బాబుగారూ.. మీ అనుభవం ఇదేనా..?

ఏడాది పాల‌న‌లో అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారు

కాగ్‌, మోస్పి గణాంకాలతో వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

తాడేప‌ల్లి:  ద‌శాబ్ధాల అనుభ‌వం ఉంద‌ని చెప్పుకుంటున్న చంద్ర‌బాబు త‌న ఏడాది పాల‌న‌లో రాష్ట్రానికి ఎలాంటి మంచి చేయ‌లేక‌పోయార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. చంద్రబాబు పాలన ఏడాదికి చేరువవుతున్న వేళ.. ఎక్స్ వేదిక‌గా ఆయ‌న‌ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. దశాబ్దాల అనుభవానికి ఏమైందని.. ఈ ఏడాది కాలంలోనే అడ్డగోలుగా అప్పులు చేసినా ప్రజలకు ఎలాంటి మంచి చేయలేకపోయారని సోమవారం ఆయన కాగ్‌, మోస్పి గణాంకాలతో ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు దిగజార్చటంపై వైయ‌స్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చంద్రబాబు గారూ.. దశాబ్దాల మీ అనుభవానికి ఏమైంది?. రాజకీయానుభవంతో పాటు  ముఖ్యమంత్రిగా పని చేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా. కానీ, ఆ అనుభవం ఈ ఏడాదిగా ఏం రాష్ట్రానికి ఏం ఇచ్చింది?. కేవలం ఈ ఏడాది పాలనలో మీరు చేసిన అప్పులు.. ఐదేళ్ల మా హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44 శాతంగా ఉంది. ఒకవైపు వాస్తవం ఇలా ఉంటే.. మరోవైపు ఈ ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షేమం జాడే లేదు. మీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేదనే వాస్తవాలను కాగ్‌, మోస్పి గణాంకాలే చెబుతున్నాయి’’ అంటూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

@ncbn garu, you claim that you possess decades of experience as CM and your so-called deep understanding of governance, but what have those decades of experience delivered? In just one year, your Government availed a debt equivalent to 44% of the total debt our Government availed in five full years. This is despite the fact that during this one-year period, your Government had nothing to show for, with respect to development or welfare. Figures released by CAG & MOSPI reveal shocking facts about the inefficient fiscal mismanagement by your Government- 1. Fiscal Deficit to GSDP rose from 4.08% → 5.12% 2. Revenue Deficit to GSDP jumped from 2.65% → 3.61% 3. Debt-to-GSDP now stands at a staggering 35.64%, despite the absence of any adverse circumstances such as the pandemic outbreak. 4. Only 23.49% of borrowings were used for capital expenditure in 2024-25, while under our governance, it was 33.25%.

Image

Image

Image

 

Image

Back to Top