సున్నపురాళ్లపల్లెలో సీఎం వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం

కాసేపట్లో కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ

వైయస్‌ఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సున్నపురాళ్లపల్లె చేరుకున్నారు. స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భూమిపూజ చేయనున్నారు. 

ప్రభుత్వ సహకారంతో సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్‌ను జేఎస్‌డబ్ల్యూ సంస్థ నిర్మిస్తోంది. రూ.8,800 కోట్లతో కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం జరగనుంది. లీజు ప్రాతిపదికన జేఎస్‌డబ్ల్యూ సంస్థకు 3500 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. తొలి విడతలో రూ.3.300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి.. రెండో విడతలో మరో 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంలో ప్లాంట్‌ విస్తరణ చేపట్టనున్నారు. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు కానుంది. 36 నెలల్లో తొలిదశ యూనిట్‌ అందుబాటులోకి తేవాలని లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో 25 వేల మందికి ప్రత్యేకంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.  
 

Back to Top