ఎల్లుండి వైయ‌స్ఆర్‌సీపీ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించింది.  పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించారు. ఫ్యాన్‌ జోరుకు అధికార టీడీపీ బేజార్‌ అయింది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  150  సీట్ల ఆధిక్యం సాధించడంతో తమ్ముళ్లు ముఖం చాటేశారు. ఫలితాలన్ని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కి ఏకపక్షంగా వస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎల్లుండి వైయ‌స్ఆర్‌సీపీ శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్న‌ట్లు పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  ఆ స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఎప్పుడు ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌న్న‌ది నిర్ణ‌యిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.

Back to Top