ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌ల దాడి

రాళ్ల దాడిలో ఎంపీ కారు అద్దాలు ధ్వంసం

విజయనగరం: రామతీర్థంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనను పరిశీలించేందుకు వచ్చిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్ల దాడిలో ఎంపీ విజయసాయిరెడ్డి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అడ్డుకున్న పోలీసులపై కూడా టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. 

అంతకు ముందు విజయనగరం జిల్లా రామతీర్థం చేరుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి జైశ్రీరామ్‌ నినాదాలతో పార్టీ నాయకులతో కలిసి శ్రీరాముడి కొండపైకి చేరుకున్నారు. అనంతరం రామతీర్థంలోని శ్రీరాములవారి కోవెలలో జరిగిన ఘటనను పరిశీలించారు. అనంతరం కొండ కిందకు దిగారు. 
 

Back to Top