బాబును సాగనంపండి

– ప్రకాశం జిల్లాను చిన్న చూపు చూశాడు

– ఫ్లోరైడ్‌ సమస్య వేధిస్తున్నా పట్టించుకోలేదు

– ఒంగోలు త్రిబుల్‌ ఐటీ ఇడుపులపాయలోనూ..?

– ఒంగోలు పట్టణాన్ని స్మార్ట్‌ సిటీ చేశాడా..?

– టెంకాయ కొడితే రామాయపట్నం పూర్తయినట్టేనా..?

– గత ఎన్నికల హామీ ఒక్కటీ నెరవేర్చలేదు

– 20 రోజులు ఓపిక పడితే మంచి రోజులు

– నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

ప్ర‌కాశం జిల్లా:ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలన చూశాం.మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.   గుండెల మీద చేతులు వేసుకుని ఒకసారి ఆలోచన చేయమని ప్ర‌జ‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని పరిస్థితి  ఉందన్నారు. ప్ర‌కాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టంగుటూరు ప్రచార సభలో ఆయ‌న ప్రసంగించారు.  రాష్ట్రంలో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. బాబు వచ్చాక సాగునీరు లేదు, తాగు నీరు లేదు. బాబు వచ్చాక రాష్ట్రానికి కరువు వచ్చింది. హెరిటేజ్‌ లాభాల కోసం ప్రభుత్వ డెయిరీలను మూయించాడు. జగన్‌ ప్రకాశం జిల్లాకు వచ్చి ప్రశ్నిస్తే కానీ ఈ ప్రభుత్వంలో చలనం రాదు. బాబు వచ్చాక పిల్లలు చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి.

బాబు వచ్చాక పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీ రుణాలు లేవు.  బాబు వచ్చాక 108 మూలన పడ్డాయి. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయింది. ఎన్నికలప్పుడు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. జాబు ఇవ్వలేకపోతే రెండు వేలు ఇస్తానన్నాడు. ఇప్పుడు జాబు రావాలంటే బాబు పోవాలి. కరువు మండలాల ప్రకటనలో నిర్లక్ష్యం, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగరగొట్టాడు. ఈ జిల్లాలో కరువు తాండవిస్తోంది. ఏటా 6 లక్షల మంది ఉపాధి కోసం పొట్ట చేతబట్టుకుని వలస వెళ్తున్నారు. బాబు వచ్చాక ఉపాధి హామీ పథకాన్ని నీరు చెట్టు పేరుతో దొచుకున్న ఘనత బాబుదే. ఎన్నికలకు రెండు నెలల ముందు రామాయపట్నం పోర్టు దగ్గర టెంకాయ కొడుతున్నాడు. మరో 20 రోజుల్లో జరిగే ఎన్నికల్లో మీరు నిర్ణయం తీసుకోండి. మీ గుండెల మీద చెయ్యి వేసుకని ప్రశ్నించుకోండి. అబద్ధాలు, మోసాలు చేసే నాయకుడిని మళ్లీ ఎన్నుకుని మన జీవితాలను చీకటి చేసుకోవద్దు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఈ 20 రోజులు రోజుకొక సినిమా చూపిస్తాడు

. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీద యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధం విలువలు, విశ్వసనీతకు వంచనకు మధ్య జరుగుతుంది. ప్రతి గ్రామానికి మూటలు మూటలు ఇంటిలిజెన్స్‌ తో పంపిస్తున్నాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే కార్యకర్తలను విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రతి ఇంటికీ వెళ్లి మన నవ రత్నాలు ప్రచారం చేయండి. బాబు మాటలు నమ్మి మోసపోవద్దని వివరించండి. 20 రోజుల్లో మంచి రోజులొస్తున్నాయని చెప్పండి. వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఉందని చెప్పండి. ఉచితంగా ఉన్నత చదువులు చదివిస్తామని ప్రతి అక్కా చెల్లెమ్మకు చెప్పండి. ఎన్ని లక్షలు ఖర్చులైనా అన్నే భరిస్తాడని చెప్పండి.

అయిదేళ్లు చంద్రబాబును నమ్మి మోసపోయాం. మళ్లీ ఇప్పుడు మూడు వేలకు మోసపోవద్దని వివరించండి. అన్న వచ్చాక 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నాలుగు దఫాల్లో రూ. 75 వేలు ఇస్తాడని చెప్పండి. ప్రతి రైతన్నకు వివరించండి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టమని కోరండి. రైతు భరోసా మీకు అండగా ఉంటుందని చెప్పండి. గిట్టుబాటు ధర కోసం మీకు గ్యారంటీ ఉందని చెప్పండి. ప్రతి అవ్వాతాత దగ్గరకు వెళ్లి పలకరించండి. మూడు నెలల కిందట మీకు పింఛన్‌ ఎంత వచ్చిందని అడగండి. ఆ అవ్వకు ఒక్క మాట చెప్పండి. ఎన్నికలు రాకపోయుంటే, జగనన్న రూ. 2 వేలు పింఛన్‌ ఇస్తానని చెప్పకపోయుంటే రెండు వేలు ఇచ్చేవాడు కాదని చెప్పండి. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం... అన్న అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ రూ. 3 వేలు చేస్తాడని వివరించండి. ప్రతి అన్న, అక్క చెల్లి, అవ్వాతాతలను పలకరించండి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. స్థానిక కొండపి నియోజకవర్గ అభ్యర్థి మాదాసి వెంకయ్య, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. 

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు... 
– దొనకొండలో పారిశ్రామిక నగరం
– చీమకుర్తిలో మైనింగ్‌ యూనిట్‌
– కనిగిరిలో జాతీయ ఉత్పత్తుల జోన్‌
– రామాయపట్నం పోర్టు
– ఒంగోలుకు ఎయిర్‌ పోర్టు
–ఫుడ్‌ పార్కు 
– వెలిగొండ ప్రాజెక్టు పూర్తి
– వెటర్నరీ యూనివర్సిటీ 
– ఒంగోలు స్మార్ట్‌ సిటీ
– త్రిబుల్‌ ఐటీ (వాళ్లంతా ఇడుపుల పాయలో చదువుతున్నారు)  
   వీటిల్లో ఒక్కటైనా నెరవేర్చలేదు.

Back to Top