టీడీపీ అంటే ట్రైబల్ ద్రోహుల పార్టీ

భాగ్యలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే
 

 

గిరిజన పక్షపాతిగా ఆలోచిస్తూ, గిరిజన చట్టాలను రక్షిస్తున్న రక్షకుడు వైయస్ జగన్. దేశ నిర్మాణంలో దళితుల పాత్ర మరువలేనిది. అల్లూరి సీతారామరాజు, మల్లు దొర, ఘంటం దొర వంటి వారంతా స్వాతంత్ర్య పోరాటంలో వారి సేవలు చిరస్మరణీయం. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, మౌలిక వసతులు, సౌకర్యాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నాం. గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలూ మనుషులే అని గుర్తించిన ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.
2006 లో అటవీ హక్కుల చట్టం తెచ్చారు రాజశేఖర్ రెడ్డి. అడవి మీద హక్కు గిరిజనలకు మాత్రమే ఉందని అన్నారాయన. పోడు వ్యవసాయం చేసిన వారందరికీ పట్టాలు పంపిణీ చేసారు. RFR క్రింద కూడా పట్టాలు ఇష్యూ చేస్తూ, రైతు భరోసా పథకానికి వారినీ అర్హులను చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు వైయస్ జగన్. 105, 107 షెడ్యూల్ యాక్టులను ఉల్లంఘిస్తూ గత టీడీపీ ప్రభుత్వం ఎన్నో పనులు చేసింది. జీవో 97 విడుదల చేసి ఖనిజ సంపదను దోచిపెట్టే ప్రయత్నం చేసింది.ఆదివాసీ దినోత్సవం రోజే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం టీడపీ. గిరిజనులకు అడుగడుగునా అన్యాయం చేస్తూ,  కనీసం మనుషులుగా చూడని ప్రభుత్వం ఎన్నో చేసామని చెప్పుకోవడం దురదృష్టకరం. సీఎం జగన్ గారి నాయకత్వంలో ఇవాళ గిరిజనులకు పూర్తిగా న్యాయం జరిగింది. మొట్టమొదటి సారిగా గిరిజన మహిళలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, గిరిజన శాఖ అప్పగించారు జగన్. మాకున్న సమస్యలను ప్రస్తావిస్తూ, వాటికి పరిష్కారం దొరికుతుందనే నమ్మకం కలగడానికి కారణం కేబినెట్లో మాకంటూ ఓ మంత్రి ఉండటం వల్లే. ట్రైబల్ ఎడ్వైజరీ కౌన్సిల్ గురించి కూడా ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి. గత ప్రభుత్వం ఒక్క సారి కూడా ట్రైబల్ ఎడ్వైజరీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదు. ఈ ప్రభుత్వం ఒక నెల క్రిందటే విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ మేము మా సమస్యలు అన్నీ వివరంగా చర్చించడం జరిగింది. నాన్ షెడ్యూల్డ్ గ్రామాల సమస్య ఒకటి వాటిలో ఉంది. అరకు ప్రాంతంలోని అనంతగిరి మండలంలో నాన్‌ షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాలుగా మార్చమని కోరాం. ఇదే సమస్యపై నేను ఎన్నోఏళ్లుగా పోరాడుతున్నాను. అయితే ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని 554 నాన్‌ షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ చేస్తూ ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. జీవో నెం 3 ప్రకారం షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించాలన్న అంశంపై ఇన్నాళ్లూ ఏ ఒక్క నాయకుడూ దృష్టి సారించలేదు. మొట్టమొదటిసారి సీఎం జగన్ వాలంటీర్, సచివాలయ వ్యవస్థని, బ్యాక్ లాగ్ పోస్టులను గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులకే ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అన్ని విధాలుగా గిరిజనులను  వంచించారు కనుకే నేడు టీడీపీని ట్రైబల్ ద్రోహుల పార్టీగా అభివర్ణిస్తున్నారు.

Back to Top