నిన్ను నమ్మం బాబు అని చెప్పండి

పెనుమ‌లూరులో వైయ‌స్ ష‌ర్మిల‌

వెన్నుపోటు, మోసం చంద్ర‌బాబు నైజం

చంద్రబాబుకు మాట మీద నిలబడే తత్వం ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది. 

అమ‌నావ‌తిలె ఒక్క శాశ్వత భవనం అయినా నిర్మించాడా..?

ఎన్టీఆర్‌ కుటుంబాన్ని అవసరం వచ్చినప్పుడల్లా వాడుకొని అవసరం తీరాక పక్కనబెట్టాడు

 

 

 కృష్ణా జిల్లా: ఐదేళ్ల‌లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం కూడా నెర‌వేర్చ‌ని చంద్ర‌బాబుకు ముఖం మీదే నిన్ను న‌మ్మం బాబు అని చెప్పాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ సోద‌రి వైయ‌స్ ష‌ర్మిల పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి.. ముఖ్యమంత్రి అంటే ప్రజలను ఎలా ప్రేమించాలి, ప్రజలకు ఏయే మంచి పనులు చేయాలో చేసి చూపించి ఆదర్శంగా నిలిచిన నాయకుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల అన్నారు. మన, పర తేడా లేకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు వైయస్‌ఆర్‌ ఒక్కరే.సోమ‌వారం సాయంత్రం కృష్ణా జిల్లా పెనుమ‌లూరులో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఆమె మాట్లాడారు.

 ఇప్పుడున్న‌ ముఖ్యమంత్రిని. గత ఐదేళ్లుగా చూస్తున్నాం. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండకూడదో.. ముఖ్యమంత్రి అంటే ఏయే పనులు చేయకూడదో.. మ‌న‌కు సినిమా చూపించారు. మళ్లీ ఇలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారా.. వెన్నుపోటు, మోసం నుంచి పుట్టినవాడు. రైతులను దగా చేశాడు. మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు. రైతులను దగా చేశాడు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. రుణమాఫీ కాదు.. ప్రస్తుతం ఆయన ఇస్తున్న పసుపు – కుంకుమ ఆ వడ్డీకి కూడా సరిపోవడం లేదు. చంద్రబాబు భిక్షం ఇచ్చినట్లుగా పసుపు – కుంకుమ పేరుతో దగా చేస్తున్నాడు. మహిళలను మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 

చంద్రబాబు విద్యార్థులకు ఏమైనా మేలు చేశాడా.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని మభ్యపెట్టాడు. పూర్తి ఫీజురియంబర్స్‌మెంట్‌ లేదు, ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రులను తీసేశాడు. జబ్బు వస్తే చంద్రబాబు కుటుంబం కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాలి కానీ, సామాన్యుడు మాత్రం గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్లాలని శాసిస్తున్నాడు. ఇది అమానుషం కాదా..?

పోలవరం రూ. 15 వేల కోట్లు ఉన్న ప్రాజెక్టును కమీషన్ల కోసం రూ. 60 వేల కోట్లకు పెంచాడు. మూడేళ్లలో పూర్తి చేస్తానని వాగ్దానం చేశాడు. నిజంగా చంద్రబాబుకు మాట మీద నిలబడే తత్వం ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది. 

అమరావతి రాజధాని అని చెప్పుకుంటూ తిరుగుతున్న చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం అయినా నిర్మించాడా..? ఒక్క ఫ్లైఓవర్‌ కూడా కట్టలేదు. కేంద్రం నుంచి రూ. 2500 కోట్లు వచ్చాయని కేంద్రమంత్రి చెబుతున్నాడు. ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేశారు. ఇంతటి అసమర్థ ముఖ్యమంత్రి మనకు అవసరమా..? 

ప్రత్యేక హోదాను చంద్రబాబు నీరుగార్చడు. బీజేపీతో కుమ్మకై ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టాడు. బీజేపీ ఇంత ద్రోహం చేయడానికి, హోదా ఇవ్వకపోవడానికి కారణం చంద్రబాబు. ప్రత్యేక హోదా కావాలని ఒకసారి, వద్దని ఒకసారి, మళ్లీ కావాలని ఒకసారి హోదాపై అనేక మాటలు మారుస్తున్నాడు. చంద్రబాబు మాటలు వింటే ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుంది. 

బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది.. చంద్రబాబు కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు శాఖలు అప్పగించి మంత్రిని చేశారు. పప్పుకి కనీసం జయంతి, వర్థంతికి కూడా తేడా తెలియదు. సామాన్య ప్రజలకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే గుండుకొట్టిస్తాడు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలు ఒక లెక్కా.. కాంగ్రెస్‌లో ఓడిపోతే.. పాపం అల్లుడు కదా అని టీడీపీలో చేర్చుకున్న పాపానికి కళ్లు ఆర్పకుండానే పట్టపగలే వెన్నుపోటు పొడిచి కుర్చి లాక్కొని పార్టీని కబ్జా చేశాడు. ఎన్టీఆర్‌ కుటుంబాన్ని అవసరం వచ్చినప్పుడల్లా వాడుకొని అవసరం తీరాక పక్కనబెట్టాడు. ప్రజలు ఒక లెక్కా.. మళ్లీ చంద్రబాబును నమ్ముతారా.. మీ భవిష్యత్తు నా బాధత్య అని చెప్పుకొని తిరుగుతున్నాడు. మన భవిష్యత్తు చంద్రబాబు చేతిలో పెడితే సర్వనాశనం చేస్తాడు. నారాసుర రాక్షసులను నమ్మొద్దు. ప్రత్యేక హోదా ఉద్యమం ఇవాల్టికి బతికి ఉందంటే దానికి కారణం జగనన్న, హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేశాడు, రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, బంద్‌లు, నిరసనలు చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.. తరువాత ఎంపీలు రాజీనామాలు చేశారు. చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని ప్యాకేజీ వద్దూ.. హోదా కావాలనడానికి కారణం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. 

చంద్రబాబు నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందని నాన్న ఎప్పుడూ అనేవారు. అందుకనే చంద్రబాబు నిజం చెప్పరు. చంద్రబాబుకు మాట మీద నిలబడడం తెలియదు. అవినీతి, వెన్నుపోటుకు నేనే ఫస్ట్‌ అంటాడు చంద్రబాబు. మళ్లీ ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వొద్దు. గత ఎన్నికల్లో 600 వాగ్దానాలు ఇచ్చాడు.. వాటిల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాటికి సమాధానం చెప్పలేక టీడీపీ వెబ్‌సైట్‌లో మేనిఫెస్టో కూడా తీసేశాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మొద్దు. మొహం మీదనే నిన్ను నమ్మం బాబు అని చెప్పేయండి. 

తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ముంటే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. చంద్రబాబు మీ ఓట్లను డబ్బులిచ్చి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అమ్ముడుపోతారా.. చంద్రబాబు ఎంత డబ్బులు ఇచ్చినా మీకు పడిన బాకీ తీర్చలేరు. ఈ ఐదేళ్లలో ఏ తల్లిదండ్రులు ఫీజులు కట్టారో ఆ ఫీజు, వడ్డీ కలిపి లెక్కేస్తే చంద్రబాబు మీకంత బాకీ. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు అన్నాడు. ఈ ఐదేళ్లలో ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రికి రూ. 25 వేలు బాకీ. మాది మాకు ఇచ్చేయాలని డిమాండ్‌ చేయండి. కాలేజీ విద్యార్థికి ఐప్యాడ్, మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు ఇస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఐదు సంవత్సరాల్లో ఇంటికి రూ. 1.20 లక్షలు బాకీ పడ్డాడు.  ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, దాంట్లో ఇల్లు కూడా కట్టిస్తానన్నాడు, అమరావతి, విశాఖలో వేల ఎకరాలను స్వాహా చేశాడు. ఆ భూమి అంతా మీదే. మీ భూమి మీకు రాసిచ్చేయమని చెప్పండి. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలకు, మరమగ్గాలకు మొత్తం రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. వడ్డీతో కలిసి మొత్తం ఇచ్చేయమని వసూలు చేయండి. తెలుగుదేశం వారు ఇంటికి వచ్చి ఓటు అడిగితే ముందు బాకీ తీర్చమని అడగండి. 

తొమ్మిదేళ్లు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల కొచ్చిన ప్రతి కష్టంలో నిలబడి పోరాటం చేశాడు జగనన్న. విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేశాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు జగనన్న. కోట్ల మంది ప్రజలను కలిశాడు. వాళ్ల కష్టాలను విన్నాడు, తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. నాన్న లాగా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు. జగనన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి రైతు రాజు అవుతాడు. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు రూ. 12,500 మే మాసంలోనే ఇస్తారు. డ్వాక్రా సంఘాల మహిళల రుణాలు నాలుగు దఫాలుగా వారి చేతికే అందిస్తారు. మళ్లీ సున్నావడ్డీకే రుణాలు ఇస్తారు. ప్రతి తల్లి తన పిల్లలను బడికి పంపించిందుకు రూ. 15 వేలు ఇస్తారు. 45 నుంచి 65 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేలు ఆర్థిక సాయం చేస్తారు. ప్రతి ఎకరాకు నీరు, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం, ప్రతి పేదవాడికి అండగా ఉంటాం. జగనన్నకు  ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. బాబు వస్తే జాబు అన్నారు.. కానీ కరువు వచ్చింది. అందుకే బాబు వద్దు.. బై బై బాబు.. ప్రజా తీర్పు కావాలి. బాబును, పప్పును ఇంటికి పంపించిండి. రాజన్న రాజ్యం తెచ్చుకుందాం

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి అన్నను, ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారధి అన్నను గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. 11వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి మీ రాజన్నను తలచుకోండి. మీకు సేవచేయాలనుకుంటున్న జగనన్నకు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి. 
 

Back to Top