డీజీపీ ఠాకూర్‌ను తప్పించాలి

ఈసీకి వైయస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు
 

అమరావతి: ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఠాకూర్‌ను విధుల నుంచి తప్పించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎన్నికల అధికారికి వినతిపత్రం అందజేశారు.  వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం విషయంలో డీజీపీ వ్యాఖ్యలను ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ ఠాకూర్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఠాకూర్‌ డీజీపీగా ఉంటే ప్రజలు ఓటు హక్కును సజావుగా వినియోగించుకోలేరన్నారు. ఠాకూర్‌పై హైకోర్టులో పిటిషన్‌పెండింగ్‌లో ఉండగా డీజీపీగా నియమించారు. జీహెచ్‌ఎంసీ పార్క్‌ స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఠాకూర్‌ అఖిల భారత సర్వీస్‌అధికారుల రూల్స్‌ను అతిక్రమించారని తెలిపారు.
 

Back to Top