిశ్రమలు రాకుండా నిబంధనలు విధించింది చంద్రబాబు కాదా?. పెనమలూరు రైతులు పడ్డ బాధ వింటే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు రాకముందు కోటి, రూ.2 కోట్లు పలికిన ఎకరం భూమి, చంద్రబాబు నిబంధనలతో రూ.50, 40 లక్షలకు పడిపోయింది వాస్తవం కాదా? చంద్రబాబు స్వార్థం కారణంగా ఎంతో మంది రైతులు నష్టపోయారు. ఆ రోజు చంద్రబాబు రాజధాని విషయంలో తప్పుడు ప్రకటనలు చేయడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పు చేసి నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతాల్లో భూములు కొన్నారు. ఆ వాస్తవాలు ఈ పచ్చ పత్రికలకు కనిపించడం లేదు. మూడు రాజధానుల కారణంగా అభివృద్ధి జరుగుతుందని రియల్‌ ఎస్టేట్‌ అసోసియేషన్‌ సభ్యులు భావిస్తున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా, అమరావతిని లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌గా, కర్నూలును జ్యూడిషియల్‌ క్యాపిటల్‌గా సీఎం వైయస్‌ జగన్‌ ప్రతిపాదించారు. అమరావతి రైతులకు కూడా సీఎం వైయస్‌ జగన్‌ మంచి ప్యాకేజీ ఇచ్చారు. ఇంతకు ముందు చంద్రబాబు తన స్వార్థంతో విధించిన జోనింగ్‌ నిబంధనలు కూడా సరళీకృతం చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉంది. రియల్‌ ఎస్టేట్‌ పడిపోవడానికి ఈ రోజు ఉన్న పరిస్థితులు కారణం కాదు. రెండు మూడేళ్లుగా జీఎస్టీ, డీమానిటేషన్‌, స్వతహాగా ఉన్న అత్యధిక ధరల కారణంగా రియల్‌ ఎస్టేట్‌ కొంత ఇబ్బందిగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఈ ఏడాది వర్షాలు బ్రహ్మండంగా పడ్డాయి. పంటలు కూడా బాగా పండాయి. రైతుల వద్ద డబ్బులున్నప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి మేలు జరుగుతుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో వ్యవసాయ రంగం కుదేలు అయ్యింది. వైయస్‌ జగన్‌ హయాంలో వ్యవసాయం బ్రహ్మండంగా ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పుంజుకుంటుంది. చంద్రబాబును అవినీతి ఆరోపణల నుంచి తప్పించేందుకు ఎల్లో పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఏ వివిధ డిపార్టుమెంట్లు ఇచ్చే సమాచారాన్ని సీఎంకు ఇస్తారు. ఏ సీఎం పీఏ కూడా కాంట్రాక్టర్లకు సంబంధించి డబ్బు లావాదేవీలు పెట్టుకోరు. సీఎం పీఏ రాష్ట్రంలోని కాంట్రాక్టర్ల డైరీలు మెయింటెన్స్‌ చేయరు. రూ.2 వేల కోట్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా ఇలాంటి కథనాలు రాస్తోంది.  చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పీఏగా శ్రీనివాసరావు ఉండేవారు. అమరావతిని బంగారు గుడ్డు పెట్టే బాతుగా చంద్రబాబు భావించారు. అన్యాయంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఒక కల్పతరువుగా భావించారే తప్ప..రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. సంక్షోభాన్ని చంద్రబాబు అవకాశంగా మల్చుకున్నారు. చంద్రబాబు సర్పంచ్‌ స్థాయికి దిగజారిపోయారు. పత్రికలు ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి.

Back to Top