అనకాపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(గురువారం) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. వైయస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. సీఎం వైయస్ జగన్ ఉదయం 10.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.45 గంటలకు కశింకోట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో 10 నిమిషాల పాటు ముచ్చటిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి 11.15 గంటలకు పిసినికాడ వద్ద గల సభావేదిక వద్దకు చేరుకుంటారు. 11.20 గంటలకు వేదికపై మహానేత వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. 11.40 గంటల నుంచి 12.40 గంటల వరకు గంట పాటు సీఎం ప్రసంగిస్తారు. అనంతరం వైయస్ఆర్ చేయూత చివరి విడత నిధుల పంపిణీని బటన్ నొక్కి ప్రారంభిస్తారు. మహిళామార్ట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేస్తారు. మధ్యాహ్నం 12.55 గంటలకు బయలుదేరి కశింకోటలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. గంటసేపు ప్రజాప్రతినిధులతో ముచ్చటించిన అనంతరం 2.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 2.35 గంటలకు విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు తిరుగుపయనమవుతారు.