రాష్ట్రంలో వైద్య విద్య మరింత బలోపేతం 

 వైద్య శాఖ మంత్రి విడదల రజిని  

గుంటూరు: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్న ఐదు వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించేలా చ ర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశించారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాల­యంలో  ఉన్నతాధికారులతో నిర్వహించిన సమా వేశంలో ఐదు వైద్య కళాశాలల్లో పోస్టుల భర్తీపై మంత్రి సమీక్షించారు.

ఆమె మాట్లాడుతూ బోధనా సి బ్బందిని కాంట్రాక్టు విధానంలో నియమించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కాంట్రాక్టు విధానంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లకు వేతనాలు ఇవ్వడం, అదేవిధంగా శాశ్వత బోధనా సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించేందుకు సాధ్యా సా«­ద్యాలను పరిశీలించాల న్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 కొత్త వైద్య కళాశాలలను నెలకొల్ప డం ద్వారా రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేస్తున్నారని చెప్పారు.

 ఐదు కళాశాలలను ప్రారంభించామని, ఎన్‌ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్యులు, వైద్య విద్యార్థుల హాజరు ఉండేలా పర్య వేక్షించాలని సూచించారు. వైజాగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(విమ్స్‌) బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యశాఖలో ఇప్పటి వరకు 53వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినట్టు గుర్తుచేశారు. వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కా ర్యదర్శి డాక్టర్‌ మంజుల, సెకండరీ హెల్త్‌ డైరెక్టర్, వై ఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ వెంకటేశ్వర్, డీ ఎంఈ డాక్టర్‌ నరసింహం తదితరులు పాల్గొన్నారు.   

తాజా వీడియోలు

Back to Top