తాడేపల్లి: అమరావతిలో అంతిమ విజయం పేదలదేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. అమరావతి సీఆర్డీఏ పరిధిలో 50 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే.. కోర్టులకు వెళ్ళి అడ్డుకుని చంద్రబాబు అండ్ కో.. శునకానందం పొందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పెత్తందార్లు.. పేదోళ్ళకు జరుగుతున్న యుద్ధంలో మీది ఒక అడుగు ముందుకు పడినంత మాత్రాన విర్రవీగవద్దు.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం, అమరావతి ప్రాంతంలో కచ్చితంగా పేదలకు ఇళ్ళు కట్టి ఇస్తారని చెప్పారు. పాండవులు, కౌరవులకు మధ్య ఆస్తి విషయంలో జరిగిన వ్యవహారంలో.. తమ ఐదుగురికి 5 ఎకరాల భూమి ఇవ్వాలని పాండవులు కోరితే.. సూది మొన మోపినంత కూడా ఇవ్వమని కౌరవులు అహంకారంతో యుద్ధం చేసి చివరికి ఓడిపోతారు. అలానే అమరావతిలో అంతిమ విజయం మా పేదలదే అన్నారు.
ఎంపీ నందిగం సురేష్ ఇంకా ఏమన్నారంటే..
- మీరు మీ అడ్డా అనుకుంటున్న అమరావతిలో మా బిడ్డలు నివాసం ఉంటారు. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అది కచ్చితంగా జరిగి తీరుతుంది.
- మీరు నియంతల్లా, మీరు నిర్మించుకున్న మీ సామ్రాజ్యంలో పేదోళ్ళు ఉండటానికి వీల్లేదని అంటే.. ప్రజాస్వామ్యంలో కుదరదు. నియంతలకు స్థానం లేదు.
- ఈ వ్యవహారంలో ఒక అడుగు మీరు ముందుకు వేశారని జబ్బలు చరుచుకోవాల్సిన పనిలేదు. నిన్న కొంతమంది హైకోర్టు దగ్గరకు వెళ్ళి మొక్కుతూ, హారతులు ఇస్తున్నారు.
- మేము పై కోర్టుకి వెళ్ళి.. కచ్చితంగా పేదలకు ఇళ్ళు ఇచ్చి తీరుతాం.
- అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండకూడదనే దురుద్దేశంతో, వారి చేతనే చంద్రబాబు హైకోర్టులో కేసులు వేయించాడు.
వీధి రౌడీల్లా మాట్లాడుతున్న బాబు, పవన్ః
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు.. రౌడీయిజం, దుర్మార్గాలు చేసి అయినా, ఏదోరకంగా అధికారం సంపాదించాలని కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారు.
- రౌడీ మూకల్లా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు ప్రజలంతా చూడాలి. ఆ వీడియోలు చూడండి.
- చంద్రబాబు నిన్న పుంగనూరు వెళ్ళి.. ఆ నా కొడుకులను కొట్టండ్రా.. అని మాట్లాడాడు. - 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు మాట్లాడే మాటలేనా..?
- ఎవరు నీ కొడుకులు.. పోలీసులు నీ కొడుకులా.. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నీ కొడుకులా...?
బాబు రౌడీయిజానికి పవన్ వత్తాసా..?
- వీధి రౌడీలా కొట్టండ్రా.. నరకండ్రా.. అని మాట్లాడిన చంద్రబాబుకు ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ వత్తాసు పలుకుతున్నాడు.
- అదే అంజూ యాదవ్ అనే మహిళా సీఐ.. జనసేన పార్టీ కార్యకర్త నోటికొచ్చినట్టు దూషిస్తే.. వెధవ అని చెంప దెబ్బకొడితే.. అదేదో పెద్ద నేరం జరిగిందని పవన్ కల్యాణ్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
- మరి, నిన్న పుంగనూరు అల్లర్లలో టీడీపీకి చెందినవారు దాడులకు పాల్పడి, 40 మంది పోలీసుల్ని కొడితే.. మాత్రం ప్రశ్నించలేని వ్యక్తి పవన్ కల్యాణ్. పైగా చంద్రబాబుకు మద్దతుగా ఖండన ఇచ్చి, తన దత్త తండ్రికి తానెప్పుడూ మద్దతు ఇస్తానని చెప్పుకుంటున్నాడు.
- పోలీసుల వాహనాలు ధ్వంసం చేసి, పోలీసులపై దాడి చేసి, వారి రక్తం కళ్ళ చూస్తే.. పోలీసులపైన జరిగిన దాడులను ఖండించటానికి పవన్ కల్యాణ్ కు మనసు రాలేదు.
- పవన్ కల్యాణ్.. కూడా తమ పార్టీ మీటింగులో ఇదే రకమైన భాష వాడి, కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు.
- సినిమాల్లో వేసిన వేషాల తరహాలోనే.. ప్రజాక్షేత్రంలో కూడా వీధి రౌడీలా పవన్ మాట్లాడుతున్నాడు.
- చంద్రబాబు, పవన్, లోకేశ్ లకు నోటికొచ్చిన భాష మాట్లాడటం అలవాటైంది.
- భవిష్యత్తులో పవన్ కల్యాణ్ అటు రాజకీయాలకు, ఇటు సినిమాలకు రెండింటికీ కాకుండా పోతాడు.
అధికారం దక్కదనే అక్కసుతో హింసను ప్రేరేపిస్తున్నారుః
- రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే, ప్రజలు జగన్ గారు చేసిన మంచి పనులు చూసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే.. వీళ్ళకు ఇక జన్మలో అధికారం దక్కదని హింసను ప్రేరేపించి, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారు.
- చంద్రబాబు పులివెందులకు వెళ్ళి అక్కడ అమరావతి అంశం మాట్లాడతాడు. పులివెందులకు, అమరావతి అంశానికి అసలు సంబంధం ఏమిటి..?.
- చంద్రబాబుకు, ఎంతసేపటికీ 29 గ్రామాలు, అమరావతిపైనే ధ్యాస, ప్రేమ. ఎందుకంటే, అమరావతి లేకపోతే.. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుంది.
- ముఖ్యమంత్రి జగన్ గారు, అమరావతితోపాటు అన్ని ప్రాంతాలు బాగుండాలని, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. అదే వీరి కడుపు మంట. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు.
మీ తండ్రుల పేర్లు చెప్పలేని దుస్థితిః
- ఎన్టీఆర్ పేరు తప్పితే.. వాళ్ళ తండ్రుల పేరు చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు, లోకేశ్ లు ఉన్నారు.
- చంద్రబాబు ఏమో వెన్నుపోటు పొడిచి, అధికారం లాక్కున్న ఎన్టీఆర్ పేరునే ఇప్పటికీ చెప్పుకుంటూ తిరుగుతాడు. మరోవైపు లోకేశ్ కూడా తన తండ్రి చంద్రబాబు ఇది చేశాడు అని చెప్పే పరిస్థితి లేదు. అతనూ ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటూనే పాదయాత్రలు చేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు రాష్ట్రానికి ఏ మేలూ చేయలేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఎన్టీఅర్ జపం చేస్తున్నారు.
- వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీలను రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో శిరచ్ఛేదనం చేస్తారు.
- ఎందుకంటే, చంద్రబాబు సవ్యంగా పార్టీ పెట్టినోడు కాదు, సన్మార్గంలో అధికారంలోకి వచ్చిన వాడు కాదు. ఎప్పుడూ లాక్కోవడమే.. అతనికి తెలుసు.
- వ్యవస్థలను మేనేజ్ చేసి, బెదిరించి, హింసను ప్రేరేపించి అధికారంలోకి రావాలన్నదే బాబు కుట్ర ఆలోచన.
మీరు కుళ్ళి కుళ్ళి ఏడవాల్సిందేః
- 2024లో మరోసారి జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాక.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కుళ్ళి కుళ్ళి ఏడవటం తప్ప చేయగలిగిందేమీ లేదు.
- చంద్రబాబు లాంటి వాడు.. దేశానికి, రాష్ట్రానికే కాదు.. మానవ సంబంధాలకు కూడా హానికరం.
- పుంగనూరులో అల్లర్లను సృష్టించి, దాడులకు పాల్పడిన చంద్రబాబుకు, ఫామ్ హౌస్ లో కూర్చున్న పవన్ కల్యాణ్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు.
- 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు చేస్తున్న రాజకీయం చూసి.. రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
- అధికార మదంతో, పదవీ వ్యామోహంతో చంద్రబాబు ఈ వయసులో హింసను ప్రేరేపిస్తూ కుట్రలు చేస్తున్నాడు.
రాష్ట్రానికి వారిద్దరూ ప్రమాదకరంః
- చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు రాష్ట్రానికి ప్రమాదకరంగా మారారు.
- వీళ్ళు ఇద్దరినీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
- టీడీపీ మాజీ మంత్రి నారాయణ రాసలీలలను, మహిళల పట్ల వేధింపులను స్వయానా, ఆయన మరదలు బయటపెడితే.. తాను జనసేన కార్యకర్తనని, పవన్ కల్యాణ్ అభిమానినని చెప్పినా, అవి పవన్ కల్యాణ్ కు వినపడవు. కనపడవు.
- ఆమె ఆవేదనపై పవన్ కల్యాణ్ నోరు మెదపరు... అంటేనే వారిద్దరి బంధం ఏమిటో ప్రజలకు అర్థమవుతుంది.