జోరు వానలోనూ కొనసాగుతున్న విశాఖ గర్జన ర్యాలీ

విశాఖ‌: విశాఖ గర్జన ర్యాలీ జోరు వానలోనూ కొనసాగుతోంది. 3 కిలోమీటర్లకు పైగా సాగే ఈ యాత్రను నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహిస్తుండగా.. అధికార వైయ‌స్ఆర్‌ సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన జేఏసీ నేతలు,మంత్రులు.. అనంతరం విశాఖ గర్జన ర్యాలీ ప్రారంభం. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన స్పీకర్, సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స, రజని, జోగిరమేష్, ఆర్కే రోజా, నాగార్జున త‌దిత‌రులు పాల్గొన్నారు. అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి పార్క్‌ హోటల్ వైయ‌స్ఆర్ విగ్రహం వరకూ ర్యాలీ కొనసాగనుంది. రా భారీ ప్రదర్శనకు అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రకరణతోనే తమ ‍ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినదిస్తున్నారు. అమరావతి వద్దు, రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు.. మూడురాజధానులు ముద్దు అంటూ బెలూన్లతో ర్యాలీ కొనసాగుతోంది.
విశాఖ గర్జనకు ఊహించిన దానికంటే అనూహ్యమైన మద్దతు లభించిందని నాన్ పొలిటికల్ జె.ఏ.సీ. అంటోంది. వేలాది మంది జై విశాఖ నినాదాలు చేస్తుండగా ర్యాలీ స్టార్ట్ అయింది. వ‌ర్షం కురుస్తున్నా జనం మాత్రం హుషారుగా ముందుకు కదులుతున్నారు. జనం జాతరగా మారంది విశాఖ‌ గర్జన ప్రాంగణం.

Back to Top