రైతులకు అండగా నిలిచి గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం

రూ.361.29 కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్డ్‌ హార్వెస్టల పంపిణీ

13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేసిన సీఎం

రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ

రైతన్నల కోసం వైయస్‌ఆర్‌ యంత్రసేవా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం

వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం మెగా మేళా ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

గుంటూరు: వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థను పటిష్టపరుస్తూ రైతన్నలకు మంచి జరిగించాలనే తపన, తాపత్రయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని, రైతులకు అండగా నిలిచి గ్రామస్వరాజ్యం తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి ఆర్బీకే సెంటర్‌లో యంత్రాలకు రూ.15 లక్షలు కేటాయించామని, రైతులకు ఏం అవసరమో వారినే అడిగి అందజేస్తున్నామన్నారు. అతితక్కువ అద్దెతో యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. 15 రోజుల ముందుగానే యంత్రాలను బుక్‌ చేసుకునేలా వైయస్‌ఆర్‌ యంత్రసేవ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్‌ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు రైతన్నలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం..
ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అన్నీ అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఆర్బీకే పరిధిలోని రైతన్నలు ఒక గ్రూప్‌గా ఏర్పడి, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ తీసుకొచ్చి ఆర్బీకే పరిధిలోని మిగిలిన రైతులకు తక్కువ ధరకు యంత్రాలు అందుబాటులోకి తీసుకువచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడి దయతో మనం చేసే ఈ కార్యక్రమంతో 10,444 ఆర్బీకేల పరిధిలోనూ ఇక మీదట కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ పేరితో ట్రాక్టర్లతో కూడిన వ్యవసాయ యంత్ర పరికరాలు అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకువస్తూ గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెబుతున్నాం. 

ఇంతకుముందు 6,525 ఆర్బీకే స్థాయిలో, 391 క్లస్టర్‌ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్స్‌ రైతుల పేరుతో ప్రారంభించాం. ఆ పరిధిలో 3800 ట్రాక్టర్లు, 391 కంబైన్డ్‌ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను వ్యవసాయ పనిముట్లు ఇంతకుముందు సప్లయ్‌ చేశాం. ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మిగిలినపోయిన మరో 3919 ఆర్బీకేల స్థాయిలో, 100 క్లస్టర్‌స్థాయి కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లలో 2562 ట్రాక్టర్లు, 100 కంబైన్డ్‌ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను కూడా ప్రతి ఆర్బీకే స్థాయిలో అందుబాటులో ఉండేలా ఈరోజు జెండా ఊపి ప్రారంభిస్తున్నాం. 

ప్రతి ఆర్బీకే స్థాయిలో రూ.15 లక్షలు కేటాయించి, అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలో ఆ రైతులను డిసైడ్‌ చేయమని చెప్పి, వారు డిసైడ్‌ చేసినదాని ప్రకారం, వారి అవసరాల మేరకు యంత్రాలు తీసుకువచ్చాం. అదేమాదిరిగానే 491 క్లస్టర్‌ స్థాయిలో వరి బాగా పండుతున్న చోట కంబైన్డ్‌ హార్వెస్టర్లు తీసుకువచ్చాం. ఒక్కో క్లస్టర్‌ స్థాయిలో రూ.25లక్షలు ఖర్చు చేసి అందుబాటులోకి తీసుకువచ్చాం. రూ.1052 కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ తీసుకువచ్చాం. గ్రూపులుగా ఫామ్‌ అయిన రైతులు కేవలం 10 శాతం డబ్బులు కడితే చాటు.. 40 శాతం గవర్నమెంట్‌ సబ్సిడీ కింద ఇచ్చి, మిగిలిన 50 శాతం లోన్ల కింద ఆర్బీకేల పరిధిలో ఉన్న రైతాంగానికి అందుబాటులోకి తీసుకువస్తున్నాం. దీని కోసం ఆర్బీకే స్థాయిలో ఏ రైతు అయినా వాడుకునేందుకు వీలుగా అతితక్కువ అద్దెతో ఇవన్నీ వారికి అందుబాటులోకి ఉండేందుకు వైయస్‌ఆర్‌ యంత్రసేవ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నాం. వీటి వల్ల 15 రోజుల ముందుగానే యంత్రాలను బుక్‌ చేసుకోవచ్చు.. యంత్రసేవలు ఆర్బీకే పరిధిలో అందుబాటులోకి వచ్చాయి. 

వీటన్నింటి వల్ల రైతాంగానికి మంచి జరగాలని, ఆర్బీకే పరిధిలోని ప్రతి రైతన్న దీన్ని ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మళ్లీ అక్టోబర్‌ మాసంలో 7 లక్షల మంది రైతన్నలకు మంచిచేస్తూ వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు స్ప్రేయర్లు, టార్పాలిన్లు, వీడర్లు పంపిణీ చేయనున్నాం. ఆర్బీకే వ్యవస్థను పటిష్టపరుస్తూ రైతన్నలకు ఇంకా మంచి జరిగించాలనే తపన, తాపత్రయంతో అడుగులు పడుతున్నాయి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top