తాడేపల్లి:బీఆర్‌ఎస్ అధినేత,తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైయస్ జగన్ సోమవారం తన ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావుగారికి శుభాకాంక్షలు. దేవుడు ఆయనకు ఆరోగ్యం,సంతోషకరమైన పరిపూర్ణ జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’అని వైయస్ జగన్ ఆకాంక్షించారు.