పాక్షికంగా లాక్‌డౌన్‌ సడలించాలని కేంద్రాన్ని కోరాం

 వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ  విజయసాయిరెడ్డి 
 

 
 విశాఖపట్నం : రైతులు, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం హాట్‌స్పాట్‌ కాని ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్‌ సడలించాలని కేంద్రాన్ని కోరినట్టు  వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ  విజయసాయిరెడ్డి వెల్లడించారు. లాక్‌డౌన్‌ కాలంలో పేద ప్రజలు ఇబ్బందులు రాకుండా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌  జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ  విజయసాయిరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పారు.  
పకడబ్బందీగా ఇంటింటి ఆరోగ్య సర్వే..
ఇంటింటి ఆరోగ్య సర్వే పకడ్బందీగా జరుగుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ కింద పారిశ్రామికవేత్తలు పేదలకు అండగా ఉండాలని విజయసాయిరెడ్డి కోరారు. ఇప్పటివరకు విశాఖలో సీఎం, పీఎం సహాయ నిధికి రూ. 6 కోట్ల నిధులు విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు విజయసాయిరెడ్డి  హితవుపలికారు. 

Back to Top