సీబీసీఐడీకి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ ఫిర్యాదు

త‌క్ష‌ణ‌మే ysrcppolls.com website ను  నిలిపివేయాల‌ని విన‌తి
 

అమ‌రావ‌తి:  న‌కిలీ వెబ్‌సైట్ త‌యారు చేసి త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధులు అంకంరెడ్డి నారాయ‌ణ‌మూర్తి, ఈద రాజ‌శేఖ‌ర్ కోరారు. శ‌నివారం సీబీసీఐడీ అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ జ‌న‌రల్‌ను పార్టీ అధికార ప్ర‌తినిధులు క‌లిసి ఫిర్యాదు చేశారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు సంబంధించి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవ‌ల  ysrcppolls.in వెబ్‌సైట్‌ను రూపొందించింద‌న్నారు. అయితే కొంద‌రు వ్య‌క్తులు ysrcppolls.com తయారు చేసి త‌ప్పుడు స‌మాచారాన్ని పొందుప‌రిచార‌ని, త‌ప్పుడు వెబ్‌సైట్ క్రియేట్ చేసిన‌ వారిపై సైబర్ నేరాల చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. త‌క్ష‌ణ‌మే ysrcppolls.com website ను  నిలిపివేయాలని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సి.బి.సి.ఐ.డి పోలీస్ అధికారిని కోరారు. 

Back to Top