ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

తాడేప‌ల్లి: అంతరిక్షంలో స్పేడెక్స్ అనుసంధానం విజయవంతం కావ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.  అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ చారిత్రాత్మక ప్రయోగాన్ని చేపట్టిన నాలుగవ దేశంగా భారత్ నిల‌వ‌డం గ‌ర్వ‌కార‌ణ‌మంటూ వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. అంతరిక్ష నౌక డాకింగ్ పూర్తి కావ‌డం చారిత్రాత్మక క్షణమని,  ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రలకు కీలకమైన ముందడుగు ప‌డిందంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్‌లో సందేశం పంపించారు.  

Back to Top