చంద్రబాబువి పగటి కలలు

వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు పృధ్వీ రాజ్‌

 

 

వైయస్ఆర్  జిల్లా : అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని  వైయస్ఆర్ సీపీ  రాష్ట్ర కార్యదర్శి, సినీ నటుడు పృధ్వీ రాజ్‌ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మళ్లీ టీడీపీ గెలుస్తుందని చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా వైయస్‌ జగన్‌ ఒక్కసారి సీఎం కావాలని కోరుకున్నారని, మే 23 తర్వాత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరకాసుర పాలన అంతానికి ఇంకా కొద్దిరోజులే ఉందన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని, మళ్లీ రాజన్న రాజ్యం ఏర్పడి అందరూ సుభిక్షంగా ఉంటారని పృధ్వీ పేర్కొన్నారు. 

 

Back to Top