అమరావతి: మంగళగిరి ఎన్నికల ఫలితాలు తారుమారు చేసేందుకు టీడీపీ కుట్ర చేస్తుందనిౖ వెయస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. మంగళగిరి కౌంటింగ్‌లో టీడీపీ గొడవలు సృష్టించే అవకాశముందని సీఈవోకు ఆర్కే ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘాన్నే చంద్రబాబు బెదిరిస్తున్నారని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందిని కూడా భయపెట్టే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం తనయుడే అభ్యర్థి కావడంతో వివాదాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. ఫలితాలను తారుమారు చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంత కౌంటింగ్‌కు పోలీసు సిబ్బందిని అదనంగా నియమించాలని సీఈసీని ఆర్కే కోరారు. మంగళగిరి కౌంటింగ్‌పై అదనపు అబ్జర్వర్‌ను నియమించాలని డిమాండు చేశారు.