ప్రజలకు క్షమాపణ చెప్పి.. భూములు వెనక్కిచ్చేయండి

రూ.కోట్ల విలువైన భూములు కబ్జా చేసిన టీడీపీ నేత పల్లా శ్రీను

ప్రభుత్వ భూములు వెనక్కు తీసుకుంటే మాపైనే దుష్ప్రచారమా..?

వైయస్‌ఆర్‌ సీపీ నేత కేకే.రాజు ధ్వజం

విశాఖపట్నం: విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ నేత కేకే.రాజు అన్నారు. అందులో భాగంగానే విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించారన్నారు. చంద్రబాబు హయాంలో పేదలకు సంబంధించిన ఆస్తిని టీడీపీ నేతలు అన్యాక్రాంతం చేశారని, వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. దీంతో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై, ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఎవరు భూభక్షకులు, ఎవరు భూ సంరక్షకులు అనేది విశాఖ ప్రజలకు బాగా తెలుసు అని కేకే.రాజు అన్నారు. పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా.. ప్రభుత్వ భూములను వైయస్‌ఆర్‌ సీపీ రక్షిస్తుందన్నారు. విశాఖ నగర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కుటుంబం వందల కోట్ల రూపాయల ప్రజల భూములను ఆక్రమించిందన్నారు. ఆ భూములను ప్రభుత్వం కాపాడుతుంటే.. ప్రజాప్రతినిధులు, అధికారులపై టీడీపీ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పేరుతో పల్లా శ్రీనివాసరావు దొంగ దీక్ష చేశాడని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఉంటే బేషరతులుగా ప్రజలకు క్షమాపణ చెప్పి.. పలు ప్రాంతాల్లో ఆక్రమించిన భూములతో పాటు, కబ్జా చేసిన స్టీల్‌ ప్లాంట్‌ భూములను కూడా తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 
 

Back to Top