వైయ‌స్ఆర్‌సీపీ దళిత మహిళా కార్యకర్త హత్య

కర్నూలు జిల్లా: అధికార మదంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లాలో టీడీపీ అరాచకాలు ఆగడం లేదు. ఆదోని మండలం నాగనాతన హల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త గుండమ్మను హత్య చేశారు. దళిత మహిళ గుండమ్మ పొలంలో పని చేసుకుంటుండగా టీడీపీ నేత రాగప్పరెడ్డి... ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశారు. పొలం విషయంలో  టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. దళిత మహిళ గుండమ్మను హత్యచేసి పరారయ్యారు.

మితిమీరిన టీడీపీ నేత‌ల ఆగ‌డాలు
పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఆగడాలు మితిమీరి పోతున్నాయి. టీడీపీ నేతల వేధింపులకు ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బలయ్యారు. ఉద్యోగానికి రాజీనామా చేయాలని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. నెల నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆనంద్‌ను టీడీపీ నేతలు వేధిస్తుండగా, ఫిల్డ్‌ అసిస్టెంట్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

Back to Top