చంద్రబాబు పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి

చంద్రబాబూ..ఎందుకీ పాడు జీవితం

చంద్రబాబు బస్సు యాత్ర ఎందుకు? 

వైయస్‌ జగన్‌ అవినీతి రహిత పాలన అందిస్తున్నారు

ఏపీ వైపు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు.

చంద్రబాబు, పచ్చ మీడియాకు కంటి దోషం పట్టింది

పచ్చ మీడియాకు కంటి వెలుగులో పరీక్షలు చేయించాలి

చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుంది

వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి

తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాపం పండే రోజులు దగ్గరపడ్డాయని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు ప్రజాధనాన్ని దోచుకొన్న వ్యక్తి ఇవాళ ప్రజల మధ్యకు సిగ్గులేకుండా వచ్చి ప్రభుత్వంపై  ఆరోపణలు చేస్తున్నారని, ఆయన యాత్రలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. చంద్రబాబు అవినీతి పుట్ట పగిలిందని, కేసుల భయంతో పిచ్చినట్లు మాట్లాడున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు కంటి దోషం పట్టుకుందని, వైయస్‌ఆర్‌ కంటి వెలుగు పథకంలో వీరికి చికిత్స చేయించాలని కోరారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. 
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక..ప్రతి ప్రాజెక్టులోనూ రివర్స్‌ టెండరింగ్‌ చేపడుతున్నారు.  ప్రతి పనిని జ్యుడిషియల్‌ విచారణ ద్వారా పారదర్శకంగా చేపడుతున్నారు.   ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని గతంలో అవినీతిలో నంబర్‌ వన్‌గా చంద్రబాబు మారిస్తే..ఈ రోజు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవినీతి రహిత రాష్ట్రంగా  తీర్చిదిద్దుతున్నారు. అందుకే ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారు. చంద్రబాబు ఓర్వలేక సీఎం వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో 340 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ రాకముందు ఐదేళ్లలో రాష్ట్రంలో వర్షాలు లేక, పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటితో కళకళలాడుతున్నారు. పైర్లు పచ్చగా ఉంటే చంద్రబాబు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కాక అమరావతి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబూ..ఎందుకీ పాడు జీవితం. ప్రజల చేత ఛీ అనిపించుకుంటున్నావు..ఇలాంటి జీవితం అవసరమా?. సింహంలా ఒక్క రోజు బతికినా చాలు. ఒక నక్కలాగా ప్రతి రోజు చంద్రబాబు అబద్ధాలు చెప్పుకుంటూ, మోసాలు చేసుకుంటూ..నీ అవినీతి అంతా కూడా బట్టబయలు అవుతోంది. రోజుకో వార్త వస్తోంది. శ్రీనివాసరెడ్డి, పీఏ శ్రీనివాస్‌, పత్తిపాటి పుల్లారావు కొడుకులు వీరంతా కూడా నీ పార్టీ వాళ్లే కదా? వేల కోట్లు వీళ్ల కంపెనీలకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చి..నల్లధనాన్ని తెల్లగా మార్చుకున్నావు. అలాంటి వ్యక్తి సిగ్గులేకుండా బయటకు వచ్చి ప్రజల ముందు అబద్ధాలు చెబుతున్నావు. అసలు చంద్రబాబు బస్సు యాత్ర ఎందుకు? ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం తప్ప మరే ప్రయోజనం లేదు. చంద్రబాబు తీరు చూస్తుంటే..ఆయనకు పోయేకాలం చాలా దగ్గర్లోనే ఉందని భావిస్తున్నాను. చంద్రబాబు యాత్రకు జనం రావడం లేదు. టీడీపీ నేతలు నాలుగు జెండాలు పట్టుకొని, రోడ్డుకు అడ్డంగా కాన్వయ్‌ పెట్టి ట్రాఫిక్‌ జామ్‌ చేస్తున్నారు. వీటిని రాసేందుకు పిచ్చి పట్టిన పచ్చ మీడియా ఒకటి ఉంది. వేల జనం అంటూ పచ్చ మీడియాలో రాయించుకుంటున్నారు. 
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు వెళ్తున్నారని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. నిన్ననే కర్నూలులో వైయస్‌ఆర్‌ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చ మీడియాకు ఉన్న కంటి దోషానికి కూడా కంటి వెలుగులో ట్రిట్‌మెంట్‌ తీసుకుంటే బాగుంటుంది. ప్రతి పిల్లాడు చదువుకోవాలని, వాళ్లు ఆరోగ్యంగా ఉండాలని జగనన్న గోరుముద్ద కార్యక్రమం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి మెనూ రూపొందించి మంచి ఆహారం అందిస్తున్నారు. చంద్రబాబు పాలనలో వేల పాఠశాలలు మూత వేశారు. ఐదేళ్లు తండ్రీ కొడుకులు ప్రజాధనాన్ని షెల్‌ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించి స్వాహా చేశారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఆయనకు అసలు నాలుక ఉందా? జంతువులు కూడా ఇలా మాట్లాడవు. చంద్రబాబు పాములాంటి మనిషి..ఇప్పటికే సమాజాన్ని తన విషపు కాటుతో కాటు వేశాడు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు. రూ.3.50 లక్షల కోట్లు అప్పులు చేశారు. వీటన్నింటిని వైయస్‌ జగన్‌ తీర్చుకుంటూ, ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. ఆర్థిక విధానాన్ని చక్కదిద్దేందుకు ఎవరికి సాధ్యం కాదు. 9 నెలల కాలంలో వైయస్‌ జగన్‌ వృద్ధాప్య పింఛన్‌ వయసు 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేల ఆర్థికసాయం, వైయస్‌ఆర్‌ మత్స్యభరోసా కింద ఏటా రూ.10 వేల ఆర్థికసాయం, వేటకు వెళ్లి మరణించిన మత్స్యకారులకు రూ.10 లక్షల ఆర్థికసాయం, వైయస్ఆర్‌ నేతన్న నేస్తం కింద ఏటా రూ.24 వేలు ఒక్కో కుటుంబానికి అందజేస్తున్నారు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వార్డు వాలంటీర్లు, సచివాలయాల ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇస్తున్నారు. గుమ్మం వద్దకే సేవలు, పింఛన్లు ఇస్తున్నారు. 541 సేవలు సచివాలయాల ద్వారా అందుతున్నాయి. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చుతున్నారు. చంద్రబాబు ఐదేళ్లలో చేసిన ఒక్క పని చూపించు. పోలవరం సోమవారం అంటూ దోపిడీ చేశారు. ప్రధానినే స్వయంగా పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యక్తి చంద్రబాబు ఇవాళ ప్రజల మధ్యకు వచ్చి అబద్ధాలు చెబుతూ..కేసుల భయంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని లక్ష్మీపార్వతి విమర్శించారు. 

 

తాజా వీడియోలు

Back to Top