వైయ‌స్‌ జగన్‌ నివాసానికి కేసీఆర్‌, స్టాలిన్‌

 విజయవాడ :  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం ముగిసింది. అనంతరం వైయ‌స్‌ జగన్‌తో పాటు తెలంగాణ కేసీఆర్‌, స్టాలిన్‌లు తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అక్కడ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసిన వైయ‌స్‌ జగన్‌ వారిని సాదారంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. కేసీఆర్‌ వెంట తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, తెలంగాణ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు కూడా అక్కడికి వెళ్లారు.

తాజా ఫోటోలు

Back to Top