‘అఖండ విజయం సాధిస్తున్నాం. ఇది ప్రజల విజయం. అందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబునాయుడు గారు సీఎం స్థాయిని కూడా దిగజార్చారని, ఎన్నికల సంఘాన్ని బెదిరించారని, కుయుక్తులు పన్నారని, అరాచకాలు సృష్టించారని, డ్రామాలూ చేశారని ఆయన ఆక్షేపించారు. ఇంతటి ఆటుపోట్లు తట్టుకుని పార్టీ తరపున నిలబడిన ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నానని వెల్లడించారు. పోలింగ్ ప్రక్రియలో పార్టీకి చెందిన వారు కొందరు గాయపడ్డారని, ఇద్దరి ప్రాణాలు పోయాయని జననేత ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటికే 80 శాతానికి పైగా ప్రజలో ఓటింగ్‌లో పాల్గొన్నారని, వారంతా తమ ఓటు వీవీ ప్యాట్‌ల్లో చూసుకున్నారని, అందరూ తృప్తి చెందారని, అలాంటప్పుడు రీపోలింగ్ ఎందుకని ప్రశ్నించారు. కేవలం ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబునాయుడు గారు ఆ డిమాండ్ చేస్తున్నారని ఆక్షేపించారు.
పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత గురువారం రాత్రి హైదరాబాద్‌లో వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు.
సీఎం స్థాయిని దిగజార్చారు
ఈ ఎన్నికల్లో తన ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబుగారు సీఎం స్థాయిని కూడా దిగజార్చి ఏకంగా ఎన్నికల కమిషన్‌ను బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఓటింగ్ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్నడం, అరాచకాలు సృష్టించడం, డ్రామాలు చేయడం, అన్నీ కూడా చూశామని శ్రీ వైయస్ జగన్ అన్నారు.
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు అందరికీ .. ప్రతి అక్కా చెల్లెమ్మకు, ప్రతి అవ్వా తాతకు, ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.
అభినందన–సానుభూతి
ఇంతటి ఆటుపోట్లు తట్టుకుని పార్టీ తరపున నిలబడ్డ ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నానన్న జననేత, ఈ పోలింగ్ ప్రక్రియలో కొంత మంది గాయపడ్డారని, ఇద్దరి ప్రాణాలు కూడా పోయాయని, పార్టీ సానుభూతిపరులు చనిపోయారని ఆవేదన చెందారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
ఓడిపోతామని తెలిసి
వ్యవస్థను ఒకసారి చూస్తే.. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం.. నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతాడని తెలిసి, ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చూస్తే చాలా బాధనిపిస్తోందని శ్రీ వైయస్ జగన్ అన్నారు.
పోలింగ్ ప్రక్రియలో చోటు చేసుకున్న ఘటనలు, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడులను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
– చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం, టి.సుదుంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడిలో వైయస్సార్‌సీపీ కార్యకర్త వెంకట్రాయపరెడ్డి మృతి చెందారు.
– అనంతపురం జిల్లా తాడిపత్రిలో జెసీ దివాకర్‌రెడ్డి వర్గీయులు వేట కొడవళ్లతో దాడి చేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పుల్లారెడ్డి అనే కార్యకర్త చనిపోయారు.
– విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం, చినకుదమలో వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిపై టీడీపీ నాయకుడు రామకృష్ణ దాడి చేశారు.
– నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా, వారిని వైయస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అడ్డుకోవడంతో ఆయనతో పాటు, పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు.
– గుంటూరు జిల్లా గురజాల వైయస్సార్‌సీపీ అభ్యర్థి కాసు మహేష్‌రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు
– నరసారావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేశారు.
– చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం.ఎస్.బాబుపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు ఆయనను తీవ్రంగా గాయపర్చారు.
– గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా పోలింగ్ సిబ్బందిని బెదిరించారు.
–మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ యథేచ్ఛగా ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ఏకంగా 10 మందితో కలిసి పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించారు.
– గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై టీడీపీ నేతల దాడి. ఘటనలో కారు అద్దాలు ధ్వంసం.
వీటన్నింటినీ వివరించిన శ్రీ వైయస జగన్, ఇన్నిన్ని ఘటనలు జరిగాయని చెప్పారు.
సిగ్గుతో తల దించుకోవాలి
ఎన్నికలు జరగకుండా చూసేందుకు, ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు చంద్రబాబునాయుడు గారు పన్నుతున్నారన్న దానికి, నిజంగా ముఖ్యమంత్రిగా తాను చేసిన పనులకు తాను సిగ్గుతో తల దించుకోవాలని జననేత స్పష్టం చేశారు.
ప్రజల విజయం
అయినప్పటికీ దాదాపు 80 శాతంకు పైగా ప్రజలు పోలింగ్‌లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లు వేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ముందుకు రావడం, హర్షించతగిన విషయాలని, ఇది ప్రజల విజయం అని. అందుకు ప్రజలందరికీ హృదయపూర్వకంగా «కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.
గురజాల నియోజకవర్గం, జంగ మహేశ్వరంలో 600 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్న విషయం ఇప్పుడే తెలిసిందని వివరించారు.
రీపోలింగ్ ఎందుకు?
రీపోలింగ్ జరపాలన్న చంద్రబాబు డిమాండ్‌పై స్పందించిన శ్రీ వైయస్ జగన్, చాలా స్పష్టంగా సమాధానమిచ్చారు.
‘అన్నా ఒక్కటి నాకు చెప్పండి. 80 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. దాదాపు 3.93 కోట్ల మందిలో 80 శాతం పోలింగ్‌లో పాల్గొని, వారు ప్రతి సారీ ఈవీఎం బటన్ నొక్కితే, వారు ఏ పార్టీకి ఓటు వేశారన్నది స్పష్టంగా కనిపించింది. నాకు కూడా కనిపించింది. అలా కనిపించిన తర్వాత వారు తృప్తి చెందారు. ఇప్పటికే 80 శాతం పోలింగ్ జరగ్గా, అది పూర్తయ్యే సరికి ఓటింగ్ శాతం 85 శాతానికి చేరే వీలుంది. వారు స్పష్టంగా వీవీ ప్యాట్‌లో చూసుకున్నారు కూడా. అంత మందికి ఓటర్లకు స్పష్టత ఉన్నప్పుడు, ఎవరైనా రీపోలింగ్ ఎందుకు కోరుతారు? ఓడిపోతామన్న భయం ఉంటే తప్ప’ అని జననేత తేల్చి చెప్పారు.
ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం
భారీ పోలింగ్ ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు. అందుకే చంద్రబాబు ఓటింగ్ శాతం తగ్గించడానికి చాలా ప్రయత్నించారని, అందుకు ఎన్నో విధాలుగా ప్రకటనలు చేశారని, కానీ ప్రజలకు అన్నీ తెలుసని, వారే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారని చెప్పారు.
అఖండ విజయం సాధిస్తున్నాం
‘అఖండ విజయం సాధిస్తాము. చంద్రబాబు వంటి రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి సమస్యలు వస్తున్నాయి. అంతకు మించి సమాధానం లేదు. ఒక మనిషి ఓడిపోతున్నామని తెలిసి ఏ స్థాయికి దిగజారాడు చూశారు కదా?. ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి, వాళ్లను బెదిరిస్తారు. ఈవీఎంలపై ఆరోపణలు, విమర్శలు చేశారు. పోలింగ్ జరగకుండా తప్పుడు ప్రకటనలు ఇచ్చి విశ్వ ప్రయత్నం చేశారు. ఇంకా ఓటింగ్‌లో ప్రజలను భయభ్రాంతులను చేసే ప్రయత్నం చేశారు. ఇది సమంజసమా? అలా చేయవచ్చా?’ అని ప్రశ్నించారు.
మహిళలు–రైతులు
మహిళలు తప్పకుండా తమ వెంటే ఉన్నారని, చంద్రబాబు చేసిన మోసాన్ని వారు ఎప్పుడూ మర్చిపోరని అన్నారు.
ఎన్నికల ప్రచారంలో కూడా ఈ విషయం ప్రస్తావించానంటూ, పసుపు–కుంకుమ పేరుతో చేసిన మోసాన్ని వివరించారు.
చంద్రబాబు మోసం
‘చంద్రబాబునాయుడు గారు 2016, మే నుంచి పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు రద్దు చేశారు. ఆ విధంగా వారికి దాదాపు మూడేళ్ల నుంచి సున్నా వడ్డీ రుణాలు అందడం లేదు. ఈ నేపథ్యంలో పొదుపు సంఘాల మహిళల్లో రూ.5 లక్షలు తీసుకున్న అక్కా చెల్లెమ్మలు మూడేళ్లలో రూపాయి వడ్డీ చొప్పున మొత్తం రూ.1.80 లక్షల వడ్డీ, రూ.7 లక్షల రుణం తీసుకున్న అక్కా చెల్లెమ్మలు ఈ మూడేళ్లలో రూ.2.52 లక్షలు, రూ.10 లక్షలు తీసుకున్న అక్కా చెల్లెమ్మలు మూడేళ్లలో రూ.3.60 లక్షల వడ్డీ కట్టగా, వారికి ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన మొత్తం కేవలం రూ.10 వేలు మాత్రమే. వారికి అన్నీ తెలుసు’.
‘వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లకు ఈ 5 ఏళ్లలో రైతులు దాదాపు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల రుణాలు కట్టారు. వారికి సున్నా వడ్డీ రుణాలు Mýూడా ఇవ్వలేదు. వారు కూడా చంద్రబాబు మోసాలు గుర్తించారు’ అని జననేత వివరించారు.
చంద్రబాబునాయుడు, కేసీఆర్ మధ్య ఉన్న రిటర్న్ గిఫ్ట్‌తో తనకేమి సంబంధమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఏదేమైనా రాష్ట్రంలో అఖండ విజయం సాధించబోతున్నామని తేల్చి చెప్పిన శ్రీ వైయస్ జగన్, ఇతర రాష్ట్రాలలో ప్రచారం చేయబోనని స్పష్టం చేశారు.