చంద్రబాబుది అధర్మ పాలన

టీడీపీకి ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు 

ఎన్ని కుట్రలు చేసిన వైయస్‌ జగన్‌ భయపడడు

ఒకసారి వైయస్‌ఆర్‌ పాలనను గుర్తు చేసుకోండి

వైయస్‌ జగన్‌ రాజన్న పాలన తెస్తాడు..

చీడికాడ ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

విశాఖ జిల్లా: వైయస్‌ఆర్‌ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు పాలనలో అంతా అవినీతే జరుగుతుందని వైయస్‌ విజయమ్మ అన్నారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ ఎన్నికల సభలో ప్రసంగించారు. వైయస్‌ఆర్‌ హయాంలో సుభిక్ష పాలన సాగితే..నేడు చంద్రబాబు హయాంలో అరాచక,అధర్మ పాలన సాగుతుందన్నారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే..

విశాఖ జిల్లా: «నేడు ధర్మానికి,అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టాలని కోరుతున్నా. ఒకసారి వైయస్‌ఆర్‌ను గుర్తుకుతెచ్చుకోవాలని కోరుతున్నా.. వైయస్‌ఆర్‌ను 30 సంవత్సరాలుగా మీ భుజ స్కందాలపై మోసి సీఎంగా చేసుకున్నారు.వైయస్‌ఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేశారు.రాష్ట్రాన్ని  అభివృద్ధి తీసుకెళ్ళాలని వైయస్‌ఆర్‌ ఎంతో కృషి చేస్తారు.సీఎం అయిన తర్వాత మొదటి సంతకం ఉచిత విద్యుత్‌పై పెట్టారు. కరెంట్‌ బకాయిలను మాఫీ చేశారు.చనిపోయిన రైతుల కుటుంబానికి లక్షన్నర రూపాయలు ఇచ్చారు.అన్ని రకాలుగా రైతులకు మేలు చేశారు.రైతుల బాగుడాలని సాగునీటి ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారు.నేడు చంద్రబాబు పాలనలు ఎక్కడా వేసిన గొంగొళి అక్కడే ఉంది.వైయస్‌ఆర్‌ పెన్షన్‌ను 200 లకు పెంచారు.71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు.పేదవారికి కార్పొరేట్‌ వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు.108,104 ద్వారా కొన్ని లక్షల మందికి ప్రాణాలు పోశారు.ఫీజు రీయింబర్స్‌ద్వారా కొన్ని లక్షల విద్యార్థులను చదివించారు.

అభయహస్తం ద్వారా పెన్షన్లు ఇచ్చారు.కుల,మతా,పార్టీలకు అతీతంగా సంక్షేమం కార్యక్రమాలు చేశారు.ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు కూడా సాయం చేసేవారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు.కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ను పెంచితే కూడా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది.వైయస్‌ఆర్‌ పాలనను ఒకసారి గుర్తుతెచ్చుకోవాలి.వైయస్‌ఆర్‌ శాచునేషన్‌ పద్దతిలో పరిపాలించారు. ఆయన కాలంలో ఒక పన్ను కూడా పెరగలేదు.అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఒక పైసా పన్ను కూడా పెరగలేదు.వైయస్‌ఆర్‌ అందరికి సంక్షేమం ఇచ్చారు.చెప్పింది.చెప్పనిది చేసి వైయస్‌ఆర్‌ ప్రజలను ఓటు అడిగారు.మళ్లీ ఆయనను గెలిపించారు.ప్రజల కోసం నిత్యం శ్రమించారు.చివరి క్షణం దాకా ప్రజల కోసమే ఆలోచించారు.వైయస్‌ఆర్‌ మరణంతో ఎంతో మంది గుండెలు ఆగిపోయాయి.వారిని పరామర్శించడానికి వైయస్‌ జగన్‌ ఓదార్పుయాత్ర చేపట్టారు.ప్రజలు ఎంతో ఆదరించారు.వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర కాంగ్రెస్‌కు నచ్చలేదు.

ఇచ్చిన  మాట కోసం వైయస్‌ జగన్‌ కాంగ్రెస్‌ను వదిలి బయటకు వచ్చారు.వైయస్‌ జగన్‌పై ఎన్నో కుట్రలు చేసి జైలుకు పంపించారు.మా కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురిచేశారు.ఆస్తులను అటాచ్‌చేశారు,సీబీఐ,ఈడీ విచారణలు చేశారు. అంతిమంగా జైలుకు కూడా పంపించారు.వైయస్‌ఆర్‌ బతికుండగా ఎన్నడూ బయటకు రాలేదు.18 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం బయటకు రావడం జరిగింది.మా కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్నారు.ప్రజలకు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.ప్రజల కోసం నిలబడాలని జైల్లో ఉన్న చెప్పాను.రాష్ట్ర ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చిన వైయస్‌ జగన్‌ అండగా ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేశారు.కడుపు మాడ్చుకుని దీక్షలు చేశారు.తొమ్మిది సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు చేశారు. వైయస్‌ఆర్‌ ప్రజల కోసం ఏవిధంగా ఉన్నారో జగన్‌ కూడా  అండగా ఉంటారు.

జగన్‌ మాట అంటే సాధిస్తాడు. చేసి తీరతాడు.వైయస్‌ జగన్‌ ఎప్పడూ చెపుతాడు నాన్న ఒంటరిని చేసి పోలేదు.మనకు ప్రజలనే  పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని చెబుతారు.మీ ఆదరణ, ఆప్యాయత ఎప్పటికి మరవలేము.వైయస్‌ జగన్‌ రాష్ట్రం పరువు నిలబెడతారు. వైయస్‌ఆర్‌ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.వైయస్‌ఆర్‌ మరణంతో నాకొచ్చిన కష్టం కంటే..రాష్ట్రానికే నష్టం ఎక్కవ నష్టం జరిగింది.హైదరాబాద్‌ను పొగొట్టుకున్న ఏమి లేని వారినిగా ఉన్నాం. ఐదు సంవత్సరాలయినా రాజధానిలో ఒక శాశ్వత ఇటుక కూడా పడలేదు. తాత్కాలిక భవనంలో ఉంటున్నాం.ఒక ప్రాజెక్టు కూడా రాలేదు.ఒక పరిశ్రమ కూడా రాలేదు. ప్రజలకు సంక్షేమం కూడా అందడంలేదు.40 సంవత్సరాలు అనుభవం అంటూ చంద్రబాబు 650 వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.ఒక వాగ్ధానం కూడా నెరవేర్చలేదు.

ఐదు సంతకాలు చేశాడు. ఒక సంతకానికి కూడా విలువ లేదు.గత పాలనలో  వైయస్‌ఆర్‌ సంతకం చేస్తే మరుసటి రోజు నుంచి అమలయ్యేది. చంద్రబాబు సంతకాలు గాలికి కొట్టుకుపోయాయి.చంద్రబాబు పాలనలో అంతా అవినీతే జరుగుతుంది.రైతులకు 87 వేల  కోట్లు రూపాయలు అప్పు ఉంది. నేడు లక్షా 50వేల కోట్ల రూపాయలకు అప్పు వెళ్ళింది.రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రైతులను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టించారు.రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు ఉండటం లేదు.వైయస్‌ఆర్‌ హయాంలో పంటలకు గిట్టుబాటు ధర ఉండేది.

చంద్రబాబు పాలనలో మద్దతు ధరలు కూడా లేవు.ఎకరానికి కూడా బీమా రాలేదు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేశాడా అని అడుగుతున్నా.. ఆ రోజు 14వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పాడు..చేశాడా అని అడుగుతున్నా. వైయస్‌ఆర్‌ హయాంలో మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారు.చంద్రబాబు మీకు వడ్డీలు లేని రుణాలు కూడా రాకుండా చేశాడు.కేవలం రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయనగా పసుపు–కుంకుమ అంటూ మళ్లీ చంద్రబాబు మోసాలు మొదలు పెట్టాడు.వైయస్‌ఆర్‌ హయాంలో  ధాన్యం కొనుగోలు,గిరిజన ఉత్పత్తులు అమ్మకాలు,పాలకేంద్రాలు,రేషన్‌కార్డులు అన్నింట్లోను భాగస్వాముల్ని చేశారు.వైయస్‌ఆర్‌ పాలనను ఒకసారి గుర్తుకుచేసుకోవాలి. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చే మూడువేలకు మోసపోవద్దు.

‘1978లో వైఎస్సార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో సీఎం అయ్యారు. అంతకాలం ఆయన ఏ పదవిలో లేరు. అయినా, రైతుల సమస్యలపై పోరాడారు. అప్పుల బాధతో వేలాది మంది రైతులు చనిపోతుంటే.. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైయ‌స్ఆర్  నాడు సీఎంగా ఉన్న చంద్రబాబును నిలదీశారు. రైతులకు లక్ష రూపాయల చొప్పన రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కానీ, వారికి రుణాలు మాఫీ చేస్తే అదే అలవాటవుంతుందని, లక్ష రూపాయలు మాఫీ చేస్తే మరింతమంది ఆత్మహత్య చేసుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. బాబు వ్యాఖ్యలపై సీరియస్‌ అయిన వైయ‌స్ఆర్‌.. కోటి రూపాయలిస్తా నువ్ చనిపోతావా బాబూ అని కౌంటర్‌ వేశారు. రైతుల ప్రాణాల విలువ అర్థం కావడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సీఎం అయిన తర్వాత తొలి సంతకం రైతులకు ఉచిత విద్యుత్‌ ఫైలుపై చేశారు. విద్యుత్‌ బకాయిలు మాఫీ చేశారు.

చనిపోయిన రైతు కుటుంబాలకు లక్షన్నర రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు.  ‘విశాఖ జిల్లాను  వైయ‌స్ఎఆర్ ఎన్నోసార్లు సందర్శించారు. ఇక్కడి ప్రజలను పేరుపెట్టి పిలిచేంత చనువు ఉండేది. అందుకే ప్రజలు, రైతుల సమస్యలేంటి.. వారికి ఏయే సంక్షేమ ఫలాలు అందాలి అనే విషయం వైఎస్సార్‌కు బ్లూప్రింట్‌లా ఉండేది కావచ్చు. మీ అందరి శ్రేయస్సును కోరుతూ.. ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. రైతులకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ఉత్తరాంధ్రలో జంఝావతి, తోటపల్లి, వంశధార ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. కానీ, మిగిలిపోయిన పనులను గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ అయిదేళ్లలో చంద్రబాబు వాటిని నిర్లక్ష్యం చేశారు. గత ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయొద్దు. చంద్రబాబు అయిదేళ్ల అరాచక పాలనలో ఎన్నో కష్టాలు పడ్డారు. రాజన్న పాలన మళ్లీ రావాలంటే వైఎస్‌ జగన్‌ సీఎం కావాలి. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైఎస్సార్‌సీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ వెంకట సత్యవతిని, మాడుగుల ఎమ్మెల్యే అభర్థిగా ముత్యాల నాయుడుని గెలిపించాల‌ని కోరుతున్నా..

Back to Top