తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు ధర్మకర్తల మండలికి నియమితులైన కొత్త సభ్యులతో కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల ప్రభుత్వం 28 మందితో పాలక మండలిని ఏర్పాటు చేసింది. వీరిలో 24 మంది పాలక మండలిసభ్యులుగా, నలుగు ఎక్స్‌అఫిషీయో సభ్యులుగా ఉంటారు. ప్రమాణ స్వీకారం అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తొలి సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల నిర్వాహణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులు వీరే.. 1. కె.పార్థసారథి (ఎమ్మెల్యే) 2. యూవీ రమణమూర్తిరాజు (ఎమ్మెల్యే) 3. ఎం.మల్లికార్జునరెడ్డి (ఎమ్మెల్యే) 4.3పరిగెల మురళీకృష్ణ 5.3కృష్ణమూర్తి వైద్యనాథన్ 6.3నారాయణస్వామి శ్రీనివాసన్ 7. జె.రామేశ్వరరావు 8. వి.ప్రశాంతి 9. బి.పార్థసారథిరెడ్డి 10. డాక్టర్ నిచిత ముప్పవరపు 11. నాదెండ్ల సుబ్బారావు 12. డీ.పీ.అనంత 13.రాజేష్ శర్మ 14. రమేష్ శెట్టి 15. గుండవరం వెంకట భాస్కరరావు 16. మూరంశెట్టి రాములు 17. డి.దామోదర్‌రావు 18. చిప్పగిరి ప్రసాద్‌కుమార్ 19. ఎంఎస్ శివశంకరన్ 20. సంపత్ రవి నారాయణ 21. సుధా నారాయణమూర్తి 22. కుమారగురు (ఎమ్మెల్యే) 23. పుట్టా ప్రతాప్‌రెడ్డి 24. కె.శివకుమార్ ఎక్స్‌అఫీషియో సభ్యులు : 1. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్) 2. దేవాదాయ శాఖ కమిషనర్ 3. తుడా ఛైర్మన్ 4. టీటీడీ ఈవో