మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు

ఆరునెలల్లో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదు.

రాష్ట్రంలో వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయి.

వైద్యరంగం పరిస్థితి దయనీయంగా ఉంది.

వ్యవసాయ రంగం కూడా కుదేలైంది.

విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది.

ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా.

నియోజకవర్గాల్లో  మైనింగ్ సహా ప్రతిదానికి ఎమ్మెల్యేలకు మామూళ్ళు ఇవ్వాలి.

రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది.  

తొలిసారిగా మేనిఫెస్టోలో హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం.

బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే  సంక్షేమ కేలండర్ ఇచ్చాం.

మనం కుటుంబం మొత్తానికి సహాయం చేశాం.

టీడీపీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్దాలు చెప్పారు.

సంక్రాంతి తర్వాత నేను పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటిస్తాను.

ప్రతి బుధవారం, గురువారం కార్యకర్తలతో మమేకం అవుతాను.

కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం పేరుతో కార్యక్రమం.

ఈ లోగా  జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. 

ప్రతి కార్యకర్తకు ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ అకౌంట్లు ఉండాలి.

గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి.

తాడేప‌ల్లి:  కూట‌మి ప్ర‌భుత్వం ఆరు నెల‌ల కాలంలోనే ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను మూట‌క‌ట్టుకుంద‌ని, మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు పిలుపునిచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా  చెందిన పార్టీ  స్థానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో మాజీముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌.జగన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కుల‌కు ప‌లు అంశాల‌పై వైయ‌స్ జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వైయస్.జగన్ ఏమన్నారంటే... 

  • ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరునెలలు కావస్తోంది. ఆరునెలల కాలంలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేదు. తొలిసారిగా చూస్తున్నాం. 
  • ఇలాంటి నేపధ్యంలో మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాల్టికి కూడా మన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. 
  • కేవలం వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని మనం సగర్వంగా చెప్పగలం.
  • మామూలుగా రాజకీయపార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో  అని రంగు, రంగులు కాగితాలు ఇచ్చి దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితుల నుంచి...తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ... అందులో 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పధకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే బడ్జెట్ తో పాటు సంక్షేమ కేలండర్ ను విడుదల చేసి క్రమం తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం.చరిత్రలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది.
  • ఆ రకమైన మంచి మనం చేశాం. ఆ రకమైన మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమైనా వాటిని పక్కనపెడితే... మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ వస్తే ఈ సారి 40 శాతం వచ్చింది. వైయ‌స్ జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు. కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి పొరపాటున చేయి అటువైపు పోయింది. తీరా ఇవాల చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు అన్న మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తుంది.
  • ఆ రోజుల్లో మనం ఏ ఇంటికి పోయినా చిక్కటి చిరునవ్వుతో ఆహ్వానించారు.ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రమైన ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎవరు కనిపించినా...చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15వేలు అని వాళ్ల తల్లులు  కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, అంతకన్నా పెద్దవాళ్లు వాళ్ల అత్తగారు కనిపిస్తే నీకు రూ.48వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం చేసే వయస్సున్న పిల్లాడు వస్తే నీకు రూ.36 వేలు అని ఆ ఇంట్లో రైతు కండువా వేసుకుని బయటకు వస్తే నీకు రూ.20వేలు అని చెప్పారు.
  • మనం కుటుంబం మొత్తానికి సహాయం చేస్తుంటే.. టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్దాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు.  కానీ మనం అలా చేయలేదు.
  • ఇవాల్టికి నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు.. మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మరలా మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం.
  • ఆరునెలల కూటమి పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలు నా రూ.15వేలు ఏమైందని.. రైతులు నా రూ.20వేలు ఏమైందని.. ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి.
  • మరోవైపు వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్న పరిస్థితులు. స్కూళ్లలో నాడు నేడు లేదు. ఇంగ్లిషు మీడియం లేదు. మన హయాంలో రోజుకొక మెనూతో భోజనం పెట్టే గోరుముద్ద ఉండేది. ఇవాళ అధ్వాన్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, టోఫెల్ ఎత్తివేశారు. 8వతరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
  • మన హయాంలో ఆరోతరగతి నుంచి డిజిటిల్ క్లాస్ రూములు తయారు చేశాం. మన హయాంలో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడతాయా అన్న పరిస్థితి నుంచి...  ఇవాళ పూర్తిగా తిరోగమనంలోకి స్కూళ్లు వెళ్లిపోయాయి. ఇవాళ గవర్నమెంటు బడులు మాకు వద్దు అని పేదవాడు అనుకునే పరిస్ధితుల్లోకి నెట్టేశారు. 
  • అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు. ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెల ఇచ్చేవాళ్లం. ఈ రోజు ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు బకాయిలు పెట్టారు. వసతి దీవెన గాలికెగిరిపోయింది. పిల్లలు చదువుకునే కాలేజీలు యాజమాన్యాలు మీరు ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని వారిని ఇంటికి పంపిస్తున్నారు.
  • వైద్యరంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్ వర్క్ ఆసుపత్రులకు మార్చి నుంచి ఇంతవరకు బిల్లులు చెల్లింపులేదు. మార్చి నుంచి నవంబరు వరకు లెక్కిస్తే.. ఇప్పటికీ ఇంకా రూ.2400 బకాయిలు ఉన్నాయి. నెట్ వర్క్ ఆసుపత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. 104,108 ఆగష్టు నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. నడపలేని పరిస్థితి. కుయ్  కుయ్ మంటూ రావాల్సిన అంబులెన్స్ లు చతికిలపడుతున్నాయి.  మన ప్రభుత్వ హయాంలోఆరోగ్యశ్రీ పరిధిని 3350 రోగాలకు పెంచి రూ.25 లక్షల వరకు  ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాం. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్ల్యూహెచ్ ఓ,  జీఎంపీ ప్రమాణాలతో మందులు ఇచ్చేలా మార్పులు తెచ్చాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి, ప్రతి పదిహేను రోజులకొకమారు ఊరికే వచ్చి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అంతా తిరోగమనం.
  • వ్యవసాయ రంగం కూడా కుదేలైంది.ఆర్బీకేలు స్థాపించి, ఇ-క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా పెట్టాం. దళారీ వ్యవస్థ లేకండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే... ఈరోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్ధతు ధర రావడం లేదు. రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేలు  నిర్వీర్యం అయిపోయాయి. ఇ-క్రాప్ గాలికెగిరిపోయింది. పారదర్శకత పక్కకుపోయింది. తిరోగమనంలో వ్యవసాయం ఉంది.
  • డోర్ డెలివరితో ప్రతి పధకం ఇంటికి అందించే పాలన మనదైతే..ఈ రోజు డోర్ డెలివరీ మాట, మంచి పాలన దేవుడెరుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్ధితి కూడా లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని హలో అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు... అసలు పథకాలుంటే కదా.
  • విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు చూస్తే..మన కన్నా తక్కు రేట్లకు ఇస్తామన్నారు.  మన హయాం కంటే రెట్టింపు  ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2-3 లక్షలకు బెల్టుషాపులు నడుపుతున్నారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా... ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, పరిశ్రమ నడవాలన్నా ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి,ఆయన కొడుకుకి ఇంత అని దోచుకోవడం, పంచుకోవడం జరుగుతుంది. 
  • రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇలాంటి దుర్మార్గమైన పాలన వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. 

ఆరు నెలలు అయింది. మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. 

  • ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయింది. జమిలి అంటున్నారు. అందరం చురుగ్గా ప్రజల తరపున పనిచేయాలి. ప్రజల తరపున గళం వినిపించాలి. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నాను. ప్రతిఒక్కరూ ప్రజలకేం కావాలి, వారికి తోడుగా అండగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. 

రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. 

  • నా జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుంది.అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధవారం, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కార్యకర్తలతో మమేకం అవుతాను. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అన్న పేరుతో ఈ కార్యక్రమం చేస్తాను.
  • పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ, నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. నా పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. నా కార్యక్రమం మొదలైనప్పుడు 
  • గ్రామ స్థాయి, బూత్ కమిటీల వరకు నియామకాలు పూర్తి చేద్దాం. ఈ కమిటీల పూర్తైన తర్వాత ప్రతి సభ్యుడికీ సోషల్ మీడియా మాధ్యమంలో ఉండే ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్,  యూట్యూబ్ అన్ని అకౌంట్లు ఉండాలి. మన గ్రామంలో ఏం జరుగుతున్నా అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆసుపత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు?  అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతిదీ ఫోటో తీసి అప్ లోడ్ చేయాలి.
  • మనం కేవలం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నాం.వీళ్లు ఆకాశం నుంచి ఒక అబద్దాన్ని సృష్టిస్తారు.దానికి రెక్కలు కట్టి ఇంత మందితో ప్రచారం చేస్తారు. ఇవన్నీ తిప్పికొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి.అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవంలా పనిచేయాలి.
  • మోసంతో అధికారంలో వచ్చిన వీళ్లు ప్రజల కోపానికి గురికాకతప్పదు. అప్పుడు వీళ్లు ఎంత దూరంలో పడతారంటే... తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం. మనం అందరం కలిసికట్టుగా నిలబడాల్సిన సమయం ఇది.
Back to Top