నేడు ఢిల్లీకి సీఎం వైయ‌స్‌ జగన్‌

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ.. 

రేపు తిరుమలకు రాక..  

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. దేశ రాజధానిలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అధికార వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.  సీఎం వైయ‌స్‌ జగన్‌ నేటి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరనున్నారు. సాయంత్రం ఢిల్లీలో అమిత్‌ షా తో భేటీ కానున్నారు.

రాత్రి ఢిల్లీలో బస చేసి బుధవారం ఉదయం బయలుదేరి నేరుగా తిరుపతి చేరుకోనున్నారు. బుధవారం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి తిరుమలలోనే బస చేయనున్నారు. గురువారం కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి కర్ణాటక ప్రభుత్వం తిరుమలలో నిర్మించనున్న భవనానికి జరిగే భూమి పూజలో పాల్గొంటారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top