సీఎం వైయ‌స్ జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం

విజయవాడ : కాపు ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను తొలగించడం ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి   చిత్ర పటానికి కాపులు క్షీరాభిషేకం నిర్వహించారు.  విజ‌య‌వాడ న‌గ‌రంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు, కాపు సంఘాల నేతలు  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారన్నారు. రైలు ఘటనలో కేసులు పూర్తిగా రద్దు చేశారన్నారు. కాపు సోదరులకు మంచి జీఓ ఇస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్పందించే మనసు రాలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్క్రిప్టుకే కాదు.. ఇలాంటి వాటికి కూడా పవన్ స్పందించాలన్నారు. కాపు సోదరులకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. వైయ‌స్ జగన్ చెబితే చేస్తాడనేది జగమెరిగిన సత్యమన్నారు. కుల, మత, ప్రాంత, జాతి భేదాలు లేని సీఎంను బాధపెట్టకూడదన్నారు. ప్రతిపక్షాల తీరు మార్చుకోకపోతే ఈసారి డిపాజిట్లు కూడా దక్కవని అడపా శేషు పేర్కొన్నారు.

Back to Top