సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు  కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జగన్‌కు పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు  కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే పోలీసు ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు రూ. 554 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం.
పోలీసు శాఖలోని ప్రతి అధికారి, సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధుల హర్షం
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎండి.మస్తాన్‌ఖాన్, ట్రెజరర్‌ ఎం.సోమశేఖర రెడ్డి, ఉప్పు శంకర్, కె.రామునాయుడు, బి.స్వర్ణలత, పి.శేషయ్య, సీహెచ్‌.హజరత్తయ్య, డి.సురేష్, ఆర్‌.నాగేశ్వరరావు, జి.అక్కిరాజు, పి.ఓంకార్, కె.నాగిని, టి.మాణిక్యాలరావు.

Back to Top