జగనన్న పాలనలో మహిళలంతా సంతోషంగా ఉన్నారు

మహిళలను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తున్న నాయకుడు జగనన్న

మహిళా సంక్షేమం, సాధికారతకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది

మహిళా సాధికారతపై చర్చలో వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి

అసెంబ్లీ: స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎంతోమంది పాలకులు మారారు కానీ, మహిళల సంక్షేమం కోసం ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేసినన్ని పథకాలు, సంస్కరణలు మరెవరూ చేయలేదని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళల కోసం  ప్రతి నాయకుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ బిల్లును ఆమోదించింది కానీ, దీని కంటే ముందే రెండున్నరేళ్ల క్రితమే సీఎం వైయస్‌ జగన్‌ మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తీసుకువచ్చారని ఎమ్మెల్యే ధనలక్ష్మి గుర్తుచేశారు. నామినేటెడ్‌ పోస్టులు, పదవుల్లోనూ 50 శాతానికి మించి రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారని, ఆర్థిక స్థితిగతులూ మెరుగుపరుస్తున్నారని చెప్పారు. 

అసెంబ్లీలో మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చలో ఎమ్మెల్యే ధనలక్ష్మి పాల్గొని మాట్లాడారు. ‘‘కార్పేరేషన్‌ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైస్‌ఎంపీపీలు, సర్పంచ్‌లు ఇలా మహిళలకు 50 శాతం పదవులు సీఎం వైయస్‌ జగన్‌ కల్పించారు. రిజర్వేషన్‌ అమలు మాత్రమే కాకుండా రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలందరికీ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్థికాభివృద్ధిలో మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు ఉపాధి, విద్య. ఆరోగ్యం అందించడం ద్వారా వారి సంక్షేమం, సాధికారత కోసం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మున్ముందు కూడా కట్టుబడి ఉంటుంది. 

కుటుంబంలోని మహిళలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. 2014లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పి మోసం చేశారు. బాబు మాటలు విని మోసపోయిన అక్కచెల్లెమ్మలు అప్పులు పెరిగిపోయి రోడ్డునపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తానని వైయస్‌ జగన్‌ మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ 7,96,553 స్వయం సహాయక సంఘాలకు గానూ రూ.25,516 కోట్లు ఇప్పటికే మూడు విడతల్లో అందించారు. రంపచోడవరం గిరిజన నియోజకవర్గంలో 11 మండలాలకు కలిపి రూ.80 కోట్ల అప్పు ఉంది. గిరిజన ప్రాంతంలోని మహిళలు రూ.80 కోట్ల అప్పు తీర్చగలరా అనే పరిస్థితి నుంచి సీఎం వైయస్‌ జగన్‌ అందిస్తున్న వైయస్‌ఆర్‌ ఆసరా ద్వారా రూ.60 కోట్ల రుణమాఫీ జరిగింది. మరో రూ.20 కోట్లు కూడా జగనన్న చేస్తారని మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైయస్‌ఆర్‌ చేయూత, కాపు మహిళలకు కాపు నేస్తం ద్వారా ఆర్థికసాయం అందిస్తున్నారు.  గతంలో పింఛన్ల కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది. రూ.1000 పింఛన్‌ కోసం వృద్ధులు రూ.500 ఆటో చార్జీలకే ఖర్చు చేసేవారు. కానీ, జగనన్న ప్రభుత్వంలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పింఛన్లు వస్తున్నాయి’ అని ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు.

Back to Top