ఎవరూ అధైర్యపడవద్దు

కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైయ‌స్ జ‌గ‌న్‌ మమేకం

తాడేప‌ల్లి: ఎవ‌రూ అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధైర్యం చెప్పారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని త‌న క్యాంపు కార్యాల‌యంలోవైయ‌స్ఆర్‌సీపీ  కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో వైయ‌స్ జ‌గ‌న్ మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైయ‌స్ జగన్‌ భరోసానిచ్చారు.

Back to Top