వైయ‌స్ఆర్‌సీపీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలి

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)

పాతపట్నంలో మేము సిద్ధం.. మా బూత్ సిద్ధం 

శ్రీ‌కాకుళం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ ఆశయాలకు అనుగుణంగా 2024 ఎన్నికలలో 175 నియోజకవర్గాలలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పిలుపునిచ్చారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పరుచుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి అధ్యక్షతన జరిగిన పాతపట్నం నియోజకవర్గ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో  ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మాజీ మంత్రివర్యులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాసు, శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్, మాజీ రాజ్యసభ సభ్యులు పాలవలస రాజశేఖర్, శ్రీకాకుళం పార్లమెంట్ ఇంచార్జ్ పేరాడ తిలక్, పాతపట్నం నియోజకవర్గ పరిశీలికలు కరిమి రాజేశ్వరరావు పాల్గొని పార్టీ శ్రేణుల‌కు ఎన్నిక‌ల‌పై దిశానిర్దేశం చేశారు.  

ఈ సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడుతూ... ప్రభుత్వ అధికారులు కూడా రాలేని ప్రాంతాల్లోకి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి ముంగిటికే సంక్షేమ పథకాలు అందించి, పాతపట్నం నియోజకవర్గంలో సుమారు 3000 కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అందించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిదని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి కనీసం ఆరు హామీలు కూడా సంపూర్ణంగా అమలుచేయని వారు, నేడు ఆరు గ్యారంటీలు ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, అసలు వారి భవిష్యత్తే ప్రశ్నార్ధకంగా ఉంటే ప్రజలకు వారేం గ్యారెంటీ ఇస్తారని అన్నారు.

టిడిపి జనసేన ఈమధ్య నిర్వహించిన ఉమ్మడి సభ  కేవలం సీఎం జగన్ గారిపై వ్యక్తిగత దూషణలు, వారి జెండాలు జతకట్టడానికే తప్ప, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కానీ.. భవిష్యత్తులో వారు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో కనీసం ప్రస్తావించలేదని వారు కేవలం ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచనల వారికి లేవని మజ్జి చిన్న శ్రీ‌ను అన్నారు.

Back to Top