వైయస్ జగన్ జన్మదిన వేడుకలలో రికార్డు స్దాయిలో రక్తదాన రిజిస్ర్టేషన్లు 

1,29,451 మందితో జీనియ‌స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో న‌మోదు

CM YS Jagan Mohan Reddy  జ‌న్మ‌దిన సంద‌ర్భంగా ర‌క్త‌దానం చేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ (Take the Pledge Save a Life)

 వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, వైయస్ జగన్ అభిమానులకు పార్టీ ప్రధాన కార్యదర్శి,ప్రభుత్వ సలహాదారులు(ప్రజావ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి అభినందనలు 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  జన్మ‌దినోత్సవ వేడుకల సందర్భంగా వైయ‌స్ఆర్‌ సిపి శ్రేణులు, అభిమానులు రక్త‌దానం చేయ‌డానికి అంగీకరిస్తూ ప్ర‌తిజ్ఞ చేసి  (Take the Pledge Save a Life) రికార్డు సృష్టించారు. సీఎం శ్రీ వైయస్ జగన్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌,విదేశాల్లోని ఆయ‌న‌ అభిమానులు ర‌క్త‌దానం చేసేందుకు సిద్ధ‌మంటూ ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా 1,29,451 మంది రిజిస్ట్రేష‌న్ చేసుకుని జీనియ‌స్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ఇదివ‌రకు ఉన్న ప్ర‌పంచ రికార్డును అధిగ‌మించారు. 

    బుధవారం  తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన వేడుకలలో  జీనియ‌స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌తినిధి వీరేంద్ర ప్ర‌పంచ రికార్డుకు సంబంధించిన‌ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం, మెడ‌ల్ ను పార్టీ ప్ర‌దాన‌కార్యద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారులు (ప్రజావ్యవహారాలు)  సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డికి అంద‌జేశారు.  ఇంత‌వ‌ర‌కు ఇలా ర‌క్త నిల్వ‌ల‌కు సంబంధించి ప్ర‌తిజ్ఞ చేసిన రికార్డ్ సౌతాఫ్రికాకు సంబంధించి మాత్ర‌మే ఉంది. 71వేల ర‌క్త‌దాత‌లు ప్ర‌తిజ్ఞ చేయడం ద్వారా న‌మోదు చేసిన రికార్డును నేడు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రీ వైయస్ జగన్ అభిమానులు 1,29,451 రిజిస్ట్రేషన్స్ చేసి ఆ రికార్డు ని బ్రేక్ చేశారు. 

     ఈ సంద‌ర్భంగా పార్టీ ప్ర‌దాన‌కార్యద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (ప్రజావ్యవహారాలు)  సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జ‌గ‌న్ వెంట నడుస్తున్నందుకే..  మ‌నంద‌రిపై ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు ఆప్యాయత‌, అభిమానం చూపుతున్నారన్నారు.అక్కున చేర్చుకుంటున్నారని తెలిపారు.  ప్ర‌జ‌ల‌కు అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను,పధకాలను అమ‌లు చేస్తూ ఆయ‌న చిర‌స్మ‌ర‌ణీయుడిగా నిలుస్తున్నారని     అన్నారు. సీఎం శ్రీ వైయస్ జ‌గ‌న్ పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయ‌న‌పై అభిమానంతో మేము సైతం ర‌క్త‌దానం చేస్తామంటూ ముందుకు వ‌చ్చి న అందరికి అభిందనలు తెలియచేశారు.ఇది ఎంతో స్ఫూర్తిదాయక అంశమని అన్నారు.ఎందరో ఆపదలో ఉన్న వారికి అత్యవసర సమయాలలో ఉపయోగపడుతుందని వివరించారు. శ్రీ వైయస్ జగన్ గారిపై ఉన్న అభిమానం తో రక్తధానం చేస్తామని రిజిస్ట్రేషన్స్ చేయడంలో  ప్ర‌పంచ రికార్డు సృష్టించడం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం ఇంత భారీఎత్తున విజ‌య‌వంతం కావ‌డానికి కృష్టి చేసిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణ‌ సంస్థ)చ‌ల్లా మ‌ధుసూద‌న్ రెడ్డి ని,  వారికి స‌హ‌క‌రించిన ఐటీ, సోష‌ల్ మీడియా, స్టూడెంట్ వింగ్ స‌భ్యులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులంద‌రికీ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అభినంద‌న‌లు తెలిపారు.

       ఈ సందర్భంగా జీనియ‌స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌తినిధి వీరేంద్ర రికార్డు సాధించినందుకు అభినందనలు తెలియచేశారు.ఇది అత్యవసర సమయాలలో రోగులకు రక్తం అవసరమైన వారికి ఉపయోగపడే మంచి కార్యక్రమం అని తెలిపారు.

    వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ది విభాగం రాష్ట్ర‌ అధ్యక్షుడు పానుగంటి చైతన్య విద్యార్దులనుంచి పెద్ద ఎత్తున రక్తదానం చేసే విధంగా ప్రోత్సహించారు.ఈ సందర్బంగా పానుగంటి చైతన్యను సజ్జల రామకృష్ణారెడ్డి ,శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, పుత్తా ప్ర‌తాప్‌రెడ్డిలు అభినందించారు.

Back to Top