బాబు డైరెక్షన్‌..పవన్‌ యాక్షన్‌

చంద్రబాబు..కాంగ్రెస్, జనసేనతో కలిసి వస్తున్నారు

పౌరుషం, రోషం అనే మాటలు చంద్రబాబుకు సరిపోవు

పిల్లి గట్టిగా అరిస్తే పులైపోదు..పులి పులే..పిల్లి పిల్లే

డ్వాక్రా మహిళలకు బాబు ఇస్తానన్న స్మార్ట్‌ఫోన్‌ హామీ ఏమైంది?

ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీ ఏమైంది?

రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న రావాలి

 

నర్సాపురం:  చంద్రబాబు డైరెక్షన్‌లో నటుడు పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్నారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల విమర్శించారు. చంద్రబాబు ఏది చెబితే..పవన్‌ అదే మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తే..ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, జనసేనలతో కలిసి వస్తున్నారని తెలిపారు. రాజన్న రాజ్యం కావాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని షర్మిల పేర్కొన్నారు. శుక్రవారం బస్సు యాత్రలో భాగంగా నర్సాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

 •  ప్రతి పేదవాడు ఉచితంగా వైద్యం చేయించుకునే వీలుగా ఆరోగ్యశ్రీ ఉండేది. కుయ్‌.. కుయ్‌ అని ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో 108 వచ్చేది. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని ఆశించారు. ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క రోజూ ఏ చార్జీ పెంచలేదు. ఏ పన్ను పెంచకుండా సంక్షేమం, అభివృద్ధి పథకాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే. ప్రతి వర్గానికి మేలు చేసిన నాయకుడు వైయస్‌ఆర్‌ మాత్రమేనని గర్వంగా చెప్పుకోగలం. మహానేత చనిపోయి పదేళ్లు కావొస్తున్న ఈ రోజుకు ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు. 
 • రుణమాఫీ చేయకుండా రైతులను, డ్వాక్రా మహిళలను వంచన చేశాడు. మొదటి సంతకం అని దానికి విలువ లేకుండా చేశాడు. 
 • ఆరోగ్యశ్రీని నీరుగార్చడు. పేదవాడు కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లనివ్వకుండా చేశాడు. పేదవాడు గవర్నమెంట్‌ ఆస్పత్రికి వెళ్లాలని శాసిస్తున్నాడు. 
 • రూ. 15 వేల కోట్లు ఉన్న పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం రూ. 60 వేల కోట్లకు పెంచి కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును తానే చేస్తానని ఇప్పించుకున్నాడు. 
 • చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం ఉంటే పోలవరం ఇప్పటికే పూర్తయ్యేది. 
 • చాలా అనుభవం ఉందని ప్రచారం చేసుకొని ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క పర్మినెంట బిల్డింగ్‌ అయినాకట్టలేదు. ఒక్క ఫ్లైఓవర్‌ కూడా కట్టలేదు. కేంద్రం ఇచ్చిన రూ. 25 వందల కోట్లు ఏమైంది. 
 • బాబు వస్తే జాబు వస్తుందన్నాడు. తన కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. జయంతికి, వర్థంతికి తేడా తెలియని పప్పుకు ఏకంగా మూడు మంత్రి పదవులు ఇచ్చాడు. ఏ అర్హత ఉందని ఇచ్చారో చెప్పాలి.
 • ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్రానికి ఊపిరి లాంటిది. అంత ముఖ్యమైన హోదాను చంద్రబాబు నీరుగార్చడానికి చేయని ప్రయత్నం లేదు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి హోదాను తాకట్టుపెట్టాడు. 
 • ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయని పోరాటం లేదు. ఢిల్లీలో ధర్నాలు, మన రాష్ట్రంలో నిరాహార దీక్షలు, బందులు, రాస్తారోకోలు చేశారు. ఆఖరికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పదవి త్యాగం కూడా చేశారు. 
 • వైయస్‌ జగన్‌ పోరాటం వల్లే చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని ప్యాకేజీ వద్దు.. హోదా అంటున్నారు. 
 • బీజేపీతో సంసారం చేసింది చంద్రబాబు.. ఇప్పుడు వైయస్‌ఆర్‌ సీపీకి అంటగడుతున్నాడు. బీజేపీతో పొత్తు ఉంటే వైయస్‌ జగన్‌ కేసులన్నీ బీజేపీతో మాఫీ చేయించుకునే వారు కాదా..? 
 • హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందనే ఇంగితం లేకుండా కేసీఆర్‌తో పొత్తుకోసం చంద్రబాబు వెంపర్లాడాడు. 
 • మాకు ఎవరితో పొత్తు లేదు. అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైయస్‌ జగన్‌ సింగిల్‌గానే.. వైయస్‌ఆర్‌ సీపీ సింగిల్‌గానే బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని అన్న సర్వేలు చెబుతున్నాయి. 
 • నక్కలే గుంపులుగా వస్తాయి. చంద్రబాబు జనసేన, కాంగ్రెస్‌తో కలిశారు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్, ఫరూక్‌ అబ్దుల్‌తో కలిసి ఎవరు తోడుగా వస్తే వారితో వచ్చేది ఈ నక్క చంద్రబాబే. 
 • పవన్‌ కల్యాణ్‌ గురించి ఒక మాట చెప్పాలి. ఒక యాక్టర్‌.. రాజకీయ సినిమాలో పవన్‌ యాక్టర్‌ అయితే.. చంద్రబాబు దానికి డైరెక్టర్, యాక్టర్‌ డైరెక్టర్‌ చెప్పినట్లు చేయాలి. అందుకే చంద్రబాబు చెప్పినట్లుగా పవన్‌ చేస్తున్నాడు. ఇద్దరూ ఒకటే. కలిసే ఉన్నారు. కలిసే సీట్లు పంచుకుంటున్నారు. పవన్‌ నామినేషన్‌ వేయడానికి వస్తే టీడీపీ నేతలు తప్పట్లు కొట్టడానికి వస్తారు. జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. జనసేనకు ఓటు వేస్తే టీడీపీకి ఓటు వేసినట్లే.. పవన్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే.. ఇది స్పష్టం. 
 • పవన్‌ కల్యాణ్‌ అన్న చిరంజీవి ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పెట్టింది కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా అయితే చివరకు అదే కాంగ్రెస్‌కు హోల్‌ సేల్‌గా అమ్మేశారు. అన్నాతమ్ముడికి పోలికలు ఉంటాయి కదా.. పవన్‌ కల్యాణ్‌ కూడా ఎప్పుడో జనసేనను హోల్‌సేల్‌గా అమ్మేస్తారు. 
 • ఓదార్పు అనే మాట కోసం కాంగ్రెస్‌ను వదిలి వైయస్‌ జగన్‌ సింగిల్‌గా బయటకు వచ్చారు. అది పౌరుషం అంటే.. అది రోషం అంటే. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి టీడీపీని కబ్జా చేసిన చంద్రబాబు పౌరుషం గురించి మాట్లాడుతున్నాడు. పిల్లి ఎవరో.. పులి ఎవరో ప్రజలకు తెలుసు చంద్రబాబూ..
 • టీడీపీ నాయకులు ఓట్ల కోసం ఇంటికి వస్తే నిలదీయండి. కేజీ నుంచి పీజీ వరకు ఉచితం అన్నారు... కట్టిన ఫీజులన్నీ వసూలు చేయండి. 
 • ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఇస్తానన్నాడు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు రూ. 25 వేలు బాకీ.. ఓట్ల కోసం టీడీపీ నేతలు వస్తే బాకీ తీర్చమనండి. 
 • విద్యార్థులకు ఐప్యాడ్లు, మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు అన్నాడు. ఎన్నికలలోపు ఇచ్చేయమని చెప్పండి. నిరుద్యోగ భృతి కింద రూ. 1.20 లక్షలు ప్రతి ఇంటికి బాకీ పడ్డాడు. ముందు ఆ బాకీ తీర్చమని అడగండి. 
 • మహిళలకు, రైతులకు, చేనేతలకు రుణమాఫీ అన్నారు. ఆ రుణం, వడ్డీతో కలిసి బాకీ తీర్చమనండి. 
 • తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటు అమ్మమంటారు. ఎన్ని డబ్బులు ఇచ్చినా చంద్రబాబు మీ బాకీ తీర్చలేరు.  
 • ఈ అవినీతి రాజ్యం పోవాలంటే, రాజన్న రాజ్యం కావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. జగనన్న ఈ తొమ్మిదేళ్లు నీతివంతమైన రాజకీయాలు చేశారు. పాదయాత్ర 3,648 కి.మీ చేశారు. ప్రజ సమస్యలను దగ్గరగా చూశారు. వ్యవసాయం పండగ కావాలంటే, మాట తప్పనివాడు కావాలంటే, మడమతిప్పని వాడు కావాలంటే జగనన్న రావాలి. ప్రతి రైతు తలెత్తుకునేలా చేస్తాం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా మే నెలలోనే రూ. 12, 500 అందిస్తారు. గిట్టుబాటు ధర కోసం 3వేల కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తారు. కరువులను ఎదర్కొవడానికి 4వేల కోట్ల రూపాయలతో మరో నిధిని ఏర్పాటు చేస్తారు.కరువులు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా నాలుగు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం.  విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తారు. ఎంత చదువు చదివిన ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. విద్యార్థులకు హాస్టల్‌, మెస్‌ చార్జీలను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలుగు దఫాలుగా చెల్లిస్తాం. అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల నాటికి ఉన్న బకాయిలను నాలుగు దఫాలుగా మాఫీ చేస్తారు. మళ్లీ సున్నా వడ్డీలకే రుణాలు ఇస్తారు. ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తారు. అవ్వ తాతలకు పింఛన్‌ మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు మూడు వేల రూపాయలు పింఛన్‌ ఇస్తూ.. ప్రతి విషయంలో వారికి అండగా నిలుస్తాం. సమస్య లేకుండా.. మీ సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం. ఎరువుల ప్యాక్టరీ రాకుండా చూస్తాం. మళ్లీ దుర్మార్గపు పాలన మనకు అవసరం లేదు. హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కనే ఉంచుకుని కేసీఆర్‌తో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నించారు. తమకు ఏ పార్టీతో పొత్తు లేదు... ఆ అవసరం కూడా లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. అందుకే చంద్రబాబు అందరినీ వెంట పెట్టుకుని వస్తున్నారు. చంద్రబాబుకు బాయ్‌ బాయ్‌ చెప్పమ’ని కోరారు.
Back to Top