బాబుకు ఎందుకు అంత భయం

సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి భయటపడుతుందనా..?

చంద్రబాబువన్నీ హాస్యాస్పదమైన ఆరోపణలే

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనను రాష్ట్రమంతా హర్షిస్తోంది

పార్టీ వాగ్దానాలకు, ప్రభుత్వ వాగ్దానాలకు తేడా తెలియదా బాబూ..?

ప్రజలను మభ్యపెట్టి విచారణ నుంచి తప్పించుకోవడం సాధ్యపడదు

దాడుల గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేపట్టి పక్షం రోజులు కాకముందే ప్రతిపక్ష నేత హోదా చంద్రబాబు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పది రోజుల పాలన చూసి ప్రజలంతా హర్షిస్తుంటే చంద్రబాబు మాత్రం ఆధారాలు లేని హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం నుంచి చంద్రబాబు ఇంకా కోలుకోలేదేమోనని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, వాటిని సమీక్షించి యాక్షన్‌ తీసుకుంటామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. చంద్రబాబు అవినీతి ఎక్కడ బయటపడుతోందనని ఆరోపణలు చేస్తున్నట్లుగా అర్థం అవుతుందన్నారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడారో.. ఆయన మాటల్లోనే..

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివిధ విషయాలపై ఉన్నతాధికారులతో సమీక్షలు చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసుకున్నారు. 8వ తేదీన పూర్తి మంత్రివర్గం ఏర్పడి నిన్న సోమవారం తొలి కేబినెట్‌ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులకు ఇవ్వాల్సిన బాధ్యతలు, ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాధాన్యతల గుర్తించి, పరిపాలన ఏ విధంగా ఉండాలనే దిశానిర్దేశం చేశారు. నిన్న బాధ్యత చేపట్టి పరిపాలన మొదలైందో లేదో.. ప్రతిపక్షాల ఆరోపణలు ముందుగా మొదలయ్యాయి. 
సాక్షాత్తు చంద్రబాబే ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆరోపణలతో ప్రారంభించారు. ఆరోపణలు చేస్తే అభ్యంతరం లేదు.. ఏ విధమైన ఆరోపణలు అనేది చంద్రబాబు, ఆయన సహచరులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అభివృద్ధిని ఆపుతున్నారని ఆపోద్దు అని చంద్రబాబు మాట్లాడుతున్నారు. నిన్న జరిగింది కేవలం భవిష్యత్తు ప్రణాళిక మాత్రమే. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడు హాస్యాస్పదంగా ఆరోపణలు చేస్తున్నారు. 

ఎలక్షన్‌ కోడ్‌ చివరి రోజు వరకు చంద్రబాబు కేబినెట్‌ సమావేశాలు చేపట్టి కేటాయింపులు చేస్తానే ఉన్నాడు. ఎక్కడైనా ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్నప్పుడు బిల్లులు చెల్లింపులు చేస్తారా..? నీ నైతికత, నీ బాధ్యత ఆలోచించుకోకుండా వీటి గురించి విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. నూతన ప్రభుత్వం నిన్న తీసుకున్న నిర్ణయాలు సీఎం వైయస్‌ జగన్‌ గత వారం రోజులుగా చేస్తున్న ప్రయారిటీలు వాటిని రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తున్నారు. ఎన్నికల్లో జరిగిన ఘోర పరభవం నుంచి ఇంకా కోలుకోలేదో తెలియదు కానీ, సాగునీరు ఎద్దడి తీవ్రంగా ఉంది అన్ని ప్రాంతాలకు నీరు అందించేందుకు ప్రారంభించిన ప్రాజెక్టులను ఏకపక్షంగా నిలిపివేయడం సరికాదని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉంది. నిలిపివేసిన ప్రాజెక్టులు ఒక్కటి చూపించగలరా చంద్రబాబూ..?

ప్రాజెక్టుల అంచెనాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. పెంచిన అంశాలను సమీక్షించి యాక్షన్‌ తీసుకుంటామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. పెంచిన అంచెనాలను సమీక్షించవద్దు.. అని చంద్రబాబు ఉద్దేశం. ఎవరో ఆపుతున్నట్లుగా మభ్యపెట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడు. రాయలసీమలో నీటి పారుదల ప్రాజెక్టులు ఆనాడు ఎన్టీఆర్, తరువాత జలయజ్ఞంలో భాగంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులు నిర్మించారు. చంద్రబాబు ప్రారంభించిన ప్రాజెక్టు అంటూ ఒక్కటీ లేదు. ప్రజలకు తప్పుడు సందేశం పంపించాలనే చంద్రబాబు ప్రయత్నం అవివేకం. 

చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. వైయస్‌ జగన్‌ ఎన్నికల ముందు నుంచి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లో అవినీతి భారీగా సాగుతోంది. వాటిని సమీక్షిస్తామని చెబుతున్నారు. ఆ మా ప్రకారం సమీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు అవినీతిని బయటకు తీస్తాడనే భయంతో ఆరోపణలు చేస్తున్నాడు. ప్రభుత్వాలు మారినా.. ఎవరు అధికారంలోకి వచ్చినా అభివృద్ధి పనులు నిలిపివేయడం మంచిది కాదని, రైతు రుణమాఫీ నాలుగు, ఐదు విడతలు ఇవ్వలేదు అది మీరు ఇవ్వాలని చెబుతున్నాడు. రైతు రుణమాఫీ అని పార్టీ పరంగా వాగ్దానం చేశావు. ప్రభుత్వపరంగా చేయలేదు. చేసిన వాడివి నీ హద్దు ఏంటో నీకు తెలియాలి బాబూ.. ఐదేళ్లలో ఎంత వరకు తీర్చగలవో అప్పడే నెరవేర్చాలి. రూ. 87,612 కోట్ల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి కోటయ్య కమిటీ అని చెప్పి దాన్ని రూ. 24 కోట్లకు దించి ఇచ్చింది 2015–16లో రూ. 3186 కోట్లు, 2016–17 రూ. 3289 కోట్లు, 2017–18 రూ. 3700 కోట్లు, 2018–19 రూ. 6300 కోట్లు విడుదల చేస్తానని చెప్పి రూ. 1250 కోట్లు విడుదల చేశాడు. ఐదో విడత విడుదల చేసింది సున్నా.. మొత్తం కలిసి రూ. 11,425 కోట్లు ఇచ్చాడు. చంద్రబాబు ఒకసారి గుర్తు తెచ్చుకోండి రూ. 87,612 మాఫీ చేస్తానని ఆ కమిటీ ఈ కమిటీ వేసి రూ. 24 వేల కోట్లకు దించి మీటింగ్‌లలో, సభల్లో రూ.24 వేల కోట్లు మాపీ చేశామని చెప్పుకున్నారు. పార్టీ వాగ్దానాలకు, ప్రభుత్వ వాగ్దానాలకు తేడా తెలియదా చంద్రబాబూ. 

బేస్‌లెస్‌ ఆరోపణలు చేసే ముందు వెనకా ముందు మొత్తం డేటా తెప్పించుకోని ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకోవాల్సిందిగా చంద్రబాబుకు, ఆయన సహచరులకు సలహా ఇస్తున్నా.. సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి చాలా జరిగింది. పోలవరంలో ప్రత్యేకంగా అవినీతి జరిగింది కాగ్‌ కూడా బయటపెట్టింది. దానికి కూడా చంద్రబాబు దగ్గర సమాధానం లేదు. అవినీతి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి చర్యలు తీసుకుంటామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పడం తప్పా.. కొత్త కొత్త డెఫినేషన్లు తీసుకువచ్చి జరగబోతున్న ఇన్వెస్టిగేషన్ల నుంచి చంద్రబాబు తప్పించుకోవాలనుకోవడం సాధ్యపడేది కాదు. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి అనేక చోట్ల టీడీపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయి.. అక్రమంగా కేసులు పెడుతున్నారు. వీటిని ఖండిస్తున్నా అని చంద్రబాబు అంటున్నారు. వైయస్‌ఆర్‌ సీపీ నేత నారాయణరెడ్డిని హత్య చేస్తే నీ హయాంలో నీకు అది చిన్నచూపుగా ఉంది. చిత్తూరులో జంట హత్యలు జరిగితే చంద్రబాబుకు చిన్నదిగా ఉంది. ఉన్నతాధికారి వనజాక్షిని చింతమనేని జుట్టుపట్టుకొని దాడి చేస్తే నీకు అది చిన్నది. దాదాపు 800ల మంది వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడితే నీకు అది గుర్తుకురాలేదు. నర్సరావుపేటలో దాడులు జరుగుతున్నాయంట. అది ఆధారాలతో నిరూపించాలి. పరిపాలన ప్రారంభమైన మొదటి రోజు నుంచి దాడులు జరుగుతున్నాయంటే.. గతంలో మీరు చేపించిన హత్యలు, అరాచకాలు, అవమానాలు, అక్రమ కేసులపై ఎక్కడైనా వాటిపై విచారణ ఉందా..? సాక్షాత్తు విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేతపై హత్యాప్రయత్నం జరిగితే దానిపై విచారణ జరిపించండి అంటే కోడి కత్తి, వారి అభిమానే, చెప్పకుండా హైదరాబాద్‌ వెళ్లారని ఇన్ని చేశారని చంద్రబాబును ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిలదీశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top