పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించడమే ప్ర‌భుత్వ‌ లక్ష్యం  

వైయ‌స్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌

క‌ర్నూలు:  ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్క పేదవారికి నాణ్యమైన కార్పోరేట్‌ వైద్యం అందించడమే ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లక్ష్యమని వైయ‌స్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌ అన్నారు.  డాక్ట‌ర్ స‌తీష్, ఎస్ ఎస్ కె సమాజ్ ఆధ్వ‌ర్యంలో కోడుమూరులో రామాలయ దేవాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం అందిస్తున్న వైద్య‌సేవ‌లు, ఆరోగ్య‌శ్రీ సేవ‌ల‌ను డాక్ట‌ర్ స‌తీష్ గ్రామ ప్ర‌జ‌ల‌కు వివ‌రించి చైత‌న్య‌వంతం చేశారు.  ఈ వైద్య శిబిరానికి గ్రామ‌స్తుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. గ్రామ‌స్తుల‌ను కంటి పరీక్షలు, గుండెకు సంబంధించి ఈసీజీ, బీపీ షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి వైద్యులు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంత‌రం డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌ గారిని, కిమ్స్ హాస్పిటల్ సిఓ సునీల్ కుమార్ ను సిబ్బందిని ఎస్ ఎస్ కె సమాజ్, రామాలయ కమిటీ సభ్యులు పూలమాలవేసి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది, మైపర్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆలయ కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.

Back to Top