మార్గదర్శి అక్రమాలకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు

మార్గదర్శి చిట్స్, ఫైనాన్షియల్స్ ఆర్థిక నేరాలకు వత్తాసు

కోర్ట్ కేసులను నీరుగార్చేందుకు చంద్రబాబు సహకారం

వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజం

సీఐడీతో కనీసం కోర్ట్ లో అప్పీల్ కూడా వేయనివ్వడం లేదు

మార్గదర్శి కేసు రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థిక నేరం

చంద్రబాబు ప్రభుత్వ మద్దతుతో కేసు నుంచి బయటపడుతున్నారు

మీడియా మాఫియాతో చంద్రబాబు కుమ్మక్కు

 పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థికనేరంకు పాల్పడిన 'మార్గదర్శి చిట్స్, మార్గదర్శి ఫైనాన్షియల్స్' కేసులను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోందని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఈనాడు సంస్థలకు చెందిన మీడియా మాఫియా అండ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆర్థిక నేరాల నుంచి మార్గదర్శికి విముక్తి కల్పించేందుకు శక్తివంచన లేకుండా సహకారాన్ని అందిస్తోందని ఆరోపించారు. 2006 లోనే దాదాపు రూ.2610 కోట్ల రూపాయలను మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి చట్ట వ్యతిరేకంగా డిపాజిట్ల రూపంలో సేకరించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన కేసు నుంచి మార్గదర్శిని బయటపడేసేందుకు చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా ఆయన ఏమన్నారంటే...

ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు చెరుకూరి రామోజీరావుకు మార్గదర్శి చిట్ ఫండ్స్, మార్గదర్శీ ఫైనాన్షియల్స్ అనే రెండు సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా ఆనాడు రామోజీరావు ప్రజల నుంచి రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్దంగా, చట్ట వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయలు డిపాజిట్ల రూపంలో సేకరించారు. ఈ విషయాన్ని అప్పటి పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ బయటపెట్టారు. రామోజీరావు పాల్పడిన ఈ ఆర్థిక నేరంపై ప్రజల నుంచి ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ కు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో వీటిపై కేసులు నమోదయ్యాయి. 2006 లెక్కల ప్రకారం రామోజీరావు తన మార్గదర్శి సంస్థల ద్వారా 2.75 లక్షల మంది నుంచి రూ.2610 కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించారు. రిజర్వ్ బ్యాంక్ 1984 చట్టం ప్రకారం బ్యాంకులు మాత్రమే డిపాజిట్లు సేకరించాలి. ఇతర ఏ సంస్థలు సేకరించినా అది నేరం. పత్రికను నడుపుతూ ఆర్థిక నేరాల గురించి నిత్యం పత్రికల్లో కథనాలు రాయించే రామోజీరావు తాను అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న విషయం తెలిసే చట్టాలను ఉల్లంఘించారు. తన చేతిలో మీడియా ఉంది, తనను ఎవరూ ప్రశ్నించలేరు, ఎవరైనా తన అక్రమాలను ప్రశ్నిస్తే వారిపై తన మీడియా మాఫియాను ప్రయోగిస్తాననే ధీమాతో రామోజీరావు వ్యవహరించారు. మార్గదర్శి సంస్థలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అప్పటి సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి దీనిపై విచారణకు సీఐడీని ఆదేశిస్తూ 2006లో జీఓలు 800, 801 జారీ చేశారు. తరువాత సిఐడీ అధికారులు విచారణ జరిపి రామోజీ ఆర్థిక నేరాలపై కోర్ట్ కు చార్జిషీడ్ సమర్పించారు. తరువాత ప్రభుత్వాలు మారడం, తిరిగి రామోజీరావు తన మీడియా మాఫియాతో పాలకులను ప్రభావితం చేసే స్థాయిలో తన ఆర్థిక నేరాల నుంచి బయటపడేందుకు పావులు కదిపారు. 

- కేసు నుంచి విముక్తి కోసం కుయుక్తులు

రాష్ట్ర విభజన తరువాత 31.12.2018 నాడు ఏపీ ఉమ్మడి హైకోర్ట్ ఆఖరి పనిదినం రోజున రామోజీ ఆర్థిక నేరాలకు సంబంధించిన మార్గదర్శి కేసులో ఫిర్యాదుదారికి నోటీసులు లేకుండా, ఎటువంటి వాదనలు వినకుండా, రిజర్వ్ బ్యాంక్, ఏపీ ప్రభుత్వాన్ని పార్టీ చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా కేసును రామోజీరావు క్వాష్ చేయించుకోవడం జరిగింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న ఫిర్యాదుదారు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్ట్ కు వెళ్ళి క్వాష్ పిటీషన్ ను కొట్టేయించారు. తిరిగి ఈ కేసును విచారించాలని తెలంగాణ కోర్ట్ ను సుప్రీంకోర్ట్ ఆదేశించింది. విచారణలో ఉన్న ఈ కేసులో రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ తానే హిందూ అవిభక్త కుటుంబానికి కర్తను అని ఇంప్లీడ్ పిటీషన్ వేశారు. ఇటీవల రామోజీరావు చనిపోయాడు కాబట్టి కేసును కొట్టేయాలని రామోజీరావు తరుఫు న్యాయవాదులు తాజాగా కోర్ట్ లో కొత్త వాదనను తీసుకువచ్చారు. దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నుంచి సీఐడీ కనీసం అప్పీల్ కూడా చేయకుండా మార్గదర్శి కేసు కొట్టేసేందుకు సహకరిస్తున్నారు. అంటే గత అయిదేళ్ల పాటు వైయస్ జగన్ ప్రభుత్వంపై నిత్యం ఈనాడు పత్రికను అడ్డం పెట్టుకని దుష్ర్పచారం చేయించినందుకు గానూ చంద్రబాబు ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శికి అనుకూలంగా క్విడ్ ప్రో కో కింద సహకరిస్తున్నాడు. 

- మార్గదర్శి సంస్థలో అనేక ఆర్థిక అక్రమాలు

మార్గదర్శి చిట్స్ లో జిల్లాలో సేకరించిన అమౌంట్లు హెడ్ ఆఫీస్ కు పంపడం చిట్స్ చట్టం ప్రకారం నేరం. జిల్లాల్లో సేకరించిన డబ్బులో కొందరు మధ్యలో చిట్స్ నిలిపివేస్తే, వాటిని మార్గదర్శి ఖాతాలో వేసుకుని, వారి ఆస్తులుగా చూపించారు. మార్గదర్శి బ్యాలెన్స్ షీట్ లో ఆస్తులు, అప్పులను సక్రమంగా చూపలేదు. ప్రజల సొమ్మును అక్రమంగా తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులుగా పెట్టారు. రూ.2610 కోట్లు డిపాజిట్లుగా చూపి, దానిలో 1300 కోట్లు నష్టాలుగా చూపించారు. ప్రజల డబ్బు చీటీల రూపంలో తమ వద్ద పెడితే, దానిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి సగానికి పైగా నష్టాలు వచ్చినట్లు చూపారు. ఇవ్వన్నీ సీఐడీ విచారణలో కూడా వెలుగుచూశాయి. వైయస్ఆర్ ప్రభుత్వంలో రంగాచారి కమిటీని నియమించింది. దీనిని ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. మార్గదర్శిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులపై వ్యక్తిగత దాడిగా ఈనాడు పత్రికలో బుదరచల్లే రాతలు రాస్తూ వారిని భయపెడుతున్నారు. సీఎం చంద్రబాబు అండతో వారికి పోస్టింగ్ లు ఇవ్వకపోవడం, బదిలీలు చేయించడం చేస్తున్నారు. ఈనాడు గ్రూప్ కు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై పార్లమెంట్ లో ప్రశ్నించిన వైయస్ఆర్ సీపీ ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబంపై ఈనాడు పత్రిక దుర్మార్గమైన తప్పుడు రాతలతో వేధిస్తోంది. జేజే రెడ్డి మార్గదర్శి చిట్ ఫండ్ ప్రారంభకుల్లో ఒకరైతే, ఆయనను శంకగిరి మాన్యాలు పట్టించి, వారి ఆస్తులు గుంజుకుని, దేశం నుంచి పరారయ్యేలా చేశారు. మీడియా మాఫియాగా చీకటి వ్యాపారాలకు పాల్పడుతూ, అధికార తెలుగుదేశం పార్టీతో అంటకాగుతూ, ప్రజల్లో తమకు వ్యతికులపై విషప్రచారానికి దిగుతున్నారు. ప్రభుత్వాలు తమ చెప్పుచేతల్లో ఉంటాయని, మేం తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని అయినా గద్దె దించుతామనే అహంకారంతో ఉన్నారు.

- ఏపీలో రాజ్యహింస కొనసాగుతోంది

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యహింస కొనసాగుతోంది. ప్రజల ప్రాథమిక హక్కులకు రక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలకు పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకుని అరాచక పాలనను సాగిస్తోంది. ఏపీలో రాజ్యాంగ విఛ్చీన్నత కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కక్షపూరితంగా కేసు పెట్టి జైలుకు పంపారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులే వారి నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఏపీలో పూర్తిగా మంటగలిసాయి. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే సోషల్ మీడియాపై ఉక్కుపాదంతో అణిచివేత జరుగుతోంది. పోలీస్ యంత్రాంగంతో పాటు అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏపీలో జరుగుతున్న రాజ్యహింసపై విచారణక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషన్ ను వేయాలి. ఈ అరాచకాలను వెలుగులోకి తీసుకువచ్చి పాలకులకు గుణపాఠం నేర్పాలి.

Back to Top