వాస్తవాలను వక్రీకరించి టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం

‘గడప గడపకూ మన ప్రభుత్వం’ రివ్యూ పాజిటివ్‌గా సాగింది

అందరం కలిసి 175 లక్ష్యాన్ని చేరుకుందామన్న సీఎం దిశానిర్దేశం చేశారు

ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగితే సంతోషించేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి తీరు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తిడితే హరీష్‌ రావు ఆనందపడతాడేమో మాకు తెలియదు

పక్కరాష్ట్రం మంత్రి మా రాష్ట్రం గురించి కామెంట్‌ చేయడం మంచిదికాదు

ఉచిత విద్యుత్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవ్వరికీ లేదు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మా పార్టీ సక్సెస్‌కు మా పనితీరు కూడా ఒక కారణం అని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. మూడేళ్లుగా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన సంక్షేమ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నామన్నారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాలని సీఎం వైయస్‌ జగన్‌ టార్గెట్‌ ఫిక్స్‌ చేశారని, ఆ టార్గెట్‌ను రీచ్‌ అవ్వడం కోసం అందరం సమష్టిగా పనిచేద్దామని గడప గడపకూ మన ప్రభుత్వం రివ్యూలో చెప్పారని గుర్తుచేశారు. గడప గడపకూ సమీక్షపై వాస్తవాలను వక్రీకరించి టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు భంగం కలిగితే సంతోషించే రీతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా పనిచేస్తుంది అనేది వారి పత్రికలు చూస్తేనే తెలుస్తుందన్నారు. ఉచిత విద్యుత్‌పై మాట్లాడే నైతిక హక్కు ఎవ్వరికీ లేదన్నారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..

గడప గడపకూ మన ప్రభుత్వం రివ్యూలో సీఎం ఆయన్ను కూడా కలుపుకొని ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పీకే టీమ్‌ను ఎందుకు పెట్టుకున్నామంటే.. టెక్నాలజీ పెరిగింది, సోషల్‌ మీడియా ప్రభావం పెరిగింది. పబ్లిక్‌ను రీచ్‌ కావడానికి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారితో టచ్‌లో ఉండటం అవసరం. ప్రజల సంక్షేమం కోసం అవసరమైన పనులు చేశాం. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయనేది సీఎం రివ్యూ చేసుకున్నారు. సీఎం స్పీచ్‌లో పూర్తిగా పాజిటివ్‌గా సాగింది. మనం 175 టార్గెట్‌ పెట్టుకున్నప్పుడు కాన్ఫిడెన్స్‌తో పాటు డిసిప్లేన్‌ అవసరం అని చెప్పారు. ఒక కుటుంబంలో అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో.. అలాగే సీఎం వైయస్‌ జగన్‌ కూడా ఒక నాయకుడిగా అందరినీ అలర్ట్‌ చేశారు.

27 మంది కాస్త వెనకబడ్డారని కాదు. మన పార్టీ ముందుకువెళ్లాలంటే.. అందరం కష్టపడాలని సీఎం చెప్పారు. ప్రత్యర్థులంతా ఏకమై దాడిచేస్తున్నప్పుడు.. జనంలో మన పార్టీ బలం మరింతగా పెంచుకోవడానికి గడప గడపకూ కార్యక్రమం విస్తృతంగా చేయాలని, లోటుపాట్లు సరిచేసుకోవాలని సూచన చేశారు. దాన్ని ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయి. గోతికాడ నక్కలా కాచుకొని కూర్చున్నాయి. దీని వల్ల నలుగురిలో అసంతృప్తి వస్తే వారికి లాగేసుకోవచ్చా.. అసంతృప్తి అని చెప్పి అధికార పార్టీని డౌన్‌ చేద్దామా అని చూస్తున్నారు. వేరే రకంగా సీఎం వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేక.. ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. 

చాలా మంది అసంతృప్తితో ఉన్నప్పుట్టుగా టీడీపీ, ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను చూస్తే జాలేసింది. పీకే టీమ్‌ లేకపోతే గెలవలేమనే అసంతృప్తితో ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎక్కడ లేని సానుభూతి చూపించాలని చూశారు. ఎవ్వరికీ అసంతృప్తి లేదు. అందరూ చాలా పాజిటివ్‌గా ఉన్నారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే మా టార్గెట్‌. దానికి సంబంధించినంత వరకు ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేదు. మా పార్టీకి, మా నాయకుడికి ఉన్న శక్తిసామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసమే ఉపయోగిస్తాం. 

హరీష్‌రావుకు ఎందుకు ఆవేశం వచ్చిందో తెలియదు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక గ్యాంగ్‌ ఫామ్‌ అయ్యింది. ఆ గ్యాంగ్‌.. పథకం ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌ను  అటాక్‌ చేయాలని అనుకుంటున్నారు. హరీష్‌రావు కామెంట్స్‌ రెండు స్టేట్స్‌ మధ్య ఇష్యూ కాదు.. హరీష్‌రావు ఆ గ్యాంగ్‌ డైరెక్షన్‌ ప్రకారం నడుస్తున్నారా.. లేక మా ముఖ్యమంత్రిని అంటే తెలంగాణ ముఖ్యమంత్రిని అటాక్‌ చేస్తే ఆయనకు హ్యాపీనెస్‌ వస్తుందేమో తెలియదు. వారి మధ్య రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్‌ అంశాన్ని వాడుకోవాలని అనుకుంటున్నారేమో తెలియదు. 

తెలంగాణ రాష్ట్రం గురించి మేము ఎప్పుడూ కామెంట్‌ చేయలేదు. అధికారంలో ఉన్నవారు వారి సమస్యలు వారు తీర్చుకోవాలి. మరో రాష్ట్రం గురించి కామెంట్‌ చేయడం మంచిదికాదు. ఉద్యోగులు, టీచర్లకు సంబంధించి అన్ని అంశాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మా గవర్నమెంట్‌ కూడా ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధిగా ఉంది. హరీష్‌రావు వ్యాఖ్యలపై మేము కామెంట్‌ చేయదలుచుకోలేదు. 

విద్యుత్‌ మీటర్లపై ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితరులతో కూడినlగ్యాంగ్‌ చంద్రబాబుకు మించి దుష్ప్రచారం చేస్తోంది. ఈ గ్యాంగ్‌ అంతా కలిసి ఒక పార్టీ పెట్టినా బాగుండేది.. ప్రత్యక్ష యుద్ధం చేసేవాళ్లం. చంద్రబాబు అజెండా మోయడం కాదు.. కొత్త అజెండాను తయారు చేసే లెవల్‌కు ఈ గ్యాంగ్‌ వెళ్లింది. వారి అజెండా ఎవరు తీసుకున్న ఆ గ్యాంగ్‌లో పార్ట్‌గానే తీసుకుంటాం. తెలంగాణలో విద్యుత్‌ మీటర్లకు సంబంధించి ఆలోచన ఏదైనా ఉంటే వారిది వారు చూసుకోవాలి. ఏపీ పెట్టింది కదా మీరు ఎందుకు పెట్టరు అని మేము అడగలేదు. మంచి నిర్ణయాన్ని, సంస్కరణను వ్యతిరేకిస్తున్న గ్యాంగ్‌కు జతకట్టి మాపై పడాల్సిన అవసరం హరీష్‌రావుకు లేదు.  టీఆర్‌ఎస్‌ మమ్మల్ని ఏమీ అనలేదు. హరీష్‌రావుకు ఆయన పర్సనల్‌ సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలియదు. 

ఉచిత విద్యుత్‌ మీద పేటెంట్‌ దివంగత మహానేత వైయస్‌ఆర్‌ది. ఆరోజు అసాధ్యం అన్నవారికి ఈరోజు దాని గురించి మాట్లాడే అర్హతలేదు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు సీఎం వైయస్‌  జగన్‌ ఒక మంచి పథకం తీసుకొచ్చారు. సోలార్‌ పవర్‌ తీసుకొచ్చి తక్కువ కాస్ట్‌తో ప్రభుత్వానికి భారం తగ్గించి రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. శ్రీకాకుళంలో పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేశాం. ఒక ఫిర్యాదు కూడా లేదు.. విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రైతులు డిస్కమ్‌లకు చెల్లిస్తున్నారు. దీని ద్వారా ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్స్‌ పెరగడం వంటివి వస్తే అది సప్లమెంటరీ తప్ప దాని కోసం చేస్తున్నామంటే అంతకంటే ఫూలిష్‌నెస్‌ ఉండదు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు భంగం కలిగితే సంతోషించే రీతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా పనిచేస్తుంది అనేది వారి పత్రికలు చూస్తేనే తెలుస్తుంది. పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పుడో స్టార్ట్‌ అయ్యి సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో స్పీడ్‌ అందుకున్నాయి. పోలవరంపై పక్క రాష్ట్రవారు కామెంట్‌ చేస్తే ఈ రెండు పత్రికలు ఎందుకు ఆనందపడుతున్నాయో అర్థం కావడం లేదు.

తాజా వీడియోలు

Back to Top