బాబు పాల‌నంతా శంకుస్థాప‌న‌ల‌తోనే స‌రి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఐజ‌య్య‌
 

కర్నూలు : చంద్రబాబు పాలన మొత్తం శంకుస్థాపనలతోనే నిండిపోయిందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన ఓటర్ల డేటా చంద్రబాబు వద్దకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్‌ పేరుతో చంద్రబాబు, అతని కొడుకు లోకేష్‌ భారీ స్కామ్‌కు దిగారని అన్నారు. ఎన్నికల సంఘం చొరవ తీసుకుని తండ్రీ, కొడుకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు టీడీపీ వ్యతిరేకుల ఓట్లు తొలగించే కార్యక్రమానికి తెరలేపాడని మండిపడ్డారు. 
 

Back to Top