తాడేపల్లి: ప్రేమ, దయ, సేవ అనే మార్గాలను మదర్ థెరిసా పాటిస్తూ.. జీవితమంతా పేదలకు, అనాథలకు, అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అండగా నిలిచారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆమె చూపిన సేవా మార్గాన్ని మనం అనుసరిద్దామని ఆయన పిలుపునిచ్చారు. భారతరత్న, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మదర్ థెరిసా జయంతి ఈసందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రేమతో చేసిన చిన్న పనులు(సేవలు) కూడా ప్రపంచాన్ని మార్చగలవు. ఈ విషయాన్ని మదర్ థెరిసా జీవితం మనకు గుర్తు చేస్తుంది. ఆమె జన్మదినాన్ని స్మరించుకుంటూ, ఆమె సేవా మార్గాన్ని మనం గౌరవించాలి అని ఎక్స్‌లో వైయస్ జగన్ పోస్టు చేశారు.