తాడేపల్లి: సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. నిబంధనలు పాటించకుండా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, వాళ్లు ఒకసారి తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోలీస్ అధికారిలా కాకుండా.. అధికార పార్టీ కార్యకర్తలా డీజీపీ మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. వన్‌సైడెడ్‌గా ఉండకండి. వ్యవస్థపై గౌరవంతో ఉండండి. మేం చూస్తూ ఊరుకోం. తప్పు చేసే పోలీసుల మీద ఫిర్యాదు (ప్రైవేట్ కంప్లయింట్) చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. అప్పటికీ మేం ఇక్కడ ఉండం కదా అని కొందరు అనుకుంటున్నారేమో... ట్రాన్స్‌ఫర్ అయినవాళ్లనే కాదు.. రిటైర్ అయిన కూడా వదలం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం. చూస్తూ ఊరుకోం. చట్టం ముందు దోషులుగా నిలబెతాం. రెడ్ బుక్ ఇప్పుడు ఉన్నవాళ్లే కాదు. బాధితులు కూడా రెడ్‌బుక్‌లు పెట్టుకుంటారు. వాటి ఆధారంగా అలాంటి పోలీసులపై చర్యలు కచ్చితంగా తీసుకుంటాం అని వైయస్ జగన్ హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చీకటి రోజులు: ఈరోజు రాష్ట్రంలో దారుణ పరిస్థితులు. వాస్తవానికి ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు, బహుశా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎక్కడా, ఎప్పుడూ చూసి ఉండరు. అంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుండడంతో, రాష్ట్రం అతలాకుతల పరిస్థితిలో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో చీకటి రోజులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఎన్నికలప్పుడు మనం ఏం చెప్పాం? ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్నది పక్కకు వెళ్లిపోయింది. మనం ఎన్నికలప్పుడు చెప్పినది చేయడం లేదు కాబట్టి, దాన్ని ప్రశ్నించే స్వరం ఉండకూడదని ఏకంగా అణగదొక్కే కార్యక్రమాలు, చర్యలు మాత్రమే కనిపిస్తున్నాయి. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సెవెన్ అన్నారు. 5 నెలలు గడిచాయి. సూపర్ సిక్సులు లేవు, సూపర్ సెవెన్‌లూ లేవు. ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారు: ప్రతి సెక్షన్‌నూ మోసం చేశారు. నీకు 15వేలు అంటూ పిల్లలను, నీకు 18వేలు అంటూ అక్కచెల్లెమ్మలను, నీకు 48వేలు అంటూ 50 ఏళ్లు నిండిన పెద్దమ్మలను, నీకు 36వేలు అంటూ 20 ఏళ్లు నిండి ఉద్యోగం కోసం చూస్తున్న యువతను, నీకు 20వేలు అంటూ రైతన్నలను మోసం చేశారు. 5 నెలలుగా ఈ ప్రభుత్వం మోసం చేయని సెక్షన్ ఏదీ లేదు. ఈ 5 నెలల్లో మనం చూసింది ఏమంటే, ప్రతి సెక్షన్‌నూ మోసం చేశారు. అన్ని వ్యవస్థలనూ నీరు గార్చారు. నాశనం చేశారు. ఆ పరిస్థితుల మధ్య రాష్ట్రం ప్రయాణం చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్: పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదు. మామూలుగా జనవరి–మార్చి క్వార్టర్‌కు సంబంధించిన బిల్లులు ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. గతంలో అలా ప్రతి 3 నెలలు అయిపోగానే ఫీజు రీయింబర్స్ చేసేవాళ్లం. మే 13న ఎన్నికలు జరిగాయి. వీళ్ల ప్రభుత్వం వచ్చింది. జనవరి–మార్చి ఒక క్వార్టర్, ఏప్రిల్–జూన్ రెండో క్వార్టర్, జూలై–సెప్టెంబర్ మూడో క్వార్టర్ ఎగిరిపోయింది. మూడు క్వార్టర్స్ నుంచి పిల్లలకు ఇవ్వాల్సిన విద్యాదీవెన ఇవ్వలేదు. పిల్లలు రోడ్డెక్కుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే పిల్లల చదువులను మానిపించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. అలాగే ప్రతి ఏప్రిల్‌లో వసతిదీవెన కింద మా ప్రభుత్వంలో ప్రతి పిల్లాడికీ ఒక ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేది. ఇంజనీరింగ్, డిగ్రీ చదివే వారికి ఏటా రూ.20 వేలు ఇచ్చే కార్యక్రమంలో, ఏప్రిల్‌లో ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఇచ్చే వాళ్లం విద్యా సంవత్సరానికి ముందు, చివర్లో. అదీ పోయింది. గాడి తప్పిన విద్యావ్యవస్థ: విద్యా వ్యవస్థ మొత్తం రోడ్డుమీదకు ఎక్కింది. గవర్నమెంటు బడులు నాశనం అయ్యాయి. ఇంగ్లీషు మీడియం గాడి తప్పింది. టోఫెల్ క్లాసులు మూసేశారు. సీబీఎస్‌ఈ మూసేసే కార్యక్రమం. ఐబీ దాకా ప్రయాణం అనుకున్నది సీబీఎస్‌ఈని కూడా మూసేశారు. సబ్జెక్ట్ టీచర్లను గాలికొదిలేశారు. నాడు–నేడు పనులు ఆగిపోయాయి. గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా రోజుకో మెనూతో ఇవ్వాల్సిన ఫుడ్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. అమ్మ ఒడి అయితే చెప్పాల్సిన పని లేదు. గాలికి ఎగిరిపోయింది. విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వైద్య రంగం దారుణం: ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాల్సిన బకాయిలు రూ.2,400 కోట్లు దాటాయి. 104, 108కు ఇవ్వాల్సిన బకాయిలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 5 నెలల నుంచి రూపాయి కూడా ఇవ్వలేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గాలికి ఎగిరిపోయింది. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌ఓ జీఎంపీ మందులు మాత్రమే ఉండే పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఉంటే, ఈరోజు గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు ఉన్నాయా? లేదా? అని పట్టించుకునే నాథుడే లేడు. జీరో వేకెన్సీతో డాక్టర్ల కొరత ఉండకూడదని మా ప్రభుత్వం తాపత్రయ పడితే ఈరోజు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నుంచి డిస్ట్రిక్ట్ ఆస్పత్రుల దాకా స్పెషలిస్ట్ డాక్టర్ల రిక్రూట్‌మెంట్ ఆపేశారు. వ్యవసాయ రంగం. తిరోగమనం: వ్యవసాయానికి సంబంధించి ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ పెట్టి ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్‌ను పెట్టి ప్రతి ఎకరానూ ఈ–క్రాప్ చేసి ప్రతి రైతుకూ ఉచిత పంటల బీమా ఇచ్చే కార్యక్రమం వైయస్ఆర్‌సీపీ హయాంలో జరిగితే, ఈ–క్రాప్ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. డోర్ డెలివరీ క్లోజ్. పెన్షన్స్ కట్: మళ్లీ ఈరోజు మధ్యవర్తులు, దళారీల ద్వారా కొనుగోలు జరుగుతోంది. ప్రతి రంగంలోనూ కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, డెలివరీ మెకానిజం. గతంలో ప్రతి పథకం డోర్ డెలివరీ జరిగే పరిస్థితి నుంచి ఈరోజు డోర్ డెలివరీ ఊసే పోయింది. మళ్లీ జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తలు చెబితేనే ఏ పథకమైనా అందే పరిస్థితి. దాదాపు లక్షన్నర పెన్షన్లు అప్పుడే కటింగ్. మళ్లా కొత్త పెన్షన్లుఇచ్చే కార్యక్రమం జరగడం లేదు. ఇలా అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. లా అండ్ ఆర్డర్ లేదు: లా అండ్ ఆర్డర్ గురించి చెప్పాల్సి వస్తే ఎప్పుడూ చూడని విషయాలు చూస్తున్నాం. 5 నెలల కాలంలో దాదాపుగా 91 మంది మహిళల మీద, పిల్లల మీద అత్యాచారాలు. అందులో 7గురు చనిపోయారు. ఎలాంటి దారుణమైన ఘటనలు జరుగుతున్నాయంటే సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దగ్గరుండి ఈ పనులు చేస్తున్నా కూడా ప్రభుత్వం స్పందించి వాటిని అరికట్టాల్సింది పోయి ఏకంగా సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు. ఇవీ ఉదాహరణలు: – తెనాలిలో సహానా అనే అమ్మాయిపై దాడి చేసి చంపేశారు. నేరస్తుడు టీడీపీ నాయకుడే రౌడీ షీటర్. కేంద్ర మంత్రి పెమ్మసాని అనుచరుడు, చంద్రబాబు కండువా కప్పుతూ దిగిన ఫొటోలు. – బద్వేలు పట్టణంలో జరిగిన ఘటన అత్యంత దారుణం. 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. కేకలు వేస్తూ అమ్మాయి పరుగులు తీసింది. పట్టించుకునే నాథుడు లేడు. – శ్రీకాకుళంలో ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టారు. చేసిన వాళ్లు ఎవరంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు. – బర్త్ డే వేడుకలంటూ పిలిచి ఆ అమ్మాయిలకు కూల్‌డ్రింక్స్‌లో మత్తు పదార్థాలు కలిపి వారి జీవితాలతో చెలగాటం ఆడారు. – హిందూపురంలో దసరా పండుగ రోజున అత్తా కోడళ్లపై గ్యాంగ్ రేప్. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు మూడు రోజులు కాలయాపన చేశారు. హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు బావమరిదే. ఇలాంటి ఘటన జరిగితే కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పరామర్శించలేదు. – అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం కొప్పుగుండుపాలెంలో 9వ తరగతి బాలికను ప్రేమోన్మాది నరికి చంపేశాడు. తనను వేధిస్తున్నాడని అమ్మాయి గతంలో కేసు పెడితే అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి మళ్లీ బయటకు వచ్చి బెదిరించాడు. దీనిపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెడ్ బుక్ పాలనలో నిమగ్నమైన పోలీసులు కనీసం పట్టించుకోలేదు.హోం మంత్రి పక్క నియోజకవర్గం అయినా పరామర్శకు వెళ్లలేదు. – డిప్యూటీ సీఎం పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భర్త, ఒక దళిత మహిళను తీసుకుని పోయి డంప్ యార్డులో రేప్ చేసే కార్యక్రమం చేస్తే అక్కడ చెత్త కాగితాలు ఏరుకునే వారు దళిత అమ్మాయిని కాపాడారు. – చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రావారిపాలెం, యలమందలో జరిగిన ఘటన చూస్తే ప్రభుత్వం ఎలా పని చేస్తోందో తెలుస్తుంది. 10వ తరగతి పాపను ముసుగు వేసుకుని వచ్చి బైక్‌పై ఎత్తుకుపోయి, మత్తుమాత్రలు కలిపిన డ్రింక్ తాగించి, కొట్టి ఆ పాప మీద అత్యాచారం చేసే పరిస్థితిలోకి పోతే వాళ్ల నాన్న ఇంత దారుణమైన ఘటన జరిగిందని మీడియాకు వచ్చి చెబితే తప్ప పోలీసులు స్పందించలేదు. – వాళ్ల నాన్న చెప్పిన తర్వాత ఇష్యూ పెద్దది అవుతోందని తెలిసిన తర్వాత, వైయస్ఆర్‌సీపీ నుంచి నాయకులు వెళ్లిన తర్వాత పోలీసులు ఏం చేయాలి. పాపకు, వాళ్ల నాన్నకు క్షమాపణ చెప్పి చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి దీన్ని కవరప్ చేస్తారు. – తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ఆస్పత్రికి వచ్చి వాళ్ల నాన్నను భయపడిస్తారు. బలవంతంగా తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తారు. – ఇదే కాకినాడ రూరల్ లో, డిప్యూటీ సీఎంకు సంబంధించిన ఎమ్మెల్యే, అనుచరుల మీద ఫీల్డ్ అసిస్టెంట్ పక్కలోకి వస్తావా అంటూ నన్ను అడిగారని స్టేట్ మెంట్ వైరల్ అయ్యింది. ప్రశ్నిస్తే.. ఇల్లీగల్ డిటెన్షన్లు: ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రశ్నిస్తూ సమాజంలో ఉన్న మనలాంటి వారి దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిపక్ష పార్టీల దగ్గర నుంచి మొదలు పెడితే, సమాజస్పృహ ఉన్న వారు, సోషల్ మీడియాలో ఉన్న వారు ఇటువంటి వ్యక్తుల్ని, చంద్రబాబును నిలదీస్తూ ప్రశ్నిస్తే ఏం జరుగుతోంది? ప్రశ్నించే స్వరం వినపడితే చాలు.. ఏకంగా ఈరోజు ఇల్లీగల్ డిటెన్షన్స్. సోషల్ మీడియాలో ఎవరైనా గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తే కేసులు. విజయవాడ వరదల్లో ముఖ్యమంత్రి సహా యంత్రాంగం ఫెయిల్ అయిందని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్లు. వరద సహాయం పేరుతో కోట్లు మింగేసే చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కోటి చిల్లర మందికి ఫుడ్ మీద రూ.534 కోట్లు.. క్యాండిల్స్, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లు.. ఎక్కడ ఎవరికి పోయాయో అందరికీ తెలుసు. ఎవరికి కరెంటు పోయిందో తెలుసు. రూ.23 కోట్లు.. ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్లు. మహిళలు, చిన్నారులు, లైంగిక వేధింపులు, దాడులు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతుంటే ప్రశ్నిస్తే చాలు.. ఇల్లీగల్ డిటెన్షన్లు. ఎమ్మెల్యేలు, వారి మనుషులు రెచ్చిపోయి రౌడీల మాదిరి ప్రవర్తిస్తుంటే దాన్ని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్. ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పారు. రేట్లు రెట్టింపయ్యాయి. ఎవరి జేబుల్లోకి పోతోంది అని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్. రేట్లు తగ్గిస్తామని మద్యం మీద, ఒక్క పైసా కూడా తగ్గించకుండా పైపెచ్చు సిండికేట్లుగా ఫాం చేసి ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతుంటే, ప్రశ్నిస్తే కేసులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులు, మీ సిండికేట్ వ్యాపారం, కరప్షన్ కోసం సిండికేట్ కు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తే కేసులు. అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామన్నారు, 5 నెలలు కాక మునుపే ఏకంగా రూ.6 వేల కోట్ల బాదుడు అప్పుడే మొదలు పెట్టారు. మళ్లీ రేపు నెల 11 వేల కోట్లతో అడిషనల్ బాదుడు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్. సంపద సృష్టి అంటే అమ్మేయడమేనా?: మీరొస్తే సంపద సృష్టిస్తామన్నారు కదా?. మరి ప్రజల కోసం జగన్ సృష్టించిన సంపదను ఎందుకు అమ్మేస్తున్నారు? మీ స్కాముల కోసం ప్రభుత్వ ఆస్తులను, మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు. మూడు ప్రైవేట్ పోర్టులను.. ఒకటి దాదాపు 80 శాతం పోర్టు అయిపోయింది. ఫైనాన్స్ కొరత కూడా లేదు. మరి ప్రభుత్వ సంపద ఇవన్నీ వస్తూనే పెరుగుతుంది కదా. ఎందుకు అమ్మేస్తున్నారని ప్రశ్నిస్తే ఇల్లీగల్ డిటెన్షన్. అవి కూడా తప్పేనా? ఏమిటా కేస్‌లు?: వీళ్లు రాసిన ఎఫ్‌ఐఆర్ కాపీలు.. క్రై మ్ ఏంటి అంటే.. విద్య వద్దు, మద్యం ముద్దు ఆ పిల్లాడు రాసిన మాట. సోషల్ మీడియా యాక్టివిస్టు అన్న మాటలు. నిజమే కదా. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన ఇవ్వడం లేదు. నాన్నకు ఫుల్లు, అమ్మకు నిల్లు.. అని అన్నాడు. ఏం తప్పు అన్నాడు? ఇల్లీగల్ డిటెన్షన్. శ్రీచంద్రబాబునాయుడుగారి అభిమానులకు మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందట. ఇది ఇంకొకటి. ఫార్వర్డ్ చేశాడు పోస్టును. ఫార్వార్డ్ చేస్తే కూడా కేసులే. జనసేన నేతతో బలవంతంగా కాళ్లు పట్టించుకున్న టీడీపీ నాయకుడు. అన్ని టీవీల్లో వచ్చింది. ఫార్వర్డ్ చేస్తే కేసు. ఇది ఇంకొకటి.. ఈ కేసు ఏందంటే.. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం లూటెడ్ 534 కోట్లు పబ్లిక్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ విజయవాడ ఫ్లడ్స్. షాకింగ్ దె లూటెడ్ 23 కోర్స్ జస్ట్ ఫర్ మ్యాచ్ బాక్సెస్. ఇది అందరూ అంటున్న మాటలే. ఇది రాసినందుకు కేసు. ఇది ఇంకొక ఎఫ్‌ఐఆర్.. ఇంకో పిల్లోని మీద. వీళ్లంతా సోషల్ మీడియా యాక్టివిస్ట్ అంటే పాపం అందరూ యంగ్ స్టర్స్. జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నిస్తున్న స్వరాలు. ఇదొక షార్ట్ వీడియో పోస్ట్ చేశాడు.. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ఇస్తున్నాడంట. కాస్త సింక్ అయ్యిందట. ‘ఇటీజ్ క్లియర్ దట్ గాడ్ డజ్ ఇంట్ లైక్’ అని. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు ఆరోపణలు దేవుడికి నచ్చలేదని అన్నాడు. అంతకన్నా ఇంకేమీ అనలేదు పాపం. దీనిపై కేసు. మామూలుగా ఇలాంటి కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు.వారం రోజులుగా విచ్చలవిడిగా జరుగుతున్నాయి. 101 మందికిపైగా ఇదే మాదిరి జరుగుతోంది. సుప్రీంకోర్డు ఆదేశాలు బేఖాతరు: నిజానికి ఏడేళ్ల లోబడి శిక్ష ఉండే కేసులకు సంబంధించి క్లియర్ కట్ డైరెక్షన్స్ ఉన్నాయి. నీ బుద్ధి పుట్టినట్లు అరెస్టులు ఇంటికొచ్చి చేయకూడదు. ఏడేళ్ల లోబడి ఉన్న కేసులకు ఒక ప్రొసీజర్ ఉంది. ముందుగా 41–ఏ కింద నోటీసు ఇచ్చి విచారణ చేయాలి. ఆ తర్వాత అరెస్టు చేయాల్సిన అవసరమే ఉంటే వారంట్ ఇష్యూ చేయాలి. తర్వాత మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది సుప్రీంకోర్టు ఆర్డర్. అమేష్‌కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ అండ్ ఏఎన్నార్ ఆన్ సెకండ్ జూలై 2014 ఇచ్చిన జడ్జిమెంట్. ఏడేళ్ల లోబడి ఉన్న అన్ని కేసులకు సంబంధించిన వివరణ ఇచ్చే జడ్జిమెంట్. (అంటూ జడ్జిమెంట్ కాపీ ఇంగ్లిష్‌లో చదివి వినిపించారు) పోలీస్ రాజ్యం: అంటే అన్ని కేసులూ ఏడేళ్ల లోపు ఉన్న ప్రతి కేసుకూ ఇదీ జడ్జిమెంట్. ఇదీ ప్రొసీజర్. కానీ ఈరోజు ఏం జరుగుతోంది? ఇల్లీగల్ డిటెన్షన్ చేస్తున్నారు. అంటే అరెస్టు చేసే అధికారం నీకు లేదని తెలుసు. 41–ఏ నోటీసు మాత్రమే ఇవ్వాలన్న సంగతి నీకు తెలుసు. ఒకవేళ అరెస్టు చేయాలంటే వారంట్ ఇష్యూ చేయాలి. మెజిస్ట్రేట్ దగ్గర నీ ఆర్గుమెంట్ చెప్పాలి. మెజిస్ట్రేట్ కన్విన్స్ అయిన తర్వాత గానీ అరెస్టు చేయకూడదు. ఇదీ ప్రొసీజర్. కానీ ఈరోజు స్వతంత్రంగా ఎవరైనా గొంతు విప్పితే చాలు. రాత్రికి రాత్రి గానీ, తెల్లవారుజామున గానీ అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. గంటల తరబడి కొన్ని సమయాల్లో రెండు మూడు రోజులు కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు. ఆ సమయంలో వారిని కొట్టడం, తిట్టడం అవమానించడం చేస్తున్నారు. ఒక కేసును ఒక వ్యక్తి మీద ఏక కాలంలో పలు స్టేషన్లలో టీడీపీ సానుభూతిపరులతో కేసులు నమోదు చేయిస్తున్నారు. అరెస్టు చేస్తున్నారు. రెండు మూడు స్టేషన్లు తిప్పుతున్నారు. పోలీసుల తీరుపట్ల అక్కడ స్థానిక ప్రజలు తిరగబడితే మళ్లీ మరో కేసు పెట్టి మళ్లీ అరెస్టు చేస్తున్నారు. ఒకవేళ వీళ్లు ఎవరైనా అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్లకు తీసుకొస్తున్నారు. ఈ అధికారం ఏ పోలీసుకూ లేదు. నేరుగా ముఖ్యమంత్రి, ఆయన కొడుకు, ఈ మధ్య కాలంలో డిప్యూటీ సీఎం.. డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాంతో ఆయన దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయిస్తున్నాడు. మరి వాళ్ల మీద చర్యలుండవా?: మరి నేను అడుగుతున్నా. తప్పుడు రాతలు రాస్తే మీకు అంత కోపం వస్తే మరి అదే తప్పుడు రాతలు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద రాస్తున్నారు. రెండేళ్ల కిందట మా అమ్మ కారుటైర్లు బరస్ట్ అయితే, అది ఈరోజు కొత్తగా జరిగినట్లు టీడీపీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెట్టి.. తల్లిని చంపడానికి జగన్ ప్రయత్నం చేశాడని సిగ్గు లేకుండా రాశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? విజయమ్మే వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చింది కదా?. దాంతో విజయమ్మ లెటరే ఫేక్ అని టీడీపీ వెబ్‌సైట్‌లో మరో పోస్టింగ్. చివరికి వీరి ఫేక్ స్టేట్‌మెంట్లు ఎక్కువై విజయమ్మ టీవీలోకి వచ్చి కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ౖ నేను అడుగుతున్నా.. టీడీపీ ఇంత దారుణంగా ఫేక్ న్యూస్‌లు పోస్టు చేస్తుంటే.. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఇదే డీజీపీని అడుగుతున్నా.. లోకేష్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఎంత దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటే.. ఒక కేసు కాదు. రెండు కేసులు కాదు. ప్రతి విషయంలోనూ, వీరి అఫీషియల్ మీడియా, ఎల్లో మీడియా అలాంటిదే. వీరి సోషల్ మీడియా అలాంటిదే ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశాడు. కడప ఎస్పీకి నా భార్య ఫోన్ చేసిందని.. అది ఫేక్ న్యూసే కదా? మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను తీసుకువచ్చి బొక్కలో వేస్తున్నారా? పోలీసులూ వృత్తిని కించపర్చొద్దు: అయ్యా డీజీపీ గారు.. అయ్యా పోలీసులు.. మూడు సింహాలు మీ టోపీల మీద ఉన్నాయి.. వాటికి సెల్యూట్ కొట్టండి. ఈ రకంగా అమ్ముడుపోయి, ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో ఉంటూ.. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం పోలీసులుగా.. మీ వృత్తిని.. రెండిటినీ కించపరిచినట్లవుతుంది. ఇదే పోలీసులకు చెబుతున్నా. మీరు చేస్తున్న అగత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. కొన్ని కొన్ని ఉదాహరణలు చెబుతున్నా. మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోమని అడుగుతున్నా ప్రతి పోలీసాఫీసర్‌ను. ఎల కాలం వీరి ప్రభుత్వం ఉండదు. మీరు ఇల్లీగల్ అరెస్టులు చేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలపై పోలీసులు చేసిన ఆకృత్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో కొన్ని ఉదాహరణలు చెబుతున్నా. పోలీసుల ఆకృత్యాలు. ఉదాహరణలు: – గాజువాకకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోడి వెంకటేష్‌ను దువ్వాడ పోలీసులు నిన్న (6వ తేదీ) మధ్యాహ్నం 3.30 గంటలకు పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పలేదు. 41–ఏ నోటీసులు సైతం ఇవ్వలేదు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉల్లంఘన కాదా?. – తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్, ఒక రైతు ఆళ్ల జగదీష్‌రెడ్డిని.. 2018 లో పెట్టిన పోస్టింగ్‌కు సంబంధించి విజయవాడ క్రైo పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా తీసుకువెళ్లారు. స్టేషన్‌కు వెళ్లి అడిగితే, తాము తీసుకురాలేదని చెప్పారు. తీరా జగదీష్‌రెడ్డి ఇంట్లో సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే, పోలీసులే తీసుకువెళ్లినట్లు తేలింది. – చిలకలూరిపేటకు చెందిన పెద్దింటి సుధారాణి, ఎన్నికల తర్వాత అక్కడ అరాచకాలు భరించలేక కుటుంబంతో సహా హైదరాబాద్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని హైదరాబాద్ నుంచి పోలీసులు ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చారు. అన్ని పోలీసుస్టేషన్లు తిప్పుతున్నారు. పిల్లలకు తల్లిని దూరం చేశారు. నిన్న చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌లో ఉన్న ఆమెను ఒంగోలు పోలీసులు అరెస్టు చేశారు. – తాడేపల్లిలో అయ్యప్పమాలలో ఉన్న నాని అనే యాక్టివిస్ట్‌ను, మొదట వినుకొండ అని చెప్పి తర్వాత మార్కాపురం తీసుకువెళ్లారు. – నందిగామ నియోజకవర్గం పెండ్యాలలో వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌ను అరెస్టు చేసి కొట్టారు. ఆ గ్రూప్‌లో ఉన్న 100 మందికి నోటీసులు ఇచ్చారు. – గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వెంకట్రామిరెడ్డి హైదరాబాద్ లో ఉంటారు. తన బావగారి ఇంటికి మాచర్ల వచ్చాడు. వెంకట్రామిరెడ్డి అందుబాటులో లేకపోవడంతో అతని బావను అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో పోలీసులకు ఆటంకం కలిగించారని తప్పుడు కేసు పెట్టారు. – సన్నీ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్‌ను తిరువూరు పోలీసులు ఉదయం తీసుకువెళ్లి కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. 36 గంటల పాటు భోజనం కూడా పెట్టలేదు. గ్రామంలోని పెద్దలు వెళితే విడుదల చేశామని చెప్పి.. మళ్లీ గంపలగూడెం పోలీసుస్టేషన్‌లో పెట్టారు. – మహానంది మండలంలో యు.గొల్లవరంకు చెందిన తిరుమల కృష్ణను కర్నూలు పోలీసులు ఆదివారం అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. దివ్యాంగుడని తెలిసి కూడా నానా ఇబ్బందులు పెట్టారు. – రాయచోటిలో కె.హనుమంతరెడ్డిని రెండు రోజుల క్రితం పోలీసులు తీసుకువెళ్లారు. ఇంతవరకు అరెస్టు చూపలేదు. ఎక్కడున్నాడో కూడా తెలియదు. – చివరకు తెలంగాణ లో ఉన్నవారిని కూడా తీసుకువచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు. నల్లగొండకు చెందిన అశోక్‌రెడ్డిని విజయవాడ సైబర్ క్రై ం పోలీసులు తీసుకువచ్చారు. కుటుంబసభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. – రాజశేఖర్‌రెడ్డి అనే వ్యకి ని కూడా హైదరాబాద్ నుంచి తీసుకువచ్చారు. ఇప్పుడు ఇద్దరినీ వేధిస్తున్నారు. అలా మొత్తం 101 మందిపై కేసులు పెట్టారు. చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్‌లు ఆన్‌లైన్‌లో పెట్టడం లేదు. కోర్టులకు అప్ లోడ్ చేయడం లేదు. దేశంలో ఇంత అరాచక వ్యవస్థ ఎక్కైడైనా ఉంటుందా? ఉందా? పార్టీ కార్యకర్తలా డీజీపీ మాటలు: ఇంత దారణమైన పరిస్థితులు ఉంటే, డీజీపీ చట్టం వైపు, న్యాయం వైపు నిలబడాలి. ఇదే పోలీసు అధికారులకు నిజంగా చెబుతున్నా. ఇప్పుడున్న డీజీపీ మా హయాంలో ఆర్టీసీ సీఎండీ స్థానంలో పని చేశాడు. మంచి పదవి ఇచ్చి బాగా చూసుకున్నాం. కానీ ఈరోజు ఏ స్థాయికి దిగిజారిపోయాడంటే.. పదవి కోసం, పదవీ వ్యామోహంతో.. ఐదు నెలలుగా పాలన గాడి తప్పి.. రెడ్ బుక్ పాలనలో వీరంతా నిమగ్నమై.. లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంటే.. ఇదే డీజీపీ అధికార పార్టీ కార్యకర్తలా మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వంలో పోలీసులు సరిగా పనిచేయలేదని చెబుతున్నాడు. మరి ఆయన కూడా ఆ ప్రభుత్వంలో పనిచేశాడు కదా? ఈ ప్రభుత్వం సవ్యంగా ఉందా?: మరి ఇప్పటి ప్రభుత్వం సవ్యంగా, బ్రహ్మాండంగా పని చేస్తోందా?. ఆయన డీజీపీగా ఉన్న ప్రభుత్వం సవ్యంగా పని చేస్తే.. ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులు ఇంతగా జరుగుతున్నాయి? ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారు? ఐదు నెలలు తిరగక ముందే 91 మంది అక్క చెల్లెమ్మల మీద ఎందుకు అత్యాచారాలు జరిగాయి? ఎందుకు ఏడుగురు ఆడవాళ్లు చనిపోయారు? చివరకు ప్రజల తరపున గొంతు విప్పుతున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను ఎందుకు అక్రమ నిర్భంధాలు చేస్తున్నారు?. సప్త సముద్రాల అవతల ఉన్నా.. ఎవ్వరినీ వదిలి పెట్టబోం: మీ ఇష్టానుసారంగా, ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే.. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. మళ్లీ మళ్లీ చెబుతున్నా. ప్రతి పోలీసు అధికారికి చెబుతున్నా. న్యాయాన్ని గౌరవించండి. ధర్మాన్ని కాపాడండి. అంతే గానీ వన్ సైడెడ్‌గా, ఇల్లీగల్‌గా, తప్పు చేస్తున్నామని తెలిసి కూడా తప్పు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. ప్రతి పోలీసు ఆఫీసర్‌పై ప్రైవేటు కంప్టైంట్స్ చేయిస్తాం. ప్రతి బాధితుడు ప్రైవేటు కంప్లైంట్ చేస్తాడు. వారికి వైయస్సార్‌సీపీ న్యాయ సహాయం కూడా చేస్తుంది. ఎల్లకాలం వీరి ప్రభుత్వం ఉండదు. జమిలీ అంటున్నారు. అధికారం కూడా తొందరగా పోవచ్చు. కాకపోయినా నాలుగేళ్లే ఉంది. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్‌ను దగ్గరుండి బయటకు తీస్తాం. రిటైర్ అయ్యి వెళ్లిపోతామనుకుంటున్నారేమో? వెళ్లిపోయినా పిలిపిస్తాం. తెలంగాణ నుంచి చంద్రబాబు డిప్యూటేషన్ మీద సుబ్బారాయుడును తిరుపతికి తెచ్చుకున్నాడు. ఆయన మళ్లీ తెలంగాణ వెళ్లిపోతా అనుకుంటున్నాడేమో. మళ్లీ తెలంగాణ నుంచి పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీసు ఆఫీసర్‌కు చెబుతున్నా. తప్పులు చేసిన వారిని చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినవన్నీ బయటకు తీస్తాం. కోర్టు ఆర్డర్లను అధిగమించి చేసినవన్నీ చూస్తూ ఊర్కోము. రెడ్ బుక్ పెట్టుకోవడం గొప్ప కాదు. ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలన్నీ రెడ్ బుక్ పెట్టుకుంటాయి. వాళ్లు నాదగ్గరకొచ్చి గ్రీవెన్స్ చెబుతారు. అప్పుడు నేసు చూస్తూ ఊర్కోను. ఆ ఉసురు తగులుతుంది: పోలీసులంటే గౌరవం ఉండాలి. వ్యవస్థ అంటే బతకాలి. ఈరోజు వారుండొచ్చు. రేపు మనం ఉండొచ్చు. కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. వ్యవస్థ నీరు కారిపోకూడదు. ఈరోజు రాజకీయ నాయకులు చెబుతున్నారని, తెలిసి కూడా తప్పు చేస్తే. ప్రతి బాధితుడి ఉసురు మీకు తగులుతుంది. తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తున్న ప్రతి పోలీస్ సోదరుడికి చెబుతున్నా. ఇంకా తప్పులు చేయొద్దు. న్యాయం, ధర్మం అనే పిల్లర్స్ మధ్య పోలీసులు వ్యవహరించాలి. అదృష్టవశాత్తూ కొందరు పోలీసులు బాగా పని చేస్తుంటే.. చంద్రబాబు చెబుతున్న అన్యాయాలకు, అక్రమాలకు తలొగ్గకపోతే వాళ్లు బాగా చేయడం లేదని బ్రాండింగ్ చేస్తారు. అదే ఇల్లీగల్ డిటెన్సన్లు పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం పోలీసులు బాగా పని చేస్తున్నారని కితాబిచ్చుకుంటారు. డిప్యూటీ సీఎంకు ఆ ధైర్యం ఉందా?: సాక్షాత్తూ డిప్యూటీ సీఎం అనే వ్యక్తి లా అండ్ ఆర్డర్ ఈ స్థాయిలో దిగజారిపోయిందని నోరు మెదిపాడు అంటే.. ఆశ్చర్యం కలిగించే ఘటన. కానీ ఆయన దళిత హోం మంత్రినే అన్నారు. అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఎవరి సబ్జెక్ట్? ముఖ్యమంత్రి సబ్జెక్ట్ కాదా? ప్రశ్నించాల్సింది ఎవరిని? కానీ చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. పాపం ఈమె దళితురాలు, అమ్మాయి. ఏమన్నా పడుతుందని అనడం. ఇదెక్కడి న్యాయం?. పిఠాపురం తన సొంత నియోజకవర్గంలో కౌన్సిలర్ భర్త అయిన టీడీపీ నాయకుడు ఒక దళిత మహిళను ఆటోలో తీసుకెళ్లి డంప్‌యార్డులో అత్యాచారం చేస్తే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి ఏం చేశావు?. చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం లేదు. వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం అంతకన్నా లేదు. తోలు తీస్తా అని సినిమా డైలాగులు మాత్రం కొడతాడు. సరస్వతి పవర్ భూములపై దుష్ప్రచారం: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, ఈనెల 5న çసరస్వతి పవర్ భూములపైకి వెళ్లారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్.. కంపెనీ పేరు అది. సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం ఆ భూములు అక్కడ అక్వైర్ చేయడం జరిగింది. కాగా, డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు, గత నెల 26న లోకల్ ఎమ్మార్వో, అక్కడ అన్నీ పరిశీలించి అదే సరస్వతి వెబ్ సైటుకు వెళ్లి భూములన్నీ పరిశీలించి ఆవిడ ఏమన్నారో.. వినండి అంటూ ఆ వీడియో ప్రదర్శించారు. ఆ ఎమ్మార్వో వెయ్యి చిల్లర ఎకరాలకు సంబంధించిన కథ చెప్పింది. అది మొత్తం పట్టా భూమి అని ఆవిడే చెప్పింది. ఎక్కడా వంకలు, వాగులు లేవని చెప్పింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని ఆవిడే చెప్పింది. అంటే వెయ్యి చిల్లర ఎకరాల్లో కేవలం 4 ఎకరాలు అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడే చెబుతోంది. పైగా అందులో రెండెకరాలు చిల్లర హిల్లాక్స్ అంటే కొండలు. ఒక ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్ (చుక్కల భూములు). దీనికి పవన్‌కల్యాణ్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లి, ఏదేదో మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కువ ధరతో కొన్నాం: పక్కనే భవ్య సిమెంట్స్ వాళ్లు ఎకరా రూ.50వేల నుంచి రూ.90 వేల వరకు కొన్నారు. ఏడాది తర్వాత మేము ఆ పక్కనే ఎకరా రూ.3 లక్షల చొప్పున కొన్నాం. గ్రామ సభ పెట్టి, రైతులు సంతోషంగా ఉండటం కోసం ఎంత రేటు కావాలో వాళ్లనే అడగండి అన్నాం. వాళ్లు ఎకరాకు రూ.2.70 లక్షలు ఇస్తే బాగుంటుందంటే, నేను రూ.3 లక్షల చొప్పున ఇచ్చి ఇంకా సంతోష పెట్టండి అని చెప్పాను. నేను ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు నిజంగా నేను చెడ్డోడిని అయితే, గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. వాటి కోసం నేను ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన పని లేదు. ఆ పక్కన తాడిపత్రిలో దివాకర్‌రెడ్డి మీద ఎన్నెన్నో ఆరోపణలు వచ్చాయి. గవర్నమెంట్ ల్యాండు వాళ్ల డ్రైవర్ పేరుతో, పీఏ పేరుతో అలాట్ చేయించుకున్నారని. నేను సీఎం కొడుకుగా ఉండి, ల్యాండ్ ఫ్రీగా తీసుకోవచ్చు. కానీ ఆ పని చేయలేదు. ఒక్క ఎకరా కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేదు. అంతా ప్రైవేట్ ల్యాండ్. రైతుల్ని సంతోష పెడుతూ ఏం రేటు కావాలో వాళ్లనే అడిగి, అంత కంటే ఎక్కువే ఇచ్చాం. అదీ జగన్ అంటే.. అది ప్రభుత్వ డ్యూటీ: ఇదే పవన్ కల్యాణ్ అనే వ్యక్తి నీళ్లు అంటాడు. ఔనయ్యా.. సిమెంటు ఫ్యాక్టరీ పెడితే నీళ్లు ఇవ్వరా? అది ప్రభుత్వ డ్యూటీ కాదా? అక్కడ కాలనీ కడతారు. పని చేసే వాళ్లు అక్కడే కాపురం పెడతారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరా? సిమెంట్ ఫ్యాక్టరీ నీళ్లు తాగదు. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీలు నీళ్లు తాగుతాయి. కాలనీలో ఉన్న వాళ్లకు, ఇతర అవసరాలకు మాత్రమే నీళ్లు వాడతారు. కరెంటు, నీళ్లు ఇవ్వడం ప్రభుత్వ డ్యూటీ. నీళ్లు ఇచ్చిన దానికి కూడా పెద్ద తప్పు చేసినట్లుగా చెబుతాడు. నిబంధనల మేరకే మైన్స్ లీజ్: ఇంకోటి అంటాడు.. మైనింగ్ లీజు 50 ఏళ్లకు తీసుకున్నాను అంటాడు. నువ్వు ఎట్లా మంత్రివి అయ్యావో నాకు తెలియదు. నీకు తెలివి ఉందా? లేదా? అంతకన్నా తెలియదు. నువ్వు పొల్యూషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ శాఖకు మంత్రివి. ఎంఎండీఆర్ యాక్ట్–2015 ఏం చెబుతుందో తెలుసుకో. ఆ యాక్ట్ ఏం చెబుతుంది? డీమ్డ్ 50 ఇయర్స్ అది అందరికీ. ఎవడికైనా.. (అంటూ చట్టం వివరాలు చదివి వినిపించారు.) నీకు జ్ఞానం ఉందో? లేదో? ఏమి బుద్ధి ఉందో? బుర్ర పని చేస్తోందా? పని చేయడం లేదా? నాకైతే అర్థం కావడం లేదు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆ మైనింగ్ లీజును క్యాన్సిల్ చేస్తే కోర్టుకు పోయాను. 2015లో ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చింది. ఆ తర్వాత 2019లో కోర్టు నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చంద్రబాబు చేసింది తప్పనీ, అన్నీ రిస్టోర్ చేయాలని ఆదేశించింది. పరిశ్రమలను అడ్డుకుంటున్నారు: అసలు పరిశ్రమలు రావాలని ఎవడైనా తాపత్రయపడాలి. కానీ వీళ్లేం చేస్తున్నారు. పరిశ్రమలు రాకూడదని వీళ్లు అడుగులు వేస్తున్నారు. అక్కడేమో కడపలో సజ్జన్ జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకొచ్చి ఫౌండేషన్ వేసి ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేశాడు. ఆయన్ను ప్రోత్సహించకుండా, వీళ్లేం చేశారు? జత్వానీ అనే ఆమెను తీసుకొచ్చి దొంగ కేసులు పెట్టించారు. ఆమె హ్యాబిట్యువల్ అఫెండర్. ఆమెతో జిందాల్‌ను బెదరగొట్టించి రాకుండా చేస్తున్నారు. మరోవైపు ఆర్సిలర్ మిట్టల్ అనకాపల్లికి వచ్చిందని తప్పుడు వార్తలు. అక్కడేమో ఒడిశా మంత్రి చంద్రబాబును, లోకేష్‌ను తిడుతూ అక్కడి నుంచి స్టేట్‌మెంట్. కంపెనీ మా ఒడిశాలోనే ఉంది. పనులు మొదలు పెట్టారు అని. 24 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ ప్లాంటు కడుతున్నారు. రూ.1.04 లక్షల కోట్ల పెట్టుబడులతో కడుతున్నారని ప్రకటించారు. ఎవరైనా ఎన్ని లక్షల కోట్లు పెట్టగలుగుతారు?. ఒడిశాలో గ్రీన్ ఫీల్డ్ ప్లాంటు కడుతున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు. అక్కడ ప్లాంట్ పెడతారా? లేక ఇక్కడికొస్తారా? అది కూడా ఇక్కడికి వచ్చి రూ.1.61 లక్షల కోట్లు పెడతారట! మాటలు చెప్పడానికి, వక్రీకరణకు అర్థం ఉండాలి. మైక్రోసాఫ్ట్ వచ్చింది, బిల్‌గేట్స్‌కు నేనే కంప్యూటర్ నేర్పించా. మైక్రోసాఫ్ట్ వచ్చింది, బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది, ఒలింపిక్స్ నేనే నిర్వహిస్తున్నా. ఇవేం మాటలు. ఒకపక్క జిందాల్ వాళ్లు ఫౌండేషన్ స్టోన్ వేశాడు కడపలో. నువ్వు ప్రోత్సహిస్తే చాలు కంప్లీట్ చేస్తాడు. వాళ్లను బెదరగొడుతున్నావ్. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ ఎందుకు కట్టలేకపోయాను. కారణం మీరే కదా?. మీ వల్లే కదా ఈడీ అటాచ్‌మెంట్లు. నా కేసులు పిటిషనర్లు ఎవరు? తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వాళ్లు కాదా? అది ముందుకు పోకుండా ఉండేందుకు కారణం వీళ్లు కాదా? అదే వారి కుట్ర: పైగా దాని మీద లేనిపోని వక్రీకరణలు, అబద్ధాలు. ఎవడైనా ప్రమోట్ చేయాలి, ఇండస్ట్రీ రావాలి, నాలుగు ఉద్యోగాలు వస్తాయి . ప్రాంతం బాగు పడుతుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వస్తుందని ఆలోచన చేయాల్సింది పోయి.. తన వాడైతే ప్రమోషన్, తనకు అంతో ఇంతో వస్తుందంటే ప్రమోషన్. తన వాడు కాకపోతే ఆపేసేయాలి. రాకుండా చేయాలి. అక్కడి నుంచి ఏదీ రాదు అనుకుంటే అసలు రాకూడదు. అసెంబ్లీలో మాకు ఆ హక్కు ఎందుకివ్వరు?: అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీరే చెప్పండి. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే స్పీకర్‌ను అడిగాం. అసెంబ్లీలో ఉండేవి రెండే రెండు కూటములు. ఒకటి అధికార కూటమి. రెండోది మేము ప్రతిపక్షం. మేము కాకుండా ఎవరైనా ప్రతిపక్షం ఉన్నారా అసెంబ్లీలో. మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించాలా? లేదా? మిగతాదంతా అధికార పార్టీనే. అలా గుర్తించినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలైనా ఉండనీ నాయకుడు ఉంటాడు కదా?. ఆ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు అనే కదా అనాల్సింది. ఆ ప్రతిపక్ష పార్టీకి 40 శాతం ఓటు షేర్ వచ్చింది వాస్తవం కదా. ఆ పార్టీని గుర్తించను అంటే దాని అర్థం ఏమిటి? ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే మైక్ హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్‌కు మైకు మీద ఏ రకమైన కమాండ్ ఉంటుందో, అదే మాదిరిగానే లీడర్ ఆఫ్ ది అపోజిషన్‌కు మైకు ఇవ్వాలి. ఆ మాదిరిగా ఇవ్వగలిగితేనే ప్రజల సమస్యలు సుదీర్ఘంగా చెప్పగలుగుతారు. ప్రభుత్వం నుంచి స్పందన రాబట్టగలుగుతారు. కానీ వీళ్లేం చేస్తున్నారు? మైకు ఇవ్వకూడదు. ప్రజల సమస్యలు ప్రస్తావనకు రాకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీ ఉందని యాక్సెప్ట్ చేయదల్చుకోలేదు. యాక్సెప్ట్ చేస్తే ప్రతిపక్ష నాయకుడికి మైకు ఇవ్వాలి. అప్పుడు మిమ్మల్ని ఎండగడతారని చెప్పి, ప్రతిపక్ష పార్టీని, నాయకుడిని అక్నాలెడ్జ్ చేయడం లేదు. దాని వల్ల మైకు అనేది హక్కుగా ఇవ్వరు. 175 మందిలో నీకు మైకు 2 నిమిషాలు ఇస్తాం. చెప్పాల్సింది చెప్పు అనే మైండ్ సెట్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభం ఏముంది? ఇక్కడే మీడియా సమక్షంలో..: అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజూ ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అంతే సమయంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. ప్రతిరోజూ మీకు ముందే సమయం చెబుతాం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే టీవీ ఛానళ్లను రిక్వెస్ట్ చేస్తాం. మాకు సమయం ఇవ్వండి. అసెంబ్లీ సమావేశాల కింద భావించి ప్రతిపక్షం అడుగుతున్న ప్రశ్నలు ఇవీ అని గట్టిగా మీరు ప్రొజెక్ట్ చేయండి అని కోరుతాం. అప్పుడైనా అటువైపు నుంచి ప్రభుత్వం స్పందిస్తుందేమో, ప్రజలకు సమాధానం చెబుతుందేమో చూద్దాం. దాని వల్ల ప్రజలకు మేలు కలుగుతుందని ఆశిద్దాం. ప్రతి మూడో రోజూ నిలదీస్తాను: ప్రతిరోజూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంగా ప్రశ్నలు వేస్తాం. ప్రతి మూడో రోజు అసెంబ్లీలో నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించే పాత్ర ఉంటే ఎలా ఉంటుందో ప్రతి రోజూ మీడియా ద్వారా ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ.. ఇవీ ప్రజలకు సంబంధించిన సమస్యలు.. నీ చేతనైతే సమాధానం చెప్పు అని చంద్రబాబును మీడియా ద్వారా మీ అందరి సమక్షంలో, మీరే నా స్పీకర్లుగా, ప్రజల తరఫున ప్రశ్నలు అడుగుతాను. నిలదీస్తాను. గ్రాడ్యుయేట్ ఎన్నికల బాయికట్: సభ్యులుగా నిరసన తెలిపేదానికి ఎవరినైనా అనుమతిస్తున్నారా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా? ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏం చేద్దామని మా పార్టీ సీనియర్ నాయకులు కొంత మందితో మీటింగ్ అయితే, మా అందరి అభిప్రాయం అదే. ప్రజాస్వామ్యం బతికుందా? ఎలక్షన్లు జరుపుతారా? 3 లక్షల మంది ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసే పరిస్థితి ఉంటుందా? ఓటు వేయనిస్తారా? ఓటేసే పరిస్థితి ఉంటుందా? మా కార్యకర్తలను చేయనిస్తారా? వాళ్ల మీద దొంగ కేసులు పెట్టి వేధిస్తారు కదా అని బాయికట్ చేద్దామని నిర్ణయించుకున్నాం. కార్యకర్తలు అనే వాళ్లను ఎందుకు ఇబ్బందుల పాల్జేయాలి. ప్రజాస్వామ్యం బతకనప్పుడు కొద్ది రోజులు టైం ఇచ్చే కార్యక్రమాలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత అన్నది ఇబ్బడిముబ్బడిగా పుట్టి ప్రభుత్వాన్ని తెరమరుగు పరిచే పరిస్థితులు వస్తాయి. అక్రమ అరెస్టులపై హెల్ప్‌లైన్: పోలీసుల ద్వారా ప్రభుత్వం ఇబ్బంది పెడితే అందరికీ కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ వేయించడానికి, మీ తరఫున పోరాటం చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది అని ఇదే మీడియా సమక్షంలో మీ అందరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా. ‘ఇవి టెలిఫోన్ నంబర్లు. నోట్ చేసుకోండి. ఎవరికి ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియా పరంగా, ఇల్లీగల్ డిటెన్షన్ పరంగా ఈ నంబర్లు మా అడిషనల్ అడ్వొకేట్ జనరల్స్ సుధాకర్ అన్న అందుబాటులో ఉండి మీ తరఫున కేసులు పోరాటం చేస్తాడు కోర్టుల్లో. పూర్తిగా ప్రైవేట్ కంప్లైంట్స్ వేసే కార్యక్రమంలో మీ తరఫున వ్యాజ్యాలు వేసి తోడుగా ఉంటాడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. ఈ టెలిఫోన్ నంబర్లు అందరూ నోట్ చేసుకోండి’. అని శ్రీ వైయస్ జగన్ కోరారు. ఈ పోలీసుల వల్ల, ప్రభుత్వం వల్ల ఎటువంటి అన్యాయం జరిగినా ఈ నంబర్లకు ఫోన్ చేయాలని, వారికి వైయస్ఆర్‌సీపీ పూర్తిగా తోడుగా ఉంటుందని చెప్పారు. ‘వైయస్ఆర్‌సీపీ వీ స్టాండ్ ఫర్ ట్రూత్. వీ ఆర్ విత్ వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా. ఈ–హ్యాష్‌ట్యాగ్‌లో ఈ నంబర్లు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ అందుబాటులో ఉంటాయి’ అని వైయస్ జగన్ వివరించారు.