వచ్చే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభంజనం

రాష్ట్రాభివృద్ధిలో చంద్రబాబు విఫలం

రాష్ట్రానికి వైయస్‌ జగనే ప్రత్యామ్నాయం

వైయస్‌ఆర్‌సీపీ బాపట్ల అభ్యర్థి కోన రఘుపతి

 

చంద్రబాబు ఆరు వందల హామీలు ఇచ్చి మరిచారని  బాపట్ల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి  కోన రఘుపతి  అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. బాపట్ల వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ప్రతి వర్గాన్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. .రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ భావిస్తున్నారన్నారు.వైయస్‌ జగన్‌కు పట్టాభిషేకం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు.

–అసమర్థ సీఎం చంద్రబాబు:ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా తీసుకురాలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైయస్‌ఆర్‌సీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.రాష్ట్రంలో దోపిడీ,అవినీతి తప్ప సంక్షేమం,అభివృద్ధి లేదన్నారు. రాష్ట్ర రాజధాని కూడా చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోయారన్నారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలంతా  ఒక అభిప్రాయానికి వచ్చారన్నారు. వైయస్‌ జగన్‌ను సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

Back to Top