విజయనగరం: ప్రభుత్వంపై ఎల్లోమీడియా చేస్తున్న దుష్ప్రచారానికి ఎట్టి పరిస్దితుల్లోనూ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వైయస్ఆర్‌సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అందుకే సీఎం వైయస్ జగన్ సమాంతర వ్యవస్ధల్ని ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలో వాలంటీర్లు, గృహసారధుల భేటీలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ఏపీలో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. మరో ఏడాదిలో ఎన్నికలకు సిద్దం కావాలన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం విద్య, వైద్యం కోసం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, ఎక్కడా లేని విధంగా నాడు-నేడు తో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏ పథకం ప్రారంభించినా మహిళలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గ్రామస్ధాయి నుంచే అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సచివాలయ వ్యవస్ధ పెట్టాలని ఆలోచిస్తున్నారని తెలిపారు.
వాలంటీర్ల వ్యవస్ధ కూడా సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలుచేసేందుకు ఉపయోగపడుతోందన్నారు. వైయస్ జగన్ విపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విధంగా పార్టీలు, కుల, మత, ప్రాంతాలు చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు చేసి చూపిస్తున్నారన్నారు. గ్రామ వాలంటీర్లతో కలిసి గృహసారధులు సమన్వయంతో పని చేయాలన్నారు.