అజ‌య్‌కుమార్‌ను ప‌రామ‌ర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌

వైయ‌స్ఆర్ జిల్లా: వేంప‌ల్లెలో టీడీపీ రౌడీమూక‌ల దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త అజ‌య్‌కుమార్‌రెడ్డిని పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న నిమిత్తం క‌డ‌ప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌.. పార్టీ కార్యకర్త దాడి గురించి తెలుసుకొని నేరుగా రిమ్స్ ఆస్ప‌త్రికి చేరుకున్నారు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అజయ్ కుమార్ రెడ్డిని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను పరామర్శించారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. అజ‌య్‌కి మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యుల‌కు సూచించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, చికిత్స‌కు అవసరమైన సాయం అంద‌జేస్తామ‌ని భరోసా ఇచ్చారు. 

Back to Top