ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి గెలిపించండి

వైయస్‌ఆర్‌ సీపీ నేతలు మేడా, ఆకేపాటి

వైయస్‌ఆర్‌ జిల్లా: దోపిడీ రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలు అన్నారు. రాజంపేట నియోజకవర్గంలో రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిలు పాల్గొన్నారు. నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. రావాలి జగన్‌ – కావాలి జగన్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, చంద్రబాబు అవినీతి పాలనను కూలదొయ్యడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top