బాబు ఐదేళ్ల పాలనలో అన్ని శాఖలు నిర్వీర్యం

వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకురాలు లక్ష్మీపార్వతి
 

విశాఖ: రైతుల దృష్టిని మరల్చేందుకే రాజధానిపై ప్రతిపక్షం దుమారం లేపుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంది చంద్రబాబూ కాదా అని ప్రశ్నించారు. విశాఖలో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. రాజధానిపై ప్రతిపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అన్ని శాఖలను నిర్వీర్యం చేశారన్నారు. బాలకృష్ణ వియ్యంకుడు ఎకరం లక్ష రూపాయలకు కొన్నట్లుగా ప్రజలు చెప్పుకుంటున్నారన్నారు. నిరుద్యోగ భృతి పేరిట యువతను చంద్రబాబు మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గ్రామ సచివాలయాలు పెట్టి నిరుద్యోగులను ఆదుకుంటున్నారన్నారు.

 

Back to Top